లాస్య సాదాసీదాగా తులసిలా రెడీ అయిపోయి డాన్స్ చేసుకుంటూ కాఫీ చేసుకుని వస్తుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ బిత్తరపోతారు. మీలో తులసి మార్క్ కనిపిస్తుందని శ్రుతి అంటుంది. మామ్ లా గెటప్ వేస్తే మామ్ పెట్టినట్టు కాఫీ ఉండదు అని అభి గాలి తీస్తాడు. ఇప్పుడు ఈ గెటప్ ఎందుకో అని పరంధామయ్య అడుగుతాడు. ఇన్నాళ్ళూ ప్రేమతో సేవ చేశాను, కానీ ఎవరికి దగ్గర కాలేకపోయాను. బాగా మేధోమథనం చేసుకున్నా పని చేయడం కాదు చేస్తున్న పని అందరికీ తెలియడం ముఖ్యం అని తెలుసుకున్నా అనేసరికి ప్రేమ్ కౌంటర్ వేస్తాడు. ఆ మాటకి అందరూ నవ్వుతారు. ఉత్తమ ఇల్లాలుగా అందరి దృష్టిలో పడటానికి ప్రయత్నం చేస్తున్నా దయచేసి నన్ను ఆదరించండి అని తెగ కులుకుతుంది. దివ్య మళ్ళీ లాస్యకి కౌంటర్ వేస్తుంది.


Also Read: పెళ్ళాం ఫోటో చూసుకుని మురిసిపోయిన యష్- భ్రమరాంబిక అవమానం, ఆగ్రహించిన మాళవిక


జోక్ చేయడం లేదు మారాను అని లాస్య అంటే నందు వచ్చి రాములమ్మ కాఫీ అడిగి ఎంత సేపు అయ్యిందని అరుస్తాడు. లాస్య బిక్క మొహం వేసి నందు వైపుకి తిరిగేసరికి వెనుక నుంచి చూసి రాములమ్మ అనుకున్నా అని అంటాడు. అయినా ఈ గెటప్ ఏంటని నందు అడుగుతాడు. మళ్ళీ ఎక్కం చెప్తావా ఏంటని అంకిత అంటుంది. అంత టైమ్ లేదమ్మా అందరికీ అన్ని చేయాలని పెద్ద లిస్ట్ చదివి మళ్ళీ తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంటి బయట కూర్చుని ముగ్గు వేస్తూ ఉండగా భాగ్య వచ్చి పని మనిషి అనుకుని లాస్య ఉందా ఇంట్లో అడుగుతుంది. భాగ్య కూడా నన్ను గుర్తు పట్టలేదా అని అనుకుంటుంది. నేనే లాస్య అనేసరికి నీ పేరు కూడా ఆదేనా అని లాస్య గురించి నోరు జారుతుంది.


ఈ ఇంట్లో లాస్య ఒక తింగరిది నోటి దురుసు ఎక్కువ అని భాగ్య అంటుంది. ఆ మాటకి లాస్య భాగ్య వైపు తిరిగి నేను తింగరిదాన్న అని తిడుతుంది. ఏ మాటకి ఆ మాట కానీ తులసి అక్కలా గెటప్ అయితే వేశావ్ కానీ సెట్ అవలేదులే అని గాలి తీస్తుంది. అయినా ఈ గెటప్ ఎందుకు వేశావ్ అని అడుగుతుంది. ఉత్తమ ఇల్లాలు అంటే తులసిలా ఉండాలంటా నందు చెప్పాడు, అందుకే తులసిలా మారి ఇంట్లో వాళ్ళందరినీ నావైపుకి తిప్పుకోవాలని చెప్తుంది. ఇక లాస్యకి కాసేపు బిస్కెట్ వేస్తుంది. ఉత్తమ ఇల్లాలు అవాలంటే తులసిలా ఉండాల్సిన అవసరం లేదు నీలా ఉంటే చాలని సలహా ఇస్తుంది భాగ్య. తులసి ఇంటికి కొరియర్ వస్తుంది. అది చూసి నందు ఆగ్రహంతో ఊగిపోతాడు.


Also Read: తన తిక్క చేష్టలతో నవ్వులు పూయించిన లాస్య- మొహాన నీళ్ళు కొట్టిన రాములమ్మ


నందు: ఈరోజు ఈ ఇంట్లో నా స్థానం ఏంటో తెలిసిపోవాలి. దివ్య నీ కూతురా, నా కూతురా


తులసి: మన కూతురు


నందు: అలాంటప్పుడు దివ్యకి సంబంధించిన విషయాలు కలిసి కూర్చుని తీసుకోవాలి. ఎవరిని అడిగి దివ్యని స్పెషల్ కోరస్ కోసం ఢిల్లీకి పంపిస్తున్నావ్. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావ్. నా కూతురు ఢిల్లీ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యిందని ఈ లెటర్ చదివితే కానీ నాకు తెలియలేదు


తులసి: ఈ లెటర్ లో దివ్య ఫాదర్ గా మీ పేరే ఉంటుంది


నందు: అప్లై చేసే ముందు నాకెందుకు చెప్పలేదు. చచ్చిపోయాను అనుకుంటున్నారా. దివ్య నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వు చదువుకుంటాను అంటే వద్దని అడ్డుపడతానా


దివ్య: డబ్బులు లేక చదువుకోవాలనె ఆశ వదిలేశాను కానీ అమ్మ డబ్బు ఏర్పాటు చేస్తాను చదువుకో అని చెప్పింది


మొన్న ఏం జరిగిందో చూశారు కదా పక్కన ఉండి కూడా కూతుర్ని కాపాడుకోలేకపోయాను ఇంక అంత దూరం పంపిస్తే ఎలా అని నందు బాధపడతాడు.