అనసూయ వాళ్ళని ఓదార్చడానికి తులసి తల్లి సరస్వతి వస్తుంది. తులసి తనని చూసి బాధగా కౌగలించుకుని ఏడుస్తుంది. ఎందుకు అంత బాధపడుతున్నావని అడుగుతుంది. కూతురు పట్ల నేను చాలా దారుణంగా ప్రవర్తించాను తనని అనరాని మాటలు అన్నానని చెప్తుంది. అది ఎంత బాధపడుతుందో ఈ అమ్మని ఎంతలా తిట్టుకుందో, అసహ్యించుకుంటుందోనని అంటుంది. రాజ్యలక్ష్మి చేస్తుందని దానికి చెప్పలేను ఏం చేయాలో తెలియక గట్టిగా కొప్పడ్డాను దాని కళ్ళలో నీళ్ళు రాకుండా చూసుకోవాలని ఆశపడ్డాను కానీ నేనే దాని కన్నీటికి కారణమయ్యానని అంటుంది. నీకూతుర్ని అర్థం చేసుకోమనీ సరస్వతి ధైర్యం చెప్తుంది. దివ్య మీద నాకు ప్రేమ తగ్గిపోతుందా ఏంటని విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా రాజ్యలక్ష్మి ఫుడ్ తీసుకుని వస్తుంది. ఈ ఇంట్లో నేను దివ్యకి తల్లి స్థానంలో ఉన్నాను మంచి చెడు చెప్తాను అది నా ధర్మం. అంత మాత్రనా దివ్య మీద నాకు ప్రేమ లేకుండా పోతుందా శత్రువు అయిపోతుందా ఏంటని కన్నీళ్లతో నటిస్తుంది.


అది చూసి విక్రమ్ తెగ ఫీలైపోతాడు. ఈ భోజనం తీసుకెళ్ళి దివ్యకి తినిపించమని చెప్తుంది. ఇటువంటి టైమ్ లో భర్త ప్రేమ కంటే తల్లి ప్రేమ ముఖ్యం. పైగా తను ఇప్పుడు నా మాట వినడం లేదు, అందుకే ఇక్కడ కూర్చున్నానని చెప్తాడు. నాకు కావలసింది అదే అందుకే కదా మీ మధ్య మనస్పర్థలు తీసుకొచ్చిందని అనుకుంటుంది. నేనే భోజనం పెడతానని రాజ్యలక్ష్మి దివ్య గదికి వెళ్తుంది.


Also Read: కేడీ గ్యాంగ్ మీద కంప్లైంట్ ఇస్తానన్న వసు- తండ్రిని తలుచుకుని బాధపడుతున్న రిషి


రాజ్యలక్ష్మి: అత్త ఏం చెప్పినా ఏం చేసినా వినాలి అప్పుడే మనశ్శాంతిగా ఉండొచ్చు అని వార్నింగ్ ఇస్తూ విక్రమ్ ఎదురుగా ఉండటం చూసి మొహం మీద నవ్వు పెట్టుకుని మాట్లాడుతుంది. మీ ఆయన ముందు నన్ను చెడ్డదాన్ని చేయడం నీ వల్ల కాదు


అమ్మ నవ్వుతూ ఉంటే దివ్య మాత్రం కోపం తగ్గించుకోవడం లేదని విక్రమ్ అనుకుంటాడు.


రాజ్యలక్ష్మి: నువ్వు ఈ ఇంటి కోడలు కావడమే ఎక్కువ టీడీటే తిట్టించుకో లేదంటే చస్తావ్ నేను గోరుముద్దలు పెడతాను తిను లేదంటే నీ మొగుడు ఏదోఒకటి అనుకుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నీ చుట్టు తిరుగుతూ ఉంటాడని అనుకుంటున్నావ్ ఏమో అది జరగదు. మధ్యమధ్యలో అన్నం పెట్టబోతుంటే దివ్య వద్దని ఆపేస్తుంది. అది చూసి విక్రమ్ తప్పంతా దివ్యదే అమ్మది ఏమి లేదని అనుకుంటాడు. నిన్ను నా ఇంటి పనిమనిషిని చేస్తాను అందుకే ప్రేమ కానీ ప్రేమతో పిండం పెడుతున్నా నీ మొగుడు పిచ్చోడు రేపో మాపో బలివ్వబోతున్న మేక. మా అమ్మనే ఎదిరిస్తావా అని నీ చెంప పగలగొడతాడు


దివ్య: నా చెంప పగలగొట్టడం కాదు నీ కొడుకుతో నీ చెంప పగలగొట్టిస్తా ఆ రోజు ఎంతో దూరంలో లేదు


Also Read: వేడి వేడి నీళ్ళతో అభిమన్యుకి నీలాంబరి పాదపూజ- మాళవిక కోసం సులోచనని తిట్టిన వేద


రాజ్యలక్ష్మి: ఎడ్చావ్ లో నీతో నా చెప్పులు మోయించి బట్టలు ఉతికిస్తా నా కాళ్ళు పట్టించుకుంటా నీ మీద పగ తీర్చుకుంటా అనేసరికి దివ్య కోపంగా ప్లేట్ విసిరికొడుతుంది. అది చూసి విక్రమ్ కోపంగా వస్తాడు. ఏంటి నువ్వు చేసింది అమ్మని అవమానిస్తావా అని తన మీద అరిచేసి వెళ్ళిపోతాడు. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు నవ్వుతూ వెళ్ళిపోతుంది.