Stocks to watch today, 28 February 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 7 పాయింట్లు లేదా 0.04 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,495 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


వొడాఫోన్ ఐడియా: ATC టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ. 10,00,000 ముఖ విలువ కలిగిన మొత్తం 12,000 అన్‌ సెక్యూర్డ్‌, అన్‌ రేటెడ్, అన్‌ లిస్టెడ్ ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లను (OCDలు) వొడాఫోన్‌ ఐడియా కేటాయించింది. దీని వల్ల ఈ టెలికాం కంపెనీ మీద అప్పుల భారంలో కొంత ఉపశమనం లభిస్తుంది.


క్రెస్ట్ వెంచర్స్‌: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో NCDs జారీ చేసి, రూ. 100 కోట్ల వరకు సమీకరణ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు క్రెస్ట్ వెంచర్స్ బోర్డ్ మార్చి 2న సమావేశం అవుతుంది.


లక్ష్మి ఆర్గానిక్స్: సంస్థ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ED & CEO) సతేజ్ నబర్ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. ఏప్రిల్ 3 నుంచి ఐదేళ్ల కాలానికి రాజన్ వెంకటేష్‌ను ఎండీ & సీఈఓగా కంపెనీ నియమించింది.


ZEE ఎంటర్‌టైన్‌మెంట్:  ఫ్యూచర్స్ & ఆప్షన్స్ సెగ్మెంట్‌లోకి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ మళ్లీ వచ్చింది.


మహీంద్ర లాజిస్టిక్స్: మహీంద్ర లాజిస్టిక్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ యోగేష్ పటేల్ తన పదవికి రాజీనామా సమర్పించారు. మార్చి 10 నుంచి బాధ్యతల నుండి రిలీవ్ అవుతారు. కొత్త CFOని నియమించే ప్రక్రియలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.


ఇన్ఫోసిస్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎంటర్‌ప్రైజ్ క్లయింట్‌లకు వ్యాపార సేవలను మరింత వేగవంతం చేయడానికి ప్రైవేట్ 5G-యాజ్-ఎ-సర్వీస్‌ను తీసుకువచ్చినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.


విప్రో: నాలుగు వ్యూహాత్మక ప్రపంచ స్థాయి వ్యాపార విధానాలను (GBLలు) విప్రో ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న ఖాతాదార్ల వ్యాపార అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడానికి, మార్కెట్‌లోని అధిక-వృద్ధి విభాగాల్లో పెరుగుతున్న అవకాశాలను ఉపయోగించుకోవడం కోసం ఈ స్ట్రాటెజీలను ప్రకటించింది.


టెక్ మహీంద్ర: ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి $7 బిలియన్ల ఆదాయ మార్క్‌ను చేరుకుంటుందని, అందులో టెలికాం విభాగం నుంచి $3 బిలియన్ల వాటాను అంచనా వేస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


ఎయిర్‌టెల్: నెట్‌వర్క్‌లో 10 మిలియన్ల 5G యూజర్ మార్క్‌ను భారతీ ఎయిర్‌టెల్ అందుకుంది. 2024 మార్చి నాటికి ఎయిర్‌టెల్ 5G సేవలతో ప్రతి పట్టణం, కీలకమైన గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.