దివ్యని పెళ్లికి ఒప్పించడం కోసం లాస్య, నందు తులసితో మాట్లాడటానికి వస్తారు. ఇంటి కష్టాలు తీరాడానికి నువ్వే కారణమని లాస్య సోప్ వేస్తుంది. దివ్య చిన్నపిల్ల తనకి ఏం తెలుసు పెద్ద వాళ్లగా మనం చేయాలని లాస్య అంటుంది. మీరే చెప్పి చూడండి అని అంటుంది అది మా వల్ల జరగడం లేదని నువ్వే ఒప్పించాలని నందు అడుగుతాడు. అతనితో వియ్యం అందితే బిజినెస్ పరంగా కూడా మంచి పొజిషన్ కి వెళ్లవచ్చని లాస్య అంటుంది కానీ నందు మాత్రం శరత్ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చూపులుగా కాదు కదా క్యాజువల్ గా చూస్తామని అంటున్నారు ఆలోచించి నిర్ణయం తీసుకోమని నందు అనేసి వెళ్ళిపోతాడు.


Also Read: నర్స్ కి ముద్దుపెట్టేసి వేద ముందు అడ్డంగా బుక్కైన యష్- మిస్టర్ యారగెంట్ దుమ్ము దులిపిన విన్నీ


కథలోకి విక్రమ్ వాళ్ళ నాన్న ఎంట్రీ ఇస్తాడు. అతనికి కాలు, చేయి కదలదు, మాట కూడా పోయిందని దేవుడు బాధపడతాడు. తండ్రికి అన్నం తినిపించడానికి విక్రమ్ వస్తాడు. అమ్మని ఆనుమానించి ఈ పరిస్థితికి తెచ్చుకున్నావ్ అని విక్రమ్ తల్లిని వెనకేసుకొస్తుంది. అమ్మ నన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటుంది, నా కన్న తల్లి బతికి ఉన్నా ఇంతగా చూసుకునేది కాదని విక్రమ్ అంటాడు. అది రాక్షసి నిన్ను ఒక్కసారిగా నాశనం చేయకుండా కొద్ది కొద్దిగా నీ జీవితాన్ని నాశనం చేస్తుందని విక్రమ్ తండ్రి మనసులోనే బాధపడతాడు. అమ్మని నమ్మి మోసపోతున్నావ్ అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. విక్రమ్ తండ్రిని ఒప్పించి అన్నం తినిపిస్తాడు. విక్రమ్ తల్లి చనిపోవడంతో తండ్రి రాజ్యలక్ష్మిని రెండో పెళ్లి చేసుకుంటాడు. విక్రమ్ తల్లి ఫోటో పట్టుకుని బాధపడుతుంటే రాజ్యలక్ష్మి వచ్చి తన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. ఆ ప్రేమ నిజమని నమ్మిన విక్రమ్ రాజ్యలక్ష్మిని దేవతలాగా చూస్తాడు.


Also Read: రాజ్ కంట పడకుండా తప్పించుకున్న కావ్య- చెల్లెళ్ళని దగ్గరకి తీసుకుని ఎమోషనల్ అయిన స్వప్న


రాజ్యలక్ష్మికి సంజయ్ పుడతాడు. సవతి ప్రేమ చూపిస్తుందేమో అని విక్రమ్ తండ్రి బాధపడతాడు. రాజ్యలక్ష్మి కన్నా కొడుకుని వదిలేసి విక్రమ్ మీద ప్రేమ చూపించడం చూసి బసవయ్య తన మనసులో విషం నూరతాడు. బావ పేరు మీద ఆస్తి ఉందనే కదా ఈ ఇంటికి కోడలిని చేసింది. కానీ ఈ ఆస్తి అంతా విక్రమ్ తల్లిది. బావ పేరు మీద చిల్లీగవ్వ కూడా లేదు. ఈ ఆస్తి అంతా విక్రమ్ పేరు మీద పెట్టింది. వాడు పెళ్లి అయిన తర్వాత వాడు వాడి పెళ్ళాం సంతకం పెడితే గాని ఆస్తి నీకు దక్కదని బసవయ్య అంటాడు. వాడికి చదువు వచ్చి పెరిగి పెద్దయితే మనకి బూడిదె మిగిలేది అని ఎక్కిస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి విక్రమ్ ని చదువుకోనివ్వకుండా చేసి బతికినా అమ్మ కోసమే చచ్చినా అమ్మ కోసమే అనేలా తయారు చేస్తుంది. కావాలని తనకి మాయదారి జబ్బు ఉందని ఎప్పుడంటే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతానని ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు తన పక్కన ఉండి చూసుకోవాలని అబద్ధం చెప్తుంది. ఆ మాటలు నిజమని నమ్మిన విక్రమ్ చదువుని వదిలేసి తల్లిని చూసుకుంటానని మాట ఇస్తాడు. విక్రమ్ చదువు మానేశాడు వాడి జీవితం నాశనం చేయకు అని విక్రమ్ తండ్రి భార్య మీద అరుస్తాడు.