రాధ కోపంగా మాధవ్ దగ్గరకి వస్తుంది. పాపం ఈరోజుతో దేవికి నాన్నని చూడాలనే కోరిక నీకు తండ్రిని బిడ్డని కలపాలనే కోరిక రెండు తీరిపోయి ఉంటాయి కదా అని మాధవ్ అనేసరికి రాధ కోపంగా కొట్టేందుకు చెయ్యి లేపుతుంది.


రాధ: మనిషిగా ఎలా పుట్టినావ్ నువ్వు నిజంగా రామూర్తిగారికే పుట్టావా లేదంటే ఎక్కడైనా చెత్త కుప్పలో ఎత్తుకొచ్చారా?


మాధవ్: రాధ హద్దులు దాటుతున్నావ్


రాధ: ఎవరి హద్దులు ఎవరు దాటుతున్నారు. ఇప్పటి దాకా ప్రతి హద్దు నువ్వే దాటావ్. నన్ను నా పెనీమిటిని మస్త్ బాధపెట్టినావ్ ఇది చాలదు అన్నట్టు నా బిడ్డని ఆగం పట్టిస్తున్నావ్ గీ పొద్దు నువ్వు చేసిన పని జంతువులు కూడా చెయ్యవు. పసి బిడ్డ మనసుతో అలా ఆడుకుంటున్నావే నువ్వు మామూలుగా పోవు పురుగులు పట్టి పోతావ్. అయినా పసిబిడ్డ అని కూడా చూడకుండా ఇలా చేస్తున్నావ్ నీది ఒక బతుకేనా అని అంటుంటే మాధవ్ కోపంగా రాధా అని అంటాడు. నా పెనిమిటి ఇంట్ల నాకు ఇంకో పేరు ఉంది అదే మనిషి అదే పేరు నాతో ఉంది ఉంటే నీ పేగులు తీసేదాన్ని యాది పెట్టుకో నా బిడ్డని ఎంత బాధపెడుతున్నావో అంతకంతకూ బాధపడేలా చేస్తా అనేసి కోపంగా వెళ్ళిపోతుంది.


Also Read: మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన జానకి- ఉగ్రరూపం దాల్చిన రుక్మిణి


దేవి బాధగా కూర్చుని ఉంటే ఎందుకు ఏమైంది అలా ఉన్నావ్ అని చిన్మయి అడుగుతుంది. నాతో మాట్లాడవా నాతో ఆడుకోవా అని అడుగుతుంది. నన్ను విడిచిపెట్టు అక్కా నేను ఎవరితో మాట్లాడను ఆడను నేను ఇలాగే ఉంటాను అని దేవి అంటుంది. ఎందుకు దేవి ఎవరైనా ఏమైనా అన్నారా అని చిన్మయి అడుగుతుంది. నన్ను ఎవరు ఏమి అనలేదు నన్ను విడచిపెట్టమని అడిగినా కదా విడిచిపెట్టు అని అంటుంది. మాయమ్మ నీకు అమ్మ కాదని చెప్పకపోవడం మంచిది నీకు చాలా విషయాలు చెప్పలేను నేను బాధపడుతుంది చాలు నువ్వు బాధపడటం వద్దు అని దేవి మనసులో అనుకుంటుంది.


ఎప్పుడు నాతో ఇలా లేవు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు దేవి అని చిన్మయి అడుగుతుంది. ఆ మాటలు జానకి వింటుంది. నేను ఇలాగే ఉంటాను ఎవరితోనూ మాట్లాడను నన్ను విడచిపెట్టు అని దేవి బాధగా అంటుంది. ఇన్ని రోజులు ఇలా లేవు కదా అని చిన్మయి అంటే ఇన్ని రోజులు ఒకరకంగా గడిచింది ఇప్పుడు ఒకలెక్కన పోతుంది వాణ్ని నీకు చెప్తే నీకు సమజ్ కావు వెళ్ళి అవ్వ, తాతతో మంచిగా ఉండు నన్ను విడిచి పెట్టు అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. అక్కాచెల్లెళ్లు అంటే ఇలా ఉండాలని అనుకునే వాళ్ళు అలాంటిది దేవి ఎందుకు ఇలా ఉంటుంది ఏమైంది అని జానకి ఆలోచనలో పడుతుంది. మరో వైపు దేవి వాలా కోసం ఆదిత్య ఎదురు చూస్తూ ఉంటాడు.


Also Read: కార్తీక్ కి మోనిత గోరుముద్దలు, నువ్వు నా భార్యని కాదంటూ దీపని గుర్తుచేసుకున్న డాక్టర్ బాబు!


అప్పుడే రుక్మిణి వస్తుంది. ఇంత ఆలస్యం అయ్యిందేంటి అని అడుగుతాడు. రుక్మిణి చాలా బాధగా వచ్చి అదిత్యని కౌగలించుకుని ఏడుస్తుంది. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతాడు. బిడ్డ మనసు మళ్ళీ కరాబ్ చేశాడు అని జరిగింది అంతా చెప్తుంది. దేవమ్మకి అది అబద్ధం అని ఎంత చెప్పినా వినడం లేదని చెప్తుంది. మళ్ళీ దేవి మామూలు మనిషి ఎప్పుడు అవుతుందో అర్థం కావడం లేదని అంటుంది. మన బిడ్డని మనకి కాకుండా చేస్తున్నాడు వాడిని మాత్రం విడిచిపెట్టకు అని రుక్మిణి చెప్తుంది. ఆదిత్య కోపంతో రగిలిపోతాడు.


దేవికి తండ్రిగా తీసుకొచ్చిన వ్యక్తి కోసం ఆదిత్య వెతుకుతూ ఉంటాడు. ఊర్లో వాడి గురించి ఆదిత్య అడిగితే ఇక్కడ ఉండడని చెప్తారు. ఏదో జరుగుతుందని అనుమానపడతాడు. రాధ దేవి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే దేవి అప్పుడే వస్తుంది. బయట వర్షం పడుతుంది నాయన వానలో తడిచి ఉంటాడు కదా నాయన గురించి ఆలోచించు అని అంటుంది. చిన్మయి కూడా వచ్చి దేవికి ఏమైంది ఎందుకు అలా ఉందని అడుగుతుంది.