తులసి సామ్రాట్ ఇంటికి వస్తుంది.. తనని చూడగానే హనీ ప్రేమగా వచ్చి కౌగలించుకుంటుంది. హనీ కోసం తులసి ఉప్మా పెసరట్టు తీసుకొచ్చి తినిపిస్తుంది. అది చూసి సామ్రాట్ మురిసిపోతాడు. తులసికి బ్లాంక్ చెక్ పంపించాను ముఖం వెలిగిపోతుంది కదూ.. మధ్య తరగతి మనస్తత్వాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు బాబాయ్ ఈరోజుతో చేసిన తప్పుని సరి చేసుకున్నాను అని సామ్రాట్ తన బాబాయ్ తో అంటాడు. 


తులసి: బ్లాంక్ చెక్ పంపినందుకు థాంక్స్ 


సామ్రాట్: నేను ఎవరి కష్టాన్ని ఉంచుకొను ఫ్రీగా ఎవరి సహాయాన్ని తీసుకొను. విలువ కట్టి డబ్బు ఇచ్చేస్తాను లేకపోతే నాకు నిద్రపట్టదు. మీరు మా హనీ ప్రాణాలు రెండు సార్లు కాపాడారు దానికి విలువ కట్టలేను అందుకే బ్లాంక్ చెక్ పంపించాను. నేను ఏమనుకుంటానో అని మీరు అసలు కంగారూ పడొద్దు మీకు ఎంత కావాలో అంత రాసుకోండి ఇది నాకు చాలా చిన్న విషయం 


తులసి: కానీ ఇది నా వరకు చాలా పెద్ద విషయం అని చెప్పి బ్లాంక్ చెక్ తిరిగి ఇచ్చేస్తుంది. చేసిన సహాయానికి డబ్బు తీసుకుంటే అది సహాయం అనిపించుకోదు. స్వార్థం అవుతుంది, బిజినెస్ అవుతుంది. నేను స్వార్థపరురాలిని కాదు మీలా వ్యాపారవేత్తని కాను మనసున్న మనిషిని. నా చేతిలో బ్లాంక్ చెక్ పెట్టినంత మాత్రాన మీరు చేసిన తప్పులు ఒప్పులు అయిపోవు. మీరు తప్పు తెలుసుకుంటే మరో సారి అలాంటి తప్పు చెయ్యకుండా ఉంటే అదే చాలు. 


సామ్రాట్: మీరు చెక్ తిరిగిచ్చేసి చాలా తప్పు చేశారు. మీరు కష్టాల్లో ఉన్నారు ఇది తీసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేసుకోవచ్చు ఒకసారి ఆలోచించుకోండి. 


తులసి: మా లాంటి మధ్యతరగతి మనుషులకి కష్టాలు కొత్త కాదు. కష్టాలు ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన మీలాంటి డబ్బున్న వాళ్ళకి డబ్బు విలువ తప్పితే జీవితం విలువ తెలియదు. డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటారు. కానీ మధ్యతరగతి మనుషుల ఆత్మాభిమానాన్ని కొనలేరు. డబ్బున్న వ్యక్తి కూతురు అని తెలిసి నేను హనీని కాపాడలేదు. ఆ స్థానంలో పెద వాడి కూతురు ఉన్న నేను ఇదే విధంగా సహాయం చేసేదాన్ని. మనుషుల విలువ డబ్బుతో కాకుండా మనసుతో కొలవడం నేర్చుకోండి సామ్రాట్ గారు మంచితనం కనిపిస్తుంది. 


Also Read: కన్నతండ్రి మీద పగతో రగిలిపోతున్న దేవి- గుండెలవిసేలా ఏడుస్తున్న రుక్మిణి, సత్య మీద అరిచిన ఆదిత్య


ప్రేమ్ శ్రుతి కోసం వాళ్ళ అత్తయ్య కౌసల్య ఇంటికి వెళ్తాడు. శ్రుతి కోసం ఇంట్లోకి చూస్తాడు. గమనించిన కౌసల్య నువ్వు ఒక్కడివే వచ్చావెంటీ నా మేనకోడలని తీసుకురాలేద అని అడుగుతుంది. అంటే శ్రుతి ఇక్కడికి కూడా రాలేదా అని బాధపడతాడు. మా గొడవ గురించి చెప్తే అమ్మకి తెలిసిపోతుందని అనుకుంటాడు. శ్రుతి ఇంట్లోనే ఉందని చెప్పి కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి శ్రుతి ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకి వస్తూ ప్రేమ్ ని పిలుస్తుంది. కానీ కౌసల్య మాత్రం తనని వెళ్లనివ్వకుండా ఆపేస్తుంది. నిజంగా నీకోసం వచ్చిన వాడు అయితే నువ్వు ఇంట్లో ఉన్నవాని ఎందుకు అబద్ధం చెప్తాడు, తను మారాలి అందుకే ఇలా చేశాను నీ విలువ తెలుసుకోవాలి అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్తుంది. ఆ మాటలకి శ్రుతి బాధపడుతుంది. సామ్రాట్ కంపెనీలో నందు ఉద్యోగంలో చేరతాడు. ఎస్ ఎస్ గ్రూప్ కంపెనీ బిజినెస్ గురించి ఓ ప్రకటన ఇచ్చింది ఆంటీ అని అంకిత చెప్తుంది. ఎవరైనా కొత్త ఐడియాలతో వస్తే పెట్టుబడి పెడతారంట మీ మ్యూజిక్ స్కూల్ కి ఇది హెల్ప్ అవుతుందని అంటుంది. ఇదే ప్రకటన నందు, లాస్య కూడా చూస్తారు. 


Also Read: అల్లాడిన పసిమనసు, ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఖుషి- వేద, యష్ కి వార్నింగ్ ఇచ్చిన మాళవిక


తరువాయి భాగంలో.. 


తులసి దగ్గరకి బ్యాంక్ అధికారులు వస్తారు. బ్యాంక్ వాళ్ళు ఈ మధ్య ఇళ్ళకి కూడా వచ్చి అడిగి మరి లోన్ ఇస్తున్నారా అని వాళ్ళని అడుగుతుంది. ఆడవాళ్ళ ఉపాధి కోసం కొత్తగా స్కీమ్ పెట్టారని నిబంధనలు ఎక్కువగా లేవని చెప్తారు. దాంతో వాళ్ళని అనుమానంగా చూస్తూ కొత్త స్కీమ్ గవర్నమెంట్ మొదలు పెట్టిందా లేదంటే నాకోసం ఎవరైనా ప్రత్యేకంగా పెద్ద మనిషి మొదలుపెట్టాడా అని అడుగుతుంది. అర్హత లేకుండా నేను ఏది ఆశించను ఈ మాట ఆయనకి చెప్పమంటుంది.