తులసిని కుటుంబ సభ్యులందరూ కలిసి జాగ్రత్తలు చెప్పి సాగనంపుతారు. అటు సామ్రాట్ కూడా విజిల్ వేస్తూ హుషారుగా ఉంటాడు. అది చూసి ఎంతో అంత సంతోషం విజిల్ వేస్తున్నావని అడుగుతాడు, నువ్వు అనుకున్నది ఐతే కాదు నా మనసులో అటువంటి ఆలోచనలేమి లేవని చెప్తాడు. ఇక రోడ్డు మీద వెళ్తూ ఉండగా సామ్రాట్ కారు బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడుఏం చేద్దామని టెన్షన్ పడుతూ ఉంటాడు. క్యాబ్ బుక్ చేసుకోమని బాబాయ్ సామ్రాట్ కి సలహా ఇస్తాడు. చూస్తే క్యాబ్ అందుబాటులో ఉండవు. మరో వైపు తులసి ఆటోలో వస్తూ మొదటి సారి ఫ్లైట్ ఎక్కుతున్నావ్ కిటికీ పక్క సీట్ దొరికితే బాగుండు అని కిటికీ  నుంచి కిందకి చూస్తే నేల మీద జనాలు చీమల్లగా కనిపిస్తారేమో అని సంబరపడుతూ ఉంటుంది. ఇక సామ్రాట్ క్యాబ్ దొరక్కపోవడంతో నడుచుకుంటూ వెళ్తుంటాడు. లిఫ్ట్ కోసం ఎన్ని కార్లు అడిగినా ఆపకుండా వెళ్లిపోతూ ఉంటాయి. అదే దారిలో తులసి ఆటో కూడా వస్తుంది. సామ్రాట్ ని చూసి తులసి ఆటో ఆపేస్తుంది. కాసేపు సామ్రాట్, తులసి మద్య కామెడీ నడుస్తుంది. నేను ఆటోలో వెళ్తాను మీరు జాగింగ్ చేసుకుంటూ రండి అని అంటుంది. అయ్యో తులసి గారు ఊరికే అన్నాను లిఫ్ట్ కావాలండీ అని అడుగుతాడు. అదేంటి మేడమ్ ఇందాక ఆటో ఆపుతాను అంటే ఇదేమన్నా షేర్ ఆటోనా అన్నారు ఇప్పుడు ఎక్కమంటారెంటీ అని ఆటో వాడు అంటాడు. ఇప్పటి వరకు నడిచాను ఇప్పుడు మీతో  కలిసి ప్రయాణం చెయ్యొచ్చా అని సామ్రాట్ అడుగుతాడు. సరే ర అని ఇద్దరు ఆటో ఎక్కి ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. మొదటిసారి విమానాశ్రయం చూసి తులసి నోరెళ్ళబెడుతుంది.


ఇక ఇంట్లో అందరూ సంతోషంగా నవ్వుకుంటుంటే నందు, లాస్య వస్తారు. చూస్తున్నావ్ కదా నందు అని లాస్య అంటుంది. కూతురు కానీ కూతుర్ని విహారాయాత్రకి పంపించి మీ అమ్మానాన్న ఎంత రిలాక్స్ గా ఉన్నారో చూశావా నందు అని లాస్య అంటుంది. వాళ్ళు వెళ్ళింది విహారయాత్రకి కాదు ఆఫీసు పని మీద అని పరంధామయ్య సీరియస్ గా చెప్తాడు. సతీ సావిత్రి అని టైటిల్ పెట్టి రొమాంటిక్ సినిమా తీసినట్టు పేరుకి వాళ్ళు వెళ్ళింది కానీ.. అని లాస్య అంటుంటే అనసూయ కో తులసి గ మాట్లాడే హక్కు నీకు లేదని అరుస్తుంది. మీఊ ఒప్పుకున్నా కాదన్నా నేను ఈ ఇంటి కోడలిని ఈ ఇంటి పరువు వైజాగ్ సముద్రంలో కలుస్తుంటే చూస్తూ ఊరుకోను మాట్లాడవేంటి నందు అని అడుగుతుంది. ఏం మాట్లాడమంటావ్ అమ్మకి కల చేసి తులసిని టూర్ కి పంపించొద్దని చెప్పాను అయినా నా మాట వినలేదని అంటాడు. వినాల్సిన అవ నాకు కనిపించలేదని అనసూయ గట్టిగానే చెప్తుంది.


