ఆదిత్య కేక్ కట్ చేసి ఫస్ట్ తన తల్లి మాళవికకి తినిపిస్తాడు. తర్వాత తనకే తినిపిస్తాడాని యష్ ఎదురు చూస్తాడు. నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కి ఆయనెప్పుడూ నేను హ్యాపీగా ఉండటం కోసం ఏం చెయ్యడానికైనా రెడీగా ఉంటారు, నా లైఫ్ లో మా మామ్ తర్వాత నన్ను అంతా ప్రేమగా చూసుకున్న వ్యక్తి ఆయనే, చెప్పాలంటే ఈ సెలెబ్రేషన్ కి కారణం కూడా ఆయనే అని చెప్పి అభి చెయ్యి పట్టుకుని యు ఆర్ ది బెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ అని కేక్ తనకి పెడతాడు. దీంతో యష్ గుండె పగిలిపోతుంది. ఆ పనికి వేదతో సహా అందరూ షాక్ అవుతారు మాళవిక మాత్రం సంతోషిస్తుంది. ఎప్పటికీ మా మామ్ తర్వాత మీరే నాకు ఇంపార్టెంట్ అని ఆది అంటుంటే యష్ చాలా బాధపడతాడు. తర్వాత ఆది కేక్ ఖుషికి తినిపిస్తాడు. తర్వాత తననే పిలుస్తాడని యష్ సంతోషంగా ఆది దగ్గరకి వెళ్ళి హ్యాపీ బర్త్ డే చెప్తాడు. కానీ ఆది మాత్రం కేక్ పెట్టకుండా పక్కన పెట్టేస్తాడు. వెయిటర్ ని పిలిచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయిపోయారు మిగిలిన గెస్ట్ లకు ఈ కేక్ సర్వ్ చెయ్యి అని చెప్పడంతో యష్ కుమిలిపోతాడు.
ఖుషి తర్వాత కేక్ తీసుకొని యష్ దగ్గరకి వస్తుంది. అన్నయ్య నీకు కేక్ పెట్టలేదు కదా అందుకే నీకోసం నేనే కేక్ తీసుకొని వచ్చాను, అన్నయ్య పుట్టినరోజుకి వచ్చి కేక్ తినకుండా వెళ్లకూడదు అందుకే నేను తీసుకొచ్చి ఇస్తున్నా తిను నాన్న అని ఖుషి తినిపిస్తుంది. అది చూసి యష్ మురిసిపోతాడు. అన్నయ్య అలా ఎందుకు ఉన్నాడో నాకు తెలుసు అని అంటుంది. అన్నయ్య వాళ్ళ మమ్మీ మన మమ్మీలాగా గుడ్ వర్డ్ చెప్పదేమో అందుకే అలా కోపంగా మాట్లాడి ఉంటాడని ఖుషి అంటుంది.
Also Read: ఖైలాష్ చెంప పగలగొట్టిన వేద, మాళవికకి బుద్ధి చెప్పిన ఖుషి, బద్ధలైన తండ్రి హృదయం
ఖైలాష్ మళ్ళీ వేద ఎదురు పడి తన చెయ్యి పట్టుకుంటాడు. నీకు ఒక్కసారి చెప్తే సిగ్గు రాదా అని వేద తనని కొట్టబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపుతాడు. ఒక్కసారి టచ్ చేశావ్ కదా డార్లింగ్ మళ్ళీ మళ్ళీ ఎందుకు అనేసరికి ఖైలాష్ చెంప చెల్లుమంటుంది. యష్ లాగి పెట్టి కొడతాడు. వేదని పంపించి ఖైలాష్ ని మళ్ళీ మళ్ళీ కొడతాడు. యశోధర్ ఇంకొక్క దెబ్బ నా ఒంటి మీద పడితే ఏం చేస్తానో కూడా నాకే తెలియదని ఖైలాష్ వార్నింగ్ ఇస్తాడు. మళ్ళీ కొట్టబోతుంటే అభి వస్తాడు. చెయ్యి దించు ఇది నా ఇల్లు నా గెస్ట్ తో మర్యాదగా లేకుండా ప్రవర్తిస్తే నేను ఊరుకోనని చెప్తాడు. ఆ మాటకి యష్ ఆశ్చర్యపోతాడు. అంటే విడిని జైలు నుంచి విడిపించింది అని యష్ అంటుంటే అవును నేనే చాలా కష్టపడి బెయిల్ ఇప్పించి విడిపించానని అభిమన్యు చెప్తాడు.
