వేద యష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ‘అమ్మ ఎంత బాగా గుర్తు చేసింది నేను ఖుషికి తల్లిని మాత్రమే కాదు ఆయనకి భార్యని కూడా. మా ఇద్దరి మధ్య ఒక దోబూచులాట ఉంది. మా బంధంలో అస్పష్టత ఉంది దానిలో ఎంత గమ్మత్తు ఉంది. ఇది కదా భార్యాభర్తల బంధం అంటే. ఇక నా మనసులో ఏ ఆలోచన వద్దు.. ఒకటే ఆలోచన మా శ్రీవారి గురించే.. నా మనసు నిండా మీరే శ్రీవారు’ అని సంతోషంగా ఉంటుంది. యష్ ఆఫీసుకి ఫారిన్ కంపెనీ వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ కి నో చెప్తారు. కానీ యష్ కూల్ గా తమ కంపెనీ గురించి గొప్పగా చెప్పి వాళ్ళని తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టె విధంగా ఒప్పిస్తాడు. అది చూసి వసంత్ తనకి కంగ్రాట్స్ చెప్తాడు.
Also read: రాజ్ తిక్కకుదురుస్తున్న దుగ్గిరాల ఇంటి కంచు కోడలు- కావ్య దగ్గరకి వచ్చిన కనకం
బిజినెస్ విషయంలో చాలా కూల్ గా వాళ్ళని ఒప్పిచ్చావ్ మరి వేద వదిన విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తావ్. బిజినెస్ లో గివెన్ టెక్ ఉండాలని అంటావ్, మరి మ్యారేజ్ లో కూడా గివెన్ టెక్ ఉండాలి కదా. రేపు మీకు హ్యాపీ డే. ఎందుకో తెలుసా మీ ఫస్ట్ యానివర్సరీ డే. వదినతో హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అని చెప్తాడు. వేద భర్త ఊహల్లో తెలిపోతూ ఉంటుంది. అప్పుడే యష్ వస్తాడు. వేదలోని అంతరాత్మ బయటకి వచ్చేసి వెళ్ళి యష్ ని కౌగలించుకుని ప్రేమగా ముద్దు పెడుతుంది. ‘ఎన్నెన్నో జన్మల బంధం..’ అంటూ సాంగ్ వేసి ఆ సీన్ ని అద్భుతంగా చూపించేశారు. అదంతా వేద చక్కగా ఊహించుకుని మురిసిపోతుంది. తర్వాత గదిలోకి వచ్చిన తర్వాత యష్ కాలికి వేద కాలి మెట్టె తగులుతుంది. దాన్ని తీసి వేద పెట్టుకోబోతుంటే యష్ వచ్చి తనకి ప్రేమగా పెడతాడు.
చేతులు పాదాలు తాకితే దణ్ణం పెట్టుకోవాలంట అమ్మ చెప్పిందని వేద యష్ చేతులు పట్టుకుని దణ్ణం పెట్టుకుంటుంది. ఈ తృప్తి ఈ హాయి ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఏవండోయ్ శ్రీవారు మీ శ్రీమతికి మీరు కొంచెం కొంచెం నచ్చేస్తున్నారని వేద మురిసిపోతుంది. మాళవిక దగ్గరకి చిత్ర వస్తుంది. వసంత్ కోసం వచ్చానని చెప్తుంది. తను లేకపోతే నాతో మాట్లాడకూడదా అని మాళవిక తనని కూర్చోబెట్టి మాట్లాడుతుంది. కమ్మలు చూపించి ఎలా ఉన్నాయని అడుగుతుంది. అభి ఇచ్చాడని చెప్తుంది. అంటే నెక్లెస్ వేరే వాళ్ళకి ఇచ్చి తనకి ఇవి ఇచ్చి సరిపెట్టాడన్న మాట అని అభిమన్యు గురించి చెప్పాలని అనుకుంటుంది. మాళవిక అభిమన్యు గురించి చాలా సంతోషంగా చెప్తుంది.
మాళవిక: నా పెళ్లి విషయంలో కొంతమంది కుట్ర చేస్తున్నారు. అభిమన్యుని పెళ్లి చేసుకోవడం చూసి కుళ్ళు కుంటున్నారు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నా అభిమన్యు గురించి ఎవరు ఎంత దగ్గర వాళ్ళు చెప్పినా వినదలుచుకోలేదు నేను తీసుకుంది కరెక్ట్ నిర్ణయమే కదా
Also read: రాజ్ తిక్కకుదురుస్తున్న దుగ్గిరాల ఇంటి కంచు కోడలు- కావ్య దగ్గరకి వచ్చిన కనకం
చిత్ర: పెళ్లి గురించి నీకు చెప్పేంత దాన్ని కాదనుకుని అభి గురించి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఎంత గుడ్డిగా నమ్ముతున్నావ్ అభిమన్యు నిన్ను వదిలేసి తిరుగుతున్నాడు, తిరుగులేని సాక్ష్యం సంపాదించి వాడి నిజస్వరూపం నిరూపిస్తాను. వాడికి తగిన గుణపాఠం నేర్పించి తీరుతానని అనుకుంటుంది. వేద సులోచన దగ్గరకి రాగానే ఖుషి తనని కౌగలించుకుని హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని విసెష్ చెప్తుంది. మ్యారేజ్ మాత్రమే కాదు మదర్ యానివర్సరీ కూడా అని వేద అంటుంది.