Also Read: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి


అదేంటి అత్తయ్య అలా అంటారు.. మీకేమి ఇంట్లో ఉంటారు బయట తిరిగేది అడ్డమైన కామెంట్లు పడేది మేము.. పాపం నందు మొహం చూశారా ఎవరికి తన బాధ చెప్పుకోలేక ఎంత బాధపడుతున్నాడో అని లాస్య అంటుంది. మాకేవారికి లేని బాధ ఆయనకి ఎందుకు.. అయినా అమ్మకి ఆయనకి ఏం సంబంధం ఉందని ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రేమ్ నిలదీస్తాడు. తులసిని నువ్వు అమ్మా అని పిలిస్తే నందుని నాన్న అని పిలుస్తావ్ ఇది చాలదా జోక్యం చేసుకోవడానికి అని లాస్య అంటుంది. 25 ఏళ్లు కాపురం చేశాడు. తులసి ప్రవర్తన చూసి పైకి ఏమి అనలేక లోలపాల కుమిలిపోతున్నాడని లాస్య చెప్తుంది. అంతా అవసరం లేదని ప్రేమ్ అంటాడు. ఇంటికి వచ్చిన డాడీని అవమానకరంగా మాట్లాడకని అంకిత సర్ది చెప్పేందుకు చూస్తుంటే వాళ్ళు అమ్మ గు అవమానకరంగా మాట్లాడుతున్నారు అది వినపడటం లేదా అని అడుగుతాడు. ట చేస్తుంది కాబట్టే అంటున్నారని అ అంటాడు. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. నీకే కాదు నాకు మామ్ గురించి ఆరాటం ఉంది రేపు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటే తను ఫీల్ అవుతుంది మనం ఫీల్ అవుతాము అది నా ఆరాటమని అంటాడు. అప్పుడే ఇంటి పక్కన అమ్మలక్కలు ఇంటికి వచ్చి శ్రావణ శుక్రవారం పేరంటానికి పిలవడానికి వచ్చామని చెప్పి తులసి లేదా అని అడుగుతారు.


ఇదే మంచి టైం అనుకుని లాస్య తులసి గురించి చెడుగా చెప్తుంది. తులసి ఒకప్పుడు తులసి కాదు మీరు ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఉండటానికి ఇప్పుడు తులసి పెద్ద బిజినెస్ మెన్ అయ్యింది అని లాస్య చెప్తుంది. ప్రస్తుతం తను ఎక్కడ ఉందో తెలుసా వాళ్ళ బాస్ తో కలిసి ఫ్లైట్ లో పక్క పక్కన కూర్చుని ఎగిరిపోయింది అని చెప్పడంతో అనసూయ అవమానంగా ఫీల్ అవుతారు. బుద్ధిగా ఇంటి పట్టున ఉండేది ఉండేది పరాయి మగవాడితో కలిసి అలా ఎలా వెళ్ళింది ఇంట్లో వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా అని అంటారు. లేదు ఇంట్లో వాళ్ళే హారతి ఇచ్చి ఆటో ఎక్కించి మరి పంపారు. ఇలా పరాయి మగవాడితో తిరిగే వాళ్ళని మీ ఊర్లో ఏమంటారని లాస్య అంటే తిరుగుబోతు అని అమ్మలక్కలు అంటారు. అమ్మో అంతా పెద్ద మాట అంటారా నాకు తేలియదే అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ మాటకి పరంధామయ్య లాస్యని తిడతాడు. సాటి ఆడదాని గురించి ఇలా మాట్లాడటానికి సిగ్గు లేదా అని తిడతాడు. తిరిగే మీ కోడలికి లేని సిగ్గు మాకెందుకు మ్ mee కోడలిని అదుపులో పెట్టుకోండి అని ఆడవాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు.


Also Read: కాంచన గురించి ఇంట్లో చెప్పి మంట పెట్టిన మాళవిక- ఖైలాష్ ని యష్ విడిపిస్తాడా?


ఇంట్లో జరిగింది ఎవరు తులసితో చెప్పడానికి వీల్లేదని పరంధామయ్య హెచ్చరిస్తాడు. కానీ అనసూయ మాత్రం ఆ మాటలకి చాలా బాధపడుతుంది. ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ మర్చిపోయినట్టు సామ్రాట్ గుర్తు చేసుకుంటాడు. వెంటనే నందుకు ఫోనే చేసి ఫైల్స్ మర్చిపోయాను అవి తీసుకుని మీరు కూడా వైజాగ్ రమ్మని చెప్తాడు.


తరువాయి భాగంలో..


సామ్రాట్, తులసి ఎయిర్ పోర్ట్ లో ఉండగా నాడు, లాస్య కూడా వస్తారు. నేను నందుని పొగడాలని అనుకుంటున్నాను భారకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని సామ్రాట్ అంటాడు.