ఇన్విటేషన్ కార్డు చూసి తులసి చాలా సంబరపడుతుంది. నీకు ఇక ఆకాశమే హద్దు అని అందరూ తులసిని ఎంకరేజ్ చేస్తారు. వెంటనే ఇది ఇంట్లో చూపించాలని అంటుంది. కానీ సామ్రాట్ బాబాయ్ మాత్రం అలా కుదరదు ముందు నీ చేత్తో మాకు స్వీట్ చేసి పెట్టినాకే వెళ్ళు అని అనేసరికి తులసి సరే అంటుంది. మీరొక్కరే స్వీట్ చెయ్యడానికి నేను ఒప్పుకోను నేను కూడా మీతో కలిసి చేస్తాను పార్టనర్ కదా అని సామ్రాట్ అంటాడు. నందు, లాస్య అనసూయ దగ్గరకి వస్తారు. వాళ్ళని చూసి కోపంగా మొహం పెడుతుంది. పొద్దున్నే ఇలా వచ్చావ్ ఏంటి అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా అని వెటకారంగా అడుగుతుంది. ఆఫీసు పని మీద తులసిని కలవడానికి వచ్చాను అని నందు అనేసరికి అవునా నా మీద ప్రేమతో వచ్చావాని అనుకున్నా తల్లిని కదా అని అంటుంది. తులసి ఇంట్లో లేదు మీరు వెళ్లందని అంటుంది. ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాడు. కట్టుకున్న మొగుడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే పరవాలేదు కానీ వదిలేసిన మొగుడివి ఇలాంటి ఆరాలు అడిగితే బాగోదు నాన్న అని చిరాకుగా చెప్తుంది.
ఏదో ఫోన్ వస్తే కంగారుగా వెళ్ళింది డాడ్ అని అభి చెప్తాడు. లోపలకి రమ్మని అభి పిలుస్తాడు. ఇక తులసి, సామ్రాట్ కలిసి స్వీట్ రెడీ చెయ్యడానికి కిచెన్ లోకి వెళ్తారు. ఇటు నందు, లాస్యలు తులసి కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. నీ భార్య స్థానంలో ఉన్నప్పుడు తులసి కూడా ఆరాటంగా నీ కోసం గుమ్మం దగ్గర ఇలాగే ఎదురు చూస్తూ ఉండేది ఇప్పుడు నువ్వు మాజీ భర్త స్థానంలో ఉంది తులసి కోసం ఎదురు చూస్తున్నావ్ కాలం మహిమ అని లాస్య వాగుతూ ఉంటుంది. తులసి ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తుంది. అక్కడ నందు, లాస్యని చూసి షాక్ అవుతుంది. పొద్దునే ఎక్కడికి వెళ్లావ్ అని లాస్య వెటకారంగా అడిగితే సామ్రాట్ గారి ఇంటికని అంటుంది. నేనే సామ్రాట్ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి తులసిని రమ్మని పిలిచాను అని పరంధామయ్య చెప్తాడు. మీరు ఎందుకు వెళ్లారు నాన్న అని నందు అడుగుతాడు. కొడుకు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని అంటాడు.
Also Read: కార్తీక్ కి మోనిత గోరుముద్దలు, నువ్వు నా భార్యని కాదంటూ దీపని గుర్తుచేసుకున్న డాక్టర్ బాబు!
తులసి సంతోషంగా నేను కలలు కానే మ్యూజిక్ స్కూల్ కి రేపే శ్రీకారం చుట్టబోతున్నారు, భూమి పోజ జరగబోతుందని ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చారని అనసూయకి చూపిస్తుంది. చాలా బాగుంది మన అభి పెళ్లి శుభలేఖ లాగా ఉందని అంటుంది. కార్డ్ లో నా పేరు కూడా వేశారని అంటుంది. నీపేరు, సామ్రాట్ గారి పేరు ఇలా చూస్తుంటే నిజంగా శుభలేఖ లాగానే ఉందని లాస్య అంటుంది. ఆ మాటకి అందరూ కోపంగా చూస్తారు. అభి మాత్రం కోపంగా కార్డ్ తీసుకుని చూసి ఏంటి మామ్ ఇది కార్డ్ మీద నీ పేరు ఉందని చూసుకుని మురిసిపోతున్నావ్ కానీ పక్కన ఆయన పేరు కూడా ఉందని అరుస్తాడు. తప్పేముంది పెట్టుబడి ఆయనది ఆయనే కదా బాస్ అని తులసి అంటుంది. ఆయన కంపెనీకి బాస్ నీ జీవితానికి కాదని అభి అంటాడు. తులసి కోపంగా అభి అని అరుస్తుంది.
అభి అన్నదాంట్లో తప్పేముందని లాస్య అంటుంది. పక్క పక్కన పేరు ఉన్నంత మాత్రం చెడు దృష్టితో ఎందుకు చూస్తున్నావ్ అని శ్రుతి అంటుంది. మన మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించాల్సిన అవసరం లేదని అనసూయ తులసికి శుభాకాంక్షలు చెప్తుంది. ఆ భూమి పూజ ఆయన్నే చేసుకోమను మనం ఎవరం వెళ్ళడం లేదని అభి అంటాడు. ఇంతక ముందు తులసి అయితే మీరు చెప్పినట్టు నడుచుకుంది, కాని ఇప్పుడు అలా కాదు నాకు నచ్చినట్టు నాకు న్యాయం అనిపించినట్టు నడుచుకుంటాను అని తెగేసి చెప్తుంది.
Also Read: తరగతి గది దాటి తరలిన కథ , ఐ లవ్ యూ రిషి సార్ నన్ను క్షమించండి నా ప్రేమని అంగీకరించండని చెప్పేసిన వసు
ఇన్నాళ్లకి నా కోడలి గొంతులో కొత్త స్వరం వినిపిస్తుంది, మొహంలో సరికొత్త ఆత్మస్థైర్యం కనిపిస్తుందని అంటుంది. మామ్ నేను మన ఇంటి పరువు గురించి ఆలోచించి చెప్తున్నా నా మాట విను అని అభి అంటాడు కానీ తులసి మాత్రం వెళ్తున్నాం అని చెప్పేస్తుంది. అభి కోపంగా ఇన్విటేషన్ కార్డ్ తీసుకుని చింపేస్తాడు. దాంతో పరంధామయ్య అభి మీద చెయ్యి ఎత్తుతాడు. తులసి ఆపుతుంది. మనం అందరం భూమి పూజకి వెళ్తున్నాం అంతే అనేసి పరంధామయ్య ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. తులసి చిరిగిపోయిన ఆ ముక్కలు ఎత్తుకుంటుంది.
సామ్రాట్ తులసి చేసిన స్వీట్ తింటూ సూపర్ గా ఉందని అంటాడు. సామ్రాట్ బాబాయ్ పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఆడది లేని ఇల్లు గుడి లేని దీపం లాంటిదని పెద్దాయన అంటాడు. రేపు నేను తీసుకొచ్చిన మనిషి హనీని సరిగా చూసుకోకపోతే ఎలా అని సామ్రాట్ అంటాడు. తులసిలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు.. అందుకు సరే అని అంటాడు సామ్రాట్. తులసి చిరిగిపోయిన ముక్కలు చూసి బాధపడటం దివ్య చూస్తుంది.
తరువాయి భాగంలో..
భూమి పూజ ఆటంకం లేకుండా జరిగేలా చూడామణి తులసి వేడుకుంటుంది. అభి లస్యకి ఫోన్ చేసి ఎలాగైనా ఇది చెడగొట్టమని అడుగుతాడు. అందుకు లాస్య కూడా సరే అని చెప్పి ఏదో ప్లాన్ చెప్తుంది.