వసుతో కారులో వెళ్తూ ఈ ప్రయాణం చాలా కొత్తగా హాయిగా ఉంది కదా అని అంటాడు రిషి. చూశావా నువ్వు చెప్పాల్సింది నేను అంటున్నాను.. ఇలా విశ్లేషించడం నీకు అలవాటు కదా అని రిషి అంటే సర్ నేను చెప్తే మీకు బాగుంటుంది.. కానీ మీరు చెప్తూ ఉంటే నాకు చాలా బాగుందని వసు అంటుంది. ఎక్కడ ఏ బలమైన క్షణంలో మొదలైందో ఈ పరిచయం ఆ క్షణానికి వేల కృతజ్ఞతలని మనసులో అనుకుంటుంది.


రిషి: వసుధార ఏం ఆలోచిస్తున్నావ్? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నన్ను చెప్పమంటావా


వసు: కనిపెట్టారా సర్ చెప్పండి


రిషి: ఈ రిషి సర్ ని ఫస్ట్ టైం కలిసిన టైంలోనే గోడవలతో మొదలై ఒకరికొకరు దగ్గరై కోపాలు అన్ని తగ్గి ఇద్దరం ఒక్కటయ్యామ్.. థాంక్స్ టు ది బెస్ట్ టైం అనుకుంటున్నావ్ అంతేనా


వసు: అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పగలిగారు


రిషి: మన గుండెల చప్పుడు ఒక్కటైతే ఇద్దరం అనుకునేది ఎప్పుడైనా ఒక్కటే. అదే ప్రేమలోని మాయ.


Also Read: కార్తీక్ కి మోనిత గోరుముద్దలు, నువ్వు నా భార్యని కాదంటూ దీపని గుర్తుచేసుకున్న డాక్టర్ బాబు!



రిషి వసుని తన ఇంటి దగ్గరకి తీసుకొస్తాడు. అప్పుడే వచ్చేశామా అని అంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రేపటి నుంచి నీ ధ్యాస అంటా చదువు మీదే ఉండాలని చెప్తాడు. సరే అని చెప్పి వసు దిగబోతుంటే రిషి తన చెయ్యి పట్టుకుని ఆపి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తాడు. నీ మనసు నాకు అర్థం అయ్యింది కానీ ఈ దూరం అవసరం వసుధార అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రోడ్డు మీద ఒకచోట కారు ఆపి వసు ఐ లవ్యూ చెప్పిన విషయం గుర్తు చేసుకుని చాలా సంతోషిస్తాడు. రిషి కోసం మహేంద్ర, గౌతం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే రిషి వస్తాడు. సరదాగా మాట్లాడినట్టు నువ్వే అడిగేసెయ్ అని గౌతమ్ ని పంపిస్తాడు మహేంద్ర. బాగా అలిసిపోయాను మార్నింగ్ మాట్లాడుకుందామని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. వీడి ముందు మన తెలివితేటలు పని చెయ్యడం లేదు అంకుల్ అని గౌతమ్ మహేంద్ర అనుకుంటారు.


రిషి వెళ్లబోతుంటే జగతి ఎదురు పడుతుంది. తన వెనక వసు ఉన్నట్టు ఊహించుకుంటాడు. అలాగే చూస్తూ ఉంటే జగతి రిషి అని పిలుస్తుంది. తెగిపోయిన బంధం ఒక అందమైన బంధాన్ని అందించింది నాకు అని మనసులో అనుకుని బయటకి జగతికి థాంక్యూ చెప్పి వెళ్ళిపోతాడు. ఏం అర్థం కాక జగతి అయోమయంగా చూస్తుంది. అటు వసు ఫోన్లో రిషి ఫోటో చూసుకుంటూ ప్రపోజ్ చేసిన విషయం మురిసిపోతుంది. ఇటు రిషి కూడా వసు గురించి ఆలోచిస్తూ ఏం చేస్తుందో తను ఫోన్ కూడా చెయ్యలేదని అనుకుంటాడు. ప్రేమ పక్షులు ఇద్దరు ఊహల్లో తేలిపోతూ ఉంటారు.


