దీపం లేని ఇల్లు నివాస యోగ్యం కాదని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా ఇంట్లో చేసే దీపారాధనకు సంబంధించిన నియమాలు అందరికీ తెలియవు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి? నిత్య పూజకు ఉపయోగించాల్సిన దీపాలు ఏమిటి? ప్రత్యేక పూజలో ఎలాంటి దీపాలు వాడాలి? వంటి సందేహాలు అందరికీ ఉంటూనే ఉంటాయి.


నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడకూడదు. పంచలోహాలతో చేసిన దీపాలు, వెండి లేదా ఇత్తడి దీపాలు వాడాలి. తెల్లవారు జామున 3 నుంచి 6 లోపు దీపారాధన చెయ్యడం శుభకరం. సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీ ఆరాధన చేసి.. దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట. తూర్పు ముఖంగా వెలిగించే దీపం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహ దోష నివారణ జరుగుతుంది. ఉత్తర దిశగా వెలిగించే దీపం సిరిసంపదలు, విద్య, వివాహ ప్రాప్తికి దోహదం చేస్తుంది. దక్షిణ దిశగా దీపారాధన చెయ్యకూడదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దు:ఖం, బాధ కలుగుతాయని శాస్త్రం.


వత్తి ఎలాంటిది?


దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. తెల్లటి కొత్త వస్త్రాన్ని పన్నీరులో తడిపి, దానితో ఒత్తులుగా చేసి దీపారాధన చేస్తే శుభఫలితాలు కలుగుతాయి. జిల్లేడు పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఈతి బాధలు తొలగించుకోవచ్చు.


ఏ తైలం?


ఇది అందరికీ ఉండే అనుమానమే. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపారాధన చెయ్యకూడదు. నువ్వుల నూనె వాడితే మంచిది. ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్యం సజావుగా ఉంటుంది. విప్ప, వేప, కొబ్బరి నూనెలు  కలిపి 41 రోజులు దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నేతి దీపం అత్యంత మంగళకరం. నేతి దీపం ప్రతి రోజూ సంధ్యా సమయంలో తులసి ముందు, ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తారు. నేతి దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి.


నేతి దీపాన్ని రోజూ దీపారాధనకు ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది దేవతలకు ఇష్టమైన దీపారాధన. ఇంటి వాతావరణంలో ఉన్న నెగెటివిటి తొలగిపోతుంది. సాయంత్రం వేళ నేతి దీపం వెలిగిస్తే లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం. నేతి దీపంతో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.


☀ నేయ్యి, నూనె రెండింటితో దీపారాధన చేస్తే చాలా ప్రయోజనాలున్నాయని శాస్త్రం చెబుతోంది.  వీటి కోసం ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. 


☀ మల్లె నూనెతో హనుమంతునికి వెలిగిస్తే శని దేవుడికి ఆవాల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం.


☀ నెయ్యిదీపం ఎప్పుడూ ఎడమవైపు ఉంచాలి. నూనె దీపం కుడివైపు ఉంచాలి. లక్ష్మీ కటాక్షానికి నేతి దీపం శ్రేష్టం.


☀ వాస్తు ప్రకారం ఇంట్లో వెలిగించే దీపానికి దిశలు కచ్చితంగా పాటించాలి. దీపాన్ని తప్పు దిశలో ఉంచడం వల్ల అనర్థాలు జరగవచ్చు.


☀  దీపాన్ని ఎప్పుడు ఇంటికి పశ్చిమాభిముఖంగా వెలిగించాలి. ఇది ఇంట్లోకి సానుకూలతను ఆహ్వానిస్తుంది.


☀ దీపాన్నెపుడు కింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ ఉపయోగించాలి.  కింద దీపం వెలిగిండచం మంచిది కాదు.


Also Read:  శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి