తన విజయం వెనుక ఒక మగాడి ఉక్రోషం ఉందని తులసి అనేసరికి అతను ఎవరో చెప్పమని మీడియా వాళ్ళు అడుగుతారు. చెప్తాను కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తాను అని తులసి అంటుంది. నా జీవితం ఇక ఆగిపోయిందేమో అని నిరాశలో కూరుకుపోయిన సమయంలో సామ్రాట్ గారి రూపంలో నాకు దేవుడు ఆసరా ఇచ్చాడు నాకు దారి చూపించాడు అని తులసి అంటుంటే చెప్పాల్సింది నా గురించి కాదు మ్యూజిక్ స్కూల్ గురించని సామ్రాట్ అంటాడు. రాముడు గురించి చెప్పకుండా రామాయణం చెప్పలేం సామ్రాట్ గారు అని తులసి అంటుంది. మ్యూజిక్ స్కూల్ గురించి తులసిగారు వివరాలు చెప్తారు అనేసి సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నాలుగు మైకుల ముందు కూర్చుని మహారాణిలా ఫోజ్ కొడుతుంది, బాహుబలిలో శివగామిలా రెచ్చిపోతుందని కుళ్ళుకుంటుంది లాస్య.


శ్రుతి మాట్లాడటానికి సామ్రాట్ దగ్గరకి వస్తుంది. ఒక విషయం గురించి మీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నా అని శ్రుతి అంటుంది. మొహమాట పడకండి చిటికెలో సమాధానం చెప్తాను అని సామ్రాట్ అంటాడు. మీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని మా ఆంటీకి ఇంత హెల్ప్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఆ మాటకి సామ్రాట్ మౌనంగా ఉండేసరికి చిటికిలే సమాధానం చెప్తాను అని ఆలోచిస్తున్నారు ఏంటి అని మళ్ళీ అడుగుతుంది. హెల్ప్ చెయ్యడం తప్పా.. మీకు నచ్చలేదా అని సామ్రాట్ అంటాడు. నాకు కావలసింది సమాధానం ప్రశ్నకి ప్రశ్న బదులు కాదని చెప్తుంది.


Also Read: కార్తీక్ కి దీప గతం గుర్తొచ్చేలా చేయగలదా, మోనితపై సౌందర్యలో మొదలైన అనుమానం!


డైరెక్ట్ గా అడుగుతున్నా మీరు మా ఆంటీని ఇష్టపడుతున్నారా అని శ్రుతి అడిగేస్తుంది. మీరు చెప్పే సమాధానం చాలా ఊహాగానాలకి తెర పడేలా చేస్తుంది, కొంతమందికి మనశాంతి కూడా ఇస్తుందని అంటుంది. ‘అవును నేను తులసిగారిని ఇష్టపడుతున్నాను ఆత్మాభిమానమే బలంగా తలెత్తుకునే మహిళగా తులసి గారిని నేను ఇష్టపడుతున్నా, జీవితంలో మోసపోయి కూడా కుంగిపోకుండా తనేంటో నిరూపించుకోడానికి తపన పడే స్త్రీ శక్తిగా, చదువు లేకపోయినా అది ఎదగడానికి అడ్డు కాదని తోటి ఆడవాళ్ళకి ఆదర్శంగా ఉండాలనుకున్న తులసిగారి పట్టుదలని నేను ఇష్టపడుతున్నా, జీవితాన్ని డబ్బుతో కొలిచే నన్ను మనిషిగా మార్చిన తులసిగారి గొప్పతనాన్ని నేను ఇష్టపడుతున్న.. ఇది తప్పా ఎందుకు దీనికి పెడార్థాలూ తీస్తున్నారు. తులసి గారు కేవలం నా బిజినెస్ పార్టనర్ మాత్రమే పైకి ఎదగాలనే తులసికి గారికి సపోర్ట్ గా నిలబడుతున్నా అంతక మించి నా మనసులో మరో ఉద్దేశం లేదు దయచేసి మనసులో ఎవరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని’ చెప్తాడు.


ఆ మాటకి శ్రుతి చాలా సంతోషంగా ఉంటుంది. తులసి ఆంటీ మాకు దేవత అని చెప్తుంది. మీడియా వాళ్ళ ముందు చాలా బాగా మాట్లాడవని తులసిని అందరూ పొగుడుతారు. మీడియా వాళ్ళు కూడా తులసి, సామ్రాట్ గురించి తప్పుగా మాట్లాడతారు. అదంతా విని నందు ఆగ్రహంతో ఊగిపోతాడు. మీ తులసి మేడమ్ గారికి మార్కెట్లో ఉన్న రిపిటేషన్ అని లాస్య కౌంటర్ వేస్తుంది. ఇక తులసి, సామ్రాట్ కలిసి భూమి పూజ చేస్తారు. అభి ఇంక రాలేదేంటి అని లాస్య ఎదురు చూస్తూ ఉంటారు. పూజలో భాగంగా పూజారి ఒక పేపర్ మీద సామ్రాట్, తులసి చేతి ముద్రలు తీసుకుంటాడు. ఆ కాగితం ఎగిరి నందు చొక్కా మీద పడుతుంది. ఆ చేతి ముద్రలు నందు చొక్కా మీద పడటంతో అందరు షాక్ అవుతారు. పూర్ణాహుతిని ఇద్దరు కలిసి అగ్నిహోత్రంలో వేస్తారు. ఈరోజు నుంచి మీ అసలైన వ్యాపార భాగస్వామ్యం మొదలైనట్టే అని పూజారి చెప్తాడు. వ్యాపార భాగస్వామ్యం భార్యా భర్తల బంధం లాంటిది అని పూజారి చెప్తుంటే అభి అప్పుడే కోపంగా వస్తాడు. ఇది ఏ శాస్త్రంలో ఉందో చెప్తారా పంతులుగారు అని వెటకారంగా అంటాడు. నోరు ఎత్తకు అని పరంధామయ్య సీరియస్ అవుతాడు.


Also Read: ఆవేశంలో సామ్రాట్ ముందు నిజం కక్కేసిన నందు- బెడిసికొట్టిన లాస్య స్కెచ్