International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి అమెరికా నుంచి ప్రసంగించారు. వీడియో సందేశం ద్వారా మీ అందరితో కనెక్ట్ అవుతున్నానని, కానీ యోగా కార్యక్రమం మిస్‌ కావడం లేదన్నారు ప్రధాని మోదీ. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే భారీ యోగా కార్యక్రమంలో పాల్గొంటాను అన్నారు. భారత్ పిలుపు మేరకు ప్రపంచంలోని 180కి పైగా దేశాలు ఏకతాటిపైకి రావడం చారిత్రాత్మకం అని అభిప్రాయపడ్డారు. 


2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిపాదన వచ్చినప్పుడు రికార్డు స్థాయిలో దేశాలు మద్దతిచ్చాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది. ఓషన్ రింగ్ ఆఫ్ యోగాతో ఈ ఏడాది యోగా డే కార్యక్రమాలు మరింత ప్రత్యేకమయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. 


నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వసుధైవ కుటుంబకం ఆధారంగా యోగా చేస్తున్నారు. యోగా మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్‌ను, బలాన్ని ఇస్తుందని మన గ్రంథాల్లో చెప్పారు. మనలో ఎంతమంది యోగా శక్తిని అనుభవించారు? వ్యక్తిగత స్థాయిలో మంచి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. యోగా శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తుంది.






స్వచ్ఛభారత్ వంటి అంశాల్లో స్టార్టప్‌లకు గత కొన్నేళ్లుగా కనిపించిన అసాధారణ వేగం ఈ శక్తి ప్రభావాన్ని చూపిందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ సంస్కృతి, సామాజిక నిర్మాణం, ఆధ్యాత్మికత, దార్శనికత ఎప్పుడూ కొత్త ఆలోచనలను స్వీకరించే, ఆదరిస్తుందన్నారు. ఎల్లప్పుడూ స్వాగతిస్తున్నామన్నారు. మనం భిన్నత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామని అలాంటి ప్రతి అవకాశాన్ని యోగా బలపరుస్తుందన్నారు. 


యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగా ద్వారా మన వైరుధ్యాలు చెరిపేయాలి. యోగా ద్వారా మన అడ్డంకులను అధిగమించాలి. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ ను ప్రపంచానికి అందించాలి. కర్మలో నైపుణ్యమే యోగం అని చెప్పారు. మనందరికీ ఈ మంత్రం చాలా ముఖ్యమైంది. యోగాతో మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ఈ తీర్మానాలను అలవర్చుకుంటామని విశ్వసిస్తున్నాను.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial