కార్తీకదీపం ఆగస్టు 29 సోమవారం ఎపిసోడ్ (Karthika Deepam August 29 Episode 1443)


కార్తీక్..దీపా దీపా అని కలవరించిన విషయం గుర్తుచేసుకుని మోనిత ఇరిటేట్ అవుతుంది. మనసు, మనిషి అన్నింటినీ అధీనంలోకి తెచ్చుకుంటే కానీ కార్తీక్ నా గుప్పిట్లో ఉండడు. ఈ అవకాశం వదులుకోకూడదనుకుంటుంది. కార్తీక్ కనపడక పోవడంతో తల పగలిపోతోంది..స్ట్రాంగ్ కాఫీ తాగాల్సిందే అనుకుంటూ పక్కనే ఉన్న హోటల్లోకి వెళుతుంది. అక్కడే ఉంటారు సౌందర్య, ఆనందరావు, హిమ. ఒకర్నొకరు చూసుకుని షాక్ అవుతారు..
సౌందర్య: ఇదెక్కడుంటే అక్కడ మనశ్సాంతి ఉండదు..ఎక్కడుంటే అక్కడ ప్రళయమే...
మోనిత: వీళ్లు ఇక్కడున్నారేంటి..దీప కాల్ చేసి చెప్పిందా...వీళ్లంతా కలసి కార్తీక్ ని నాకు దూరం చేస్తారేమో..అయినా నేను భయపడకూడదు..జాగ్రత్తగా మ్యానేజ్ చేయాలి అనుకుంటూ.. వెళ్లి వాళ్లని పలకరిస్తుంది..
సౌందర్య: నువ్వేంటి ఇక్కడ..
మోనిత: చిన్న పనుండి వచ్చానాంటీ..మీరేంటి ఆంటీ ఇక్కడ
సౌందర్య: ప్రమాదం జరిగింది ఇక్కడే కదా..అందుకే ఇక్కడకు వచ్చాం...
మోనిత: హమ్మయ్య..వీళ్లకి కార్తీక్ బతికిఉన్న సంగతి తెలియలేదనుకుంటుంది..ఇంతలో కార్తీక్ నుంచి కాల్ వస్తుంది..సౌందర్య చూడకుండా ఆ కాల్ కట్ చేస్తుంది మోనిత.. ఏంటి ఆంటీ సంగతులు..
సౌందర్య: పెళ్లి చేసుకున్నావా..
మోనిత: లేదు ఆంటీ..నా కార్తీక్ కి అలా జరిగిన తర్వాత ఎలా పెళ్లిచేసుకుంటాను..
సౌందర్య: ఆ రోజు ఏదో తెల్లచీర కట్టుకుని వెళ్లావ్.. ఈ రోజు ఈ రంగుల చీరేంటి.
మోనిత: నా కార్తీక్ దూరమయ్యాక నాకు జీవితమే లేదనుకున్నాను..కానీ ఆ తెల్లచీరలో ఉంటే అన్నీ చేదు జ్ఞాపకాలే వస్తున్నాయ్...అందుకే రంగు మార్చాను. నన్ను అంటున్నారు కానీ మీరు మాత్రం తక్కువా..కొడుకు, కోడలు పోయిన బాధ అస్సలు కనిపించడం లేదు.. బాధ మనసులో ఉంటుంది కానీ మొహంలో కనిపించదు కదా.. ఎప్పుడూ నన్ను అనుమానించడమే..కార్తీక్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడేంటి..లిఫ్ట్ చేసి మాట్లాడితే వీళ్లకు దొరికిపోతాను అనుకుంటూ.. అర్జెంటుగా వెళ్లాలని చెప్పేసి వెళ్లిపోతుంది.


Also Read: దీపను చూసిన ఆనందరావు- కార్తీక్ మోనిత దగ్గరే ఉన్నాడని తెలుసుకున్న దీప


అటు దీప మోనిత గురించి ఆలోచిస్తుంది. మోనితను చూసి డాక్టర్ బాబు ఎలా స్పందించి ఉంటారు.. గుర్తుపట్టారా లేదా నన్ను గుర్తుపట్టనట్టే మోనితను గుర్తుపట్టలేదా అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ అన్నయ్యతో..ఏదైనా పనిచేస్తానని అడుగుతుంది. ఇంతవరకూ ఏపనీ చేయకుండా ఉండడం ఇదే మొదటి సారి..పనిచేస్తేనే హుషారుగా ఉంటుందంటుంది. ఇప్పుడు డాక్టర్ బాబుని వెతుక్కోవడం ఓ సమస్య అయితే..మోనిత బారినుంచి కాపాడుకోవడ మరో సవాల్ అనుకుంటుంది. 