ఒక నీచుడికి సహాయం చేసి ఇంకా దిగజారిపోయావ్ అన్నమాట అని యష్ అంటాడు. యశోధర్ శత్రువులు ఎవ్వరైనా సరే నాకు మిత్రుడే అవుతాడని అభి చెప్తాడు. ఆది దగ్గర యష్, మాలిని వాళ్ళు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. తన దగ్గరకి రమ్మని యష్ అడుగుతాడు. అక్కడ వేద అమ్మ కూడా ఉంటుంది తనని నిన్ను చాలా బాగా చూసుకుంటుందని యష్ అంటాడు. తను నాకు అమ్మ కాదు అయినా స్టెప్ మామ్ దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు ఆవిడంటే మీకు ఇష్టమేమో కానీ నాకు మాత్రం కోపం ఈ హేట్ హర్ అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఆదిత్య మాటలకి ఆయన చాలా బాధపడుతున్నారని వేద మనసులో ఫీల్ అవుతుంది. యష్ బాధపడుతుంటే మాళవిక వచ్చి దెప్పిపొడుస్తుంది. గుళ్ళో ఏమన్నావ్ ఖుషితో ఒక్కసారి అమ్మా అని పిలిపించుకుని తల్లి ప్రేమ్ నిరూపించుకోమని అన్నావ్ కదా ఇప్పుడు నేను అదే అంటున్నా ఆదిని పిలిచి నీ దగ్గరకి రమ్మని అడుగు నీ తండ్రి ప్రేమ ఏంటో చూపించు అని సవాల్ విసురుతుంది. నిన్ను నాన్న అని పిలవడం కాదు కదా కనీసం నీ మొహం కూడా చూడడు అని మాళవిక అంటుంది. యష్ ఎమోషనల్ గా ఆది ఆది అని పిలుస్తాడు కానీ కనీసం ఆది పట్టించుకోకుండా ఆడుకుంటూ ఉంటాడు.
Also Read: ఐ హేట్ యు అన్న ఆది - ముక్కలైన యష్ గుండె, పైశాచికానందం పొందిన మాళవిక, అభి
బర్త్ డే బహుమతిగా ఆదికి కారు ఇస్తాడు అభిమన్యు. ఆది వయసు ఏంటి తనకి ఇచ్చే గిఫ్ట్ ఏంటి అని యష్ అరుస్తాడు. ఆ కారు కీ ఇచ్చేయమని యష్ అడుగుతాడు. నాకిచ్చిన గిఫ్ట్ తిరిగి ఇవ్వమని మీరు ఎలా చెప్తారని అంటాడు. ఆ కారు చూసి ఆది చాలా సంబరపడతాడు. రైడ్ కి వెళ్దాం రమ్మని ఖుషిని తీసుకుని వెళ్లబోతుంటే వేద ఆపుతుంది.
తరువాయి భాగంలో..
మాళవిక ఆదిని స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి వస్తుంది. అక్కడ ఆది తండ్రి యశోధర్ వస్తేనే అడ్మిషన్ ఇస్తామని స్కూల్ ప్రిన్సిపల్ చెప్తుంది. అదే స్కూల్ కి ఖుషిని తీసుకుని వేద వస్తుంది. యష్ స్కూల్ అడ్మిషన్ లో తండ్రిగా సైన్ చెయ్యడం వేద చూస్తుంది.