విక్రమ్ బొమ్మా బొరుసు వేస్తూ దివ్య గురించి ఆలోచిస్తాడు. మొదటి చూపులో నా మనసు దోచేసింది. రెండో చూపులో నా మనసుకి గాయం చేసింది. మూడో చూపులో గాయాన్ని నయం చేసింది. నాలుగో చూపు ఉంటుందంటావా అని విక్రమ్ అంటాడు. అయితే ఓ పని చేయండి మీరు పని చేస్తున్న హాస్పిటల్ నాదే అని చెప్పమని దేవుడు సలహా ఇస్తాడు. బాగోదని అనేసరికి ఎవరో ఒకళ్ళకి కాలు చెయ్యి విరిగిందని చెప్పి వెళ్ళి పరిచయం పెంచుకోమని మరొక సలహా ఇస్తాడు. దీంతో విక్రమ్ దేవుడినే తీసుకెళ్లాలని అనుకుని తన వెంట పడుతుంటే తప్పించుకుంటూ మేడ మీద నుంచి హాస్పిటల్ బెడ్ మీద పడతాడు. విక్రమ్ సంబరంగా దేవుడిని దివ్య దగ్గరకి తీసుకెళ్తాడు.


Also Read: అపర్ణ కాళ్ళ మీద పడిన కనకం- హోరాహోరీగా పోట్లాడుకున్న రాజ్, కావ్య


డాక్టర్ దగ్గరకి వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లకూడదని పేషెంట్ ని తీసుకొచ్చానని విక్రమ్ సంబరంగా చెప్తాడు. దివ్యతో మాట్లాడటం కోసం విక్రమ్ కాసేపు కామెడీ చేస్తాడు. దివ్య దేవుడికి ట్రీట్మెంట్ చేస్తుంది. రోజుకి మూడు పూటల హాస్పిటల్ కి తీసుకొస్తానని విక్రమ్ లోడా లోడా వాగేస్తాడు. అతనికి బాగానే ఉందని దివ్య చెప్తుంది. దేవుడిని ఎక్కడో చూసినట్టు ఉందని దివ్య అంటుంది. విక్రమ్ మాటలు విని ఇప్పుడు మీరు మరింత నచ్చారని అంటుంది. దివ్య, విక్రమ్ మధ్య దేవుడిని బకరాని చేసి ఆడతాడు. తులసి గుడికి వెళ్తుంది. అదే గుడికి రాజ్యలక్ష్మి వస్తుందని బసవయ్య కాసేపు హడావుడి చేస్తాడు. పొద్దుటి నుంచి దైవదర్శనం కోసం ఎండలో పడిగాపులు కాస్తున్నాం ఈవిడ ఎవరో డైరెక్ట్ గా వెళ్తుందని అక్కడ ఆడవాళ్ళు అంటారు. మేడమ్ వస్తున్నారు జనాలని పక్కక తోసేయమని బసవయ్య అనేసరికి తులసి ఆగమని అంటుంది. రాజ్యలక్ష్మి అప్పుడే వస్తుంది.


Also read: ఇది కదా ఎన్నెన్నో జన్మల బంధం అంటే.. ప్రేమ ఊహల్లో తెలిపోతున్న యష్, వేద


ఇంతమంది లైన్ లో నిలబడితే మీరేంటి తోసుకుని వెళ్లిపోతున్నారు దేవుడికి అందరూ సమానమేనని కాసేపు క్లాస్ తీసుకుంటుంది. బసవయ్య అక్క అక్క అంటూ తెగ డప్పు కొడతాడు. మీ అక్క ఎవరో రమ్మను అనేసరికి రాజ్యలక్ష్మి వస్తుంది తనని చూసి తులసి గతంలో ఆమెని చూసిన ఘటన గుర్తు చేసుకుంటుంది. మొన్న హాస్పిటల్ లో గొడవ పడింది మళ్ళీ ఇక్కడికి వచ్చిందని రాజ్యలక్ష్మి మనసులో తిట్టుకుంటుంది. తులసి రాజ్యలక్ష్మిని మంచిది అనుకుని తన తరఫున మాట్లాడుతూ బసవయ్యని తిడుతుంది. దేవుడి ముందు అందరూ సమానమే నేను వెళ్ళి లైన్లో నిలబడతానని రాజ్యలక్ష్మి అంటుంది. అదేంటి అక్క ఇలా అయిందని బసవయ్య అనుకుంటాడు. పూజారి వచ్చి తులసిని పాట పాడమని అడుగుతాడు. ఎవరు ఈ తులసి ఎందుకు నాకు తగులుకుంటుంది, తన గురించి తెలుసుకుని అంతు తేల్చాలని రాజ్యలక్ష్మి డిసైడ్ అవుతుంది. పూజారి పూజ చేసిన తర్వాత ముందుగా హారతి తులసికి ఇచ్చి తర్వాత రాజ్యలక్ష్మి దగ్గరకి వెళతాడు. అది చూసి రాజ్యలక్ష్మి కోపంగా హారతి తీసుకోకుండానే వెళ్ళిపోతుంది.