సాక్షి, దేవయాని మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు నన్ను బలవంతం చేస్తున్నారే తప్ప నా మనసు ఎప్పుడో విరిగిపోయిందని సాక్షి అంటుంది. ఒకసారి కోపం వచ్చిందని బంధం తెంచుకోవద్దు తర్వాత జీవితాంతం బాధపడతావ్ తన మాట వినమని దేవయాని చెప్తుంది.


Also Read:  తరగతి గది దాటి తరలిన కథ , ఐ లవ్ యూ రిషి సార్ నన్ను క్షమించండి నా ప్రేమని అంగీకరించండని చెప్పేసిన వసు


సాక్షి: నాకొచ్చిన కోపంలో న్యాయం ఉంది. ఒక్క సారికే నేనేమీ రియాక్ట్ అవ్వలేదు. రిషి నన్ను చాలాసార్లు ఇరిటేట్ చేశాడు. ఆడది ఏదైనా భరిస్తుంది కానీ తన స్థానాన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం అసలు భరించలేదు. భర్త ఎలాంటి వాడైనా పరవాలేదు కానీ తన భర్త నోటి వెంట వేరే స్త్రీ పేరు వింటే గుండె చివుక్కుమంటుంది. అలాంటిది ణ పేరుకి బదులు వసుధార పేరులోని వి అనే అక్షరాన్ని ఉంగరం చేయించడం అంటే నాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. అది ఇంతటితో ఆగుతుందని నేను అనుకోవడం లేదు అందుకే అలా చేశాను


దేవయాని: సాక్షి జరిగినవి తలుచుకోవడంలో లాభం లేదు, ఎగ్జామ్స్ అయ్యేంతవరకు సైలెంట్ గా ఉందాం. ఒక్కోసారి ఎంత బలం ఉన్నా మౌనంగా ఉండటం కంటే వేరే ఎత్తుగడ ఇంకొకటి లేదు. ఈ ఎగ్జామ్స్ అయిపోగానే వసుధారని అడ్రస్ లేకుండా చెయ్యొచ్చు. అప్పుడు రిషి ఒంటరి వాడు అవుతాడు. ఒంటరి అయిన రిషిని మన వైపుకి తిప్పుకోవడం చాలా సులభం


కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ధరణి. ఆడగకముందే కాఫీ ఇస్తున్నావ్ ఏంటి ధరణి మేము ఏం మాట్లాడుకుంటున్నామో విందామని అనుకుంటున్నావా అని దేవయాని అంటుంది. నువ్వు విన్నా వినకపోయినా నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే నిజం అవుతుందని హెచ్చరిస్తుంది.


రిషి మనసులో ఏముందో తెలుసుకుందామని మళ్ళీ గౌతమ్, మహేంద్ర అనుకుంటూ రిషిని నిద్రలేపడానికి వస్తారు. జగతి వచ్చి వద్దని రమ్మని పిలుస్తుంది. రిషి దగ్గర ముగ్గురు ఉండటం చూసి దేవయాని ఏం చేస్తున్నారని అడుగుతుంది. అక్కడ నుంచి జారుకుంటారు మహేంద్ర, గౌతమ్. రిషిని పేరు పెట్టి పిలవమన్నాడని సంబరపడుతున్నావా అని దేవయాని అంటుంది. అమ్మా అని మాత్రం ఎప్పటికీ పిలవడని అంటుంది. ఆ మాటకి జగతి కౌంటర్ ఇస్తుంది. అమ్మ అని పిలవకపోయిన పరవాలేదు కానీ తనని నేను రిషి అని పిలుస్తున్నా రోజు చూసుకుంటున్న అంతకన్నా ఏమి కావాలి చెప్పు అనేసి నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వసు నిద్రలేవగానే రిషి ఫోటో చూసుకుని మాట్లాడుకుంటూ ఉంటుంది. నీ ఆశయమే నీకు ముఖ్యం అని రిషి చెప్పిన మాటలు చార్ట్ మీద రాసి గోడకి అతికించి చూసుకుని మురిసిపోతుంది.