దివ్య ప్రేమ విషయం లాస్య ఇంట్లో చెప్పేస్తుంది. ఎంతో అదృష్టవంతురాలివని మెచ్చుకుంటుంది. నువ్వు నా పిల్లలకి తల్లివి కాలేవని ఎన్నో సార్లు అన్నాను కానీ ఇప్పుడు అదే నోటితో అంటున్నా దివ్య తల్లిగా నేను చేయాల్సిన పని నువ్వు చేశావ్ థాంక్స్ అని తులసి చెప్తుంది. ఇక్కడిదాక వచ్చాక ఇంకెందుకు ఆలస్యం పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామని లాస్య అనేసరికి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. వెంటనే లాస్య రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి పని కానిచ్చానని చెప్తుంది. బలి ఇవ్వడానికి ఇచ్చే మేకలా తులసి తన కూతుర్ని తనే ముస్తాబు చేస్తుంది. పెళ్లి అయ్యాక నిజం తెలుసుకుని గుండెలు బాదుకుంటుందని లాస్య సంబరపడుతుంది. దివ్య మీద తన పగ తీర్చుకోవాలని రాజ్యలక్ష్మి మండిపోతుంది. పెళ్లి చూపులు మాత్రమే కాదు పెళ్లి కూడా నీదే బాధ్యత అప్పుడే నీకు కావాల్సింది దక్కుతుందని చెప్తుంది.
దివ్య ఎప్పుడెప్పుడు ఈ ఇంట్లో కుడి కాలు పెడుతుందానని ఎదురుచూస్తున్నానని అనుకుంటుంది. అప్పుడే విక్రమ్ వచ్చి దివ్య గురించి చెప్పబోతుంటే నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకున్నా అమ్మాయి పేరు దివ్య కదా అనేసరికి షాక్ అవుతాడు. మొహం మీద నవ్వు పెట్టుకుని నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది ఈ తల్లికి మంచి మనసున్న, నిజాయితీ కలిగిన కోడల్ని తీసుకొచ్చాడని చెప్తుంది. దివ్య చాలా మంచిదని తన వల్ల నీకు, ఇంట్లో ఎలాంటి సమస్య ఉండదని అంటాడు. తల్లి తన ప్రేమని అంగీకరించినందుకు చాలా సంతోషపడతాడు. రేపే పెళ్లి చూపులని చెప్తుంది. నందు ఆలోచిస్తూ ఉంటే తులసి వస్తుంది. దేని గురించి రేపటి పెళ్లి చూపుల గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది.
Also Read: వసు బాధని గమనించిన జయచంద్ర- ఒకే గదిలో రిషిధార, దేవయానికి పెద్ద షాక్
నందు: తొందరపడి పెళ్లి చూపులు నిర్ణయం తీసుకున్నామెమో. కాస్త ఆలోచించి ఉండాల్సింది. ఇందులో లాస్య ఇన్వాల్వ్ అవడం నచ్చలేదు తన మీద నాకు నమ్మకం పోయింది
తులసి: ఇది లాస్య చెప్పిన సంబంధం కాదు దివ్యకి నచ్చిన సంబంధం
నందు: అలాంటప్పుడు లాస్య ఎందుకు తొందరపడుతుంది. తనకి ఏదైనా లాభం ఉంటే కానీ ఆలోచించదు. తనకి ఒకరి నెత్తిన కాలు పెట్టి ఎదగాలనే ఆలోచన తనది
తులసి: అలాంటి మనిషితోనే కదా మీరు ఇప్పటి వరకు కాపురం చేసింది. అప్పుడు నచ్చిన మనిషి ఇప్పుడు నచ్చడం లేదా మార్పు తనలో కాదు మీ ఆలోచనలో. లాస్యని ఎప్పటికీ నమ్మను. నా భర్తను లాక్కునప్పుడు తన ఆలోచన ఏదో ఇప్పుడు అదే ఆలోచన. నేను దివ్యని నమ్మి ఒప్పుకున్నా. తను ప్రేమించింది కాబట్టి విక్రమ్ మంచి కుర్రాడు
నందు: దివ్య పెళ్లి విషయంలో లాస్యని దూరంగా ఉంచుదామా
తులసి: అది నేను చెప్పలేను తను మీ భార్య మీ ఇష్టం. నాతో శతృత్వం పెంచుకుని విడాకులు తీసుకున్నారు. లాస్య విషయంలో ఆ తప్పు చేయొద్దు. తన గురించి ఆలోచించడం మానేసి మన జాగ్రత్తలో మనం ఉందాం
Also Read: గుండెల్ని పిండేసిన ఎమోషన్- ఒక్క నిమిషంలో జీవితాలు తారుమారు, వేదని అసహ్యించుకున్న యష్
రాజ్యలక్ష్మి కుటుంబం అంతా తులసి ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు. వాళ్ళ ముందు దివ్యని పొగడ్తల్లో ముంచెత్తుతూ తెగ నటిస్తుంది. ఇక తులసి తన జీవితానుభవం గురించి వేదాంతం మొదలుపెడుతుంది. ఇక బసవయ్య రాజ్యలక్ష్మి గురించి మళ్ళీ డబ్బు మొదలుపెడతాడు. విక్రమ్ దివ్య కోసం ఎదురుచూస్తూ ఉంటే అటు తను కూడా లోపల ఉండి బయటకి తొంగి తొంగి చూస్తుంది. నన్ను కూడా అందరితో పాటు హాల్లో కూర్చోబెట్టవచ్చు కదా దివ్య బుంగమూతి పెడుతుంది. తులసి వెళ్ళి దివ్యని తీసుకొస్తుంది. పెళ్లి కొడుకు ఏం మాయ చేశాడో ఏం మంత్రం వేశాడోనని అనసూయ కాసేపు ఆట పట్టిస్తుంది.
ఇక లాస్య పద్ధతి ప్రకారం అడుగుతున్నాం మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంది. నాకు ఇష్టం కాదని అనేసరికి అందరూ షాక్ అవుతారు. నా అదృష్టమని అనేసరికి అందరూ సంతోష్ పడతారు. దివ్య కూడా విక్రమ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్తుంది. నేను నందగోపాల్ విడాకులు తీసుకున్నాం, నా కూతురి పెళ్లి మా బాధ్యత కాబట్టి కలిసే చేస్తున్నామని తులసి చెప్తుంది. అన్నీ తెలిసే వచ్చామని చెప్తుంది. వచ్చే నెల 15 వ తేదీ మంచి ముహూర్తం ఉందని చెప్తుంది. పెళ్లి సింపుల్ గా గుడిలో చేద్దామని రాజ్యలక్ష్మి అంటుంది. అందుకు విక్రమ్, దివ్య ఒప్పుకుంటారు. నందు, తులసి ఒకేసారి మాకెలాంటి అభ్యంతరం లేదని చెప్తారు.