అటు  కార్తీక్ బొటిక్ బయట తిరుగుతూ ఉంటాడు. మోనిత రానేవస్తుంది. అంకుల్, ఆంటీ ఫాలో అవలేదు కదా అనుకుంటూ వెనక్కు చూసుకుంటుంది. కార్తీక్-దీప బతికిఉన్నారని తెలుసా వాళ్లకి..ఇక్కడకు ఎందుకొచ్చారు అనుకుంటుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటని అడిగితే..మీటింగ్ లో ఉన్నాను అందుకే లిఫ్ట్ చేయలేదంటుంది. ఒక్కసారి కట్ చేస్తే బిజీగా ఉన్నానని అర్థం చేసుకోవాలి కదా అని మోనిత అంటే..నువ్వు నాకు వందలసార్లు కాల్ చేయొచ్చా అని అడుగుతాడు. 
మోనిత: చెప్పింది అర్థం చేసుకోకుండా ఎందుకు టార్చర్ పెడుతున్నావ్
కార్తీక్: నువ్వు పెట్టేది ఏంటి.. ఎప్పుడూ కాల్ చేయని వాడు ఇప్పుడు చేశాడంటే రాగానే ఏంటని అడగాలి కదా..
మోనిత: తప్పు నాదేలే చెప్పు..ఏంటి విషయం
కార్తీక్: చెప్పే మూడ్ లేదులే..
మోనిత: చెప్పు ఏంటి..
కార్తీక్: మనం హైదరాబాద్ వెళ్లిపోదాం.. మోనిత కంగారుపడడడం చూసి..హైదరాబాద్ అనగానే ఎందుకు కంగారుపడుతున్నావ్..
మోనిత: బొటిక్ వదిలేసి ఎలా వెళతాం..
కార్తీక్: బొటిక్ కోసమే అక్కడకు వెళదాం అంటున్నాను..
మోనిత: అందుకు వెళదాం అంటున్నావా...
కార్తీక్: మరి నువ్వేం అనుకుంటున్నావ్.. ఇక్కడుంటే ఏదో ప్రాబ్లెమ్ అని బయటకు పంపడానికి టెన్షన్ పడుతున్నావ్ కదా.. ఊరు మారితే బావుంటుంది కదా అని..
మోనిత: అయితే అస్సలు వద్దు.. నీ హెల్త్ బాలేదు కదా పొల్యూషన్ పడదు..ఇక్కడ బానే ఉంది కదా అంటుంది.. మనసులో మాత్రం హైదరాబాద్ వెళితే ఇంకేమైనా ఉందా, ముందు ఆ దీపను ఇక్కడి నుంచి పంపించే మార్గం చూడాలి అనుకుంటుంది...


Also Read: ప్రేమ ఊహల్లో విహరిస్తోన్న రిషిధార- ఏం జరిగిందో తెలుసుకునేందుకు మహేంద్ర, గౌతమ్ తిప్పలు


ఆ తర్వాత..శౌర్య వాళ్లు కొత్తింటికి చేరుతారు. పాత ఇల్లు బావుండేది బాగా కలిసొచ్చేదని చంద్రమ్మ అనడంతో.. ఆ ఇంటికన్నా ఈ ఇల్లు కలిసొస్తుందని చెబుతుంది శౌర్య. ఆ తర్వాత ఇంద్రుడు ఆటో తీసుకొచ్చి ఇస్తాడు. అమ్మా నాన్నని గుర్తుచేసుకుని శౌర్య బాధపడుతుంది. వాళ్లు బతికి ఉంటే బావుండేది గండా అంటుంది చంద్రమ్మ. 


ఇంతవరకూ పిల్లల్ని చూసే అవకాశమే లేకుండా పోయింది..అత్తయ్యకి కాల్ చేద్దామంటే అమెరికా వెళ్లిపోయారు..నా దగ్గర ఫోన్ నంబర్ కూడా లేదు..మేం బతికే ఉన్నాం అన్న సంగతి వాళ్లకి తెలియదు. అయిన వాళ్లందరికి దూరంగా బతకమని నా నుదిటిన రాసినట్టున్నాడు దేవుడు. డాక్టర్ బాబుని కలవలేకపోతున్నాను, పిల్లలతో మాట్లాడలేకపోతున్నాను..ముందు డాక్టర్ బాబుని కలవాలి..అయనే అంతా చూసుకుంటారు అనుకుంటుంది...


రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
డాక్టర్ బాబుని చూసిన దీప.. ఆ కారునే ఫాలో అవుతుంది. బొటిక్ బయట దిగిన కార్తీక్ దగ్గరకు పరుగున వెళుతుంది దీప..  ఇంతలో మోనిత బయటకు వస్తుంది..కార్తీక్ ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ...