భార్యాభర్తల బంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావాని దివ్యకి విక్రమ్ తాతయ్య బుద్ధి చెప్తాడు. రాజ్యలక్ష్మి నిన్ను రెచ్చగొడుతుంది ఫలితం ఆలోచించకుండా నువ్వు రెచ్చిపోతున్నావ్. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావ్ అందుకే నీ మీద ఆశలు వదిలేసుకున్నా. ఈ ఇంటిని, రాజ్యలక్ష్మిని దారిలోకి తీసుకురావడం నీ వల్ల కాదు. నువ్వు విక్రమ్ ని దూరం పెట్టినంత వరకు నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోలేవని హితబోధ చేస్తాడు. నందు, లాస్య బ్యాగులు పట్టుకుని కిందకి వస్తారు. నాతో కలిసి ఉండటం ఇష్టమేనని నందు కోర్టులో చెప్పబోతున్నాడు ఆ సన్నివేశం చూడటానికి మీరందరూ కూడా కోర్టుకి రండి అని లాస్య పిలుస్తుంది. మీరు మంచి పని చేస్తున్నారని రాములమ్మ మెచ్చుకుంటుంది. ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు ఒడిపోతున్నారో ముఖ్యం కాదు వాళ్ళు సంతోషంగా ఉండటం ముఖ్యమని అనేసరికి అనసూయ తిడుతుంది.


Also Read: యుద్ధం మొదలుపెట్టిన ముకుంద- ప్రేమ Vs పెళ్లి ఏది గెలుస్తుంది


మొగుడు పెళ్ళాలు మేము సర్దుకుపోతామని లాస్య కౌంటర్ వేస్తుంది. కొత్త జంట కోర్టు నుంచి తిరిగి వచ్చేసరికి పెద్దమ్మ హారతి తీసుకుని ఎదురువస్తారని రాములమ్మ అంటుంది. అంత అవసరం లేదు మేము కోర్టు తీర్పు తర్వాత అటు నుంచి అటే వెళ్లిపోతామని చెప్పేసరికి తులసి షాక్ అవుతుంది. అమ్మానాన్నతో తెగదెంపులు చేసుకున్నావా అని అనసూయ బాధగా అడుగుతుంది. తెగదెంపులు ఏముంది నాకు చూడాలనిపిస్తే నేను వస్తాను మీకు చూడాలని అనిపిస్తే మీరు రండని కోపంగా అంటాడు. మనసులో మాత్రం తన బయటకి ఏమి చెప్పలేని పరిస్థితని బాధపడతాడు. నందు వెళ్లిపోతానని అనడంతో తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. లాస్య మాత్రం రెచ్చిపోయి మాట్లాడుతుంది. తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇద్దరూ బయల్దేరతారు. ముసలి తల్లిదండ్రులు ఇద్దరూ ఏడుస్తూ ఉండిపోతారు.


దివ్య విక్రమ్ తాతయ్య చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ కి దగ్గర అవ్వాలని టీ పెట్టుకుని తీసుకెళ్తుంది. కానీ విక్రమ్ మాత్రం కోపంగానే ఉంటాడు. విసిగించొద్దని చెప్తాడు. అలా అయితే ఖర్చవుతుంది బుగ్గ మీద ముద్దు పెడితే వదిలేస్తానని అంటుంది. విక్రమ్ మాత్రం మొహం చీదరగా పెడతాడు. తనని పట్టించుకోకుండా పని చేసుకుంటాడు. విక్రమ్ ని దారిలోకి తెచ్చుకునేందుకు ట్రై చేస్తుంటే రాజ్యలక్ష్మి వస్తుంది. దివ్య టీ ఇస్తుంది తీసుకో అంటే తనకి మూడ్ లేదని కోపంగా చెప్తాడు. బసవయ్య వచ్చి అల్లుడిని ఎందుకు విసిగిస్తారని అంటాడు. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు అలిగారు అలక తీర్చడం కోసం ట్రై చేస్తుందని రాజ్యలక్ష్మి అంటుంది. మెల్లగా దివ్య దగ్గరకి వెళ్ళి మళ్ళీ కొత్త డ్రామా వేస్తున్నావా ఇది నా అడ్డా ఇక్కడ నేను చెప్పిందే రాజ్యమని చెవిలో గుసగుసలాడుతుంది. దివ్య చేతిలో టీ తీసుకుని రాజ్యలక్ష్మి ఇస్తుంటే విక్రమ్ మాత్రం వద్దని చెప్తాడు.


Also Read: వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కనకం -స్వప్న కడుపు డ్రామా రుద్రాణి కనిపెట్టేస్తుందా?


దివ్య ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి చెరవేసి పరువు తీస్తుందని విక్రమ్ తల్లితో అంటాడు. కొత్తగా పెళ్ళైన ఏ ఆడపిల్ల అయినా అదే చేస్తుందిలే అని నక్కమాటలు చెప్తుంది. ఇవాళ కోర్టులో వాళ్ళ నాన్న కేసు ఉంది. లాస్యతో కలిసి ఉండటానికి డిసైడ్ అయ్యాడు. వేరు కాపురానికి కూడా వెళ్తున్నాడు. కోర్టుకి తీసుకుని వెళ్ళమని అడిగేందుకు వచ్చింది నువ్వేమో దూరంగా తోసేస్తున్నావ్ అంతే కదా దివ్య అంటుంది. పని ఉందని వెళ్లనని చెప్తాడు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial