లాస్య భూమి పూజ చెడగొడుతుందేమో అని అనసూయ భయపడుతుంది. ప్రేమ్ నిలబడి తన తల్లిని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడకి సామ్రాట్ వచ్చి ఏమైంది అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు. దీంతో ప్రేమ్ ఎమోషనల్ గా సామ్రాట్ ని హగ్ చేసుకుంటాడు. అదంతా నందు, లాస్య, అటు తులసి కూడా చూస్తా ఉంటారు. ‘ఇన్ని రోజులు మా అమ్మ తన కోసం కాకుండా మా కోసం బతికింది అయినా ఇప్పటి వరకి తనకి దక్కాల్సిన గౌరవం దక్కలేదు మా అమ్మకి ఎవరు ఇవ్వని గౌరవాన్ని మీరు ఇస్తున్నారు. ఎప్పటి నుంచి మీకు ఈ విషయం చెప్పాలని అనుకున్నా కానీ మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారని ఆగిపోతున్నా. మీరు ఏమనుకున్నా పరవాలేదు చెప్పాలనుకున్నది చెప్పేసాను’ అని ప్రేమ్ అంటాడు. అమ్మ కూచి సామ్రాట్ ని జాకీలు పెట్టి మరీ ఎత్తెస్తున్నాడు కదా అని లాస్య కౌంటర్ వేస్తుంది.


ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టు సామ్రాట్ తులసికి చెప్తాడు. నాకు అందరి ముందు మాట్లాడటం అంటే చాలా భయం అని తులసి అంటే అందరూ తనకి కన్వీన్స్ చేసేందుకు చూస్తారు. సామ్రాట్ లో ఉంది ఏంటి మనలో లేనిది ఏంటి అని లాస్య అంటుంటే మంచితనం అని ఎంట్రీ ఇస్తాడు తులసి తమ్ముడు దీపక్. నమస్కారం మాజీ బావగారు అని దీపక్ వెటకారంగా చెప్తాడు. దీపక్ ని చూసి తులసి చాలా సంతోషిస్తుంది. దీపక్ ని సామ్రాట్ కు పరిచయం చేస్తుంది. మా అక్క ఎదుగుదలకి చాలా సహాయం చేస్తున్నారు చాలా థాంక్స్ సర్ అని దీపక్ సామ్రాట్ కి చెప్తాడు.


Also Read: మాధవ్ పై భద్రకాళిలా విరుచుకుపడిన రాధ- ఆదిత్యకి నిజం చెప్పిన రుక్మిణి, దేవి ప్రవర్తనపై అనుమానపడుతున్న జానకి


ప్రెస్ మీట్ మొదలవుతుంది. అది చూసి తులసి నా కోడలు అని చెప్పుకోడం కాదు తులసికి నేను అత్త అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా అని అనసూయ అంటుంది. తులసి స్పీచ్ మొదలుపెడుతుంది. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అంటారు. అలా నా విజయం వెనుక ఒక మగవాడి ఉక్రోషం ఉంది అని తులసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు గెలుచుకున్నందుకు నందుని ఇంటర్యూ చెయ్యడానికి మీడియా వాళ్ళు వస్తారు. పక్కన తులసి, లాస్యతో పాటు ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారు. ప్రతి మగాడి విజయం వెనక ఆడది పాత్ర ఉంటుందని అంటారు, మరీ మీ విజయం వెనక మీ భార్య పాత్ర ఎంతవరకు ఉందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నందుని అడుగుతాడు.


'నా విజయం వెనక ఒక ఆడది ఉంది.. కానీ మీరనుకుంటున్నట్టు అని నా భార్య తులసి కాదు. నా భార్యకి వంటిల్లే లోకం, ఇంటి బాధ్యతలే సర్వస్వం. తులసి ఒక ఆదర్శ గృహిణి అంతవరకు మాత్రమే తనకు నా వెనక ఉంది ఎంకరేజ్ చేసేంత చదువుకానీ నాలెడ్జ్ కానీ లేదు. అడిగినప్పుడు కమ్మగా కాఫీ పెట్టి ఇవ్వడం వండి పెట్టడం తప్ప ఇంకేమీ తెలియదు' అని అవమానకరంగా మాట్లాడతాడు. తన విజయం వెనక లాస్య ఉందని అంటాడు. నాకు అండగా నిలబడి ఈ అవార్డు రావడానికి కారణం లాస్య తనకి నేను ఎంతో రుణపడి ఉన్నాను అని నందు చెప్తాడు. ఆ మాటకి తులసి లేచి వెళ్లిపోతుంటే లాస్యని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటాడు నందు.


Also Read: అభిమన్యు ఇంట్లో ఖైలాష్ ని చితక్కొట్టిన యష్- తండ్రి ప్రేమ్ చూపించమని యష్ కి సవాల్ విసిరిన మాళవిక


తరువాయి భాగం..


సామ్రాట్, తులసి కలిసి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడకి అభి కోపంగా వచ్చి సామ్రాట్ గారు మామ్ కి దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నారని అంటాడు. నిన్ను రెచ్చగొట్టి మీ నాన్న నిన్ను ఇలా మాట్లాడిస్తున్నాడని దీపక్ అంటాడు. ఆ మాటకి నందు కోపంగా వాడి కడుపు మండి ఏదో మాట్లాడుతుంటే దానికి నాకు లింక్ పెడతావ్ ఏంటని నందు కోపంగా అరుస్తాడు. ఆ మాటకి సామ్రాట్ షాక్ అవుతాడు.