Varalaxmi Sarath Kumar Marriage Update: న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్.. ఎన్నో మంచి మంచి సినిమాలు, ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్లు చేసి ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ లు చేసి దూసుకెళ్తున్నారు. ఆమె త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. మార్చి 2న వ్యాపారవేత్త, త‌న స్నేహితుడైన‌ నికోలయ్ సచ్‌దేవ్ తో ఆమె ఎంగేజ్మెంట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. కొద్ది మంది స‌న్నిహితులు, కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య ఈ వేడుక  ముంబైలో నిర్వ‌హించారు. అయితే, ఆ త‌ర్వాత ఆమె పెళ్లి ఎప్పుడు అనే విష‌యం మాత్రం చెప్ప‌లేదు. కాగా... ఇప్పుడు ఆమె పెళ్లికి సంబంధించి వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 


పెళ్లి ఎప్పుడు, ఎక్క‌డంటే? 


ప్ర‌స్తుతం వ‌రుస రిలీజ్ లు, స‌క్సెస్ తో బిజీగా ఉన్నారు వ‌ర‌ల‌క్ష్మీ. పెళ్లి ఎప్పుడు ఎక్క‌డ ఎలా చేసుకోవాలి అనేది తాను ఎప్పుడూ డిసైడ్ అవ్వ‌లేద‌ని గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పింది ఆమె. ఎప్పుడు ఉంటుందో కూడా చెప్ప‌లేన‌ని వెల్ల‌డించింది. అయితే, ఇప్పుడు ఆమె పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింద‌ట‌. జూలై 2న థాయ్ లాండ్ లో జ‌ర‌గ‌నుంద‌ట‌. దానికి సంబంధించి ఇప్ప‌టికే ఇరు కుటుంబాలు ప‌నులు కూడా మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. 


రిసెప్ష‌న్ ఎక్క‌డంటే? 


వ‌ర‌ల‌క్ష్మీ పెళ్లి డెస్టినేష‌న్ వెడ్డింగ్. దీంతో చాలా కొద్దిమంది, ముఖ్య‌మైన వాళ్ల‌నే పెళ్లికి పిలుస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే, రిసెప్ష‌న్ మాత్రం గ్రాండ్ గా అంద‌రిని పిలిచి జ‌ర‌పాలి అనుకుంటున్నార‌ట. దాని కోసం చెన్నైలో రిసెప్ష‌న్ వేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  తాజ్ హోటల్‌, లీలా ప్యాలెస్‌లో వేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఈ విష‌యాల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. 


14 ఏళ్ల ప‌రిచ‌యం.. 


వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ పెళ్లి గురించి ఎన్నో రూమ‌ర్స్ వ‌చ్చాయి గ‌తంలో. విశాల్ తో ఆమె డేటింగ్ లో ఉన్నార‌ని, అత‌నితోనే పెళ్లి అంటూ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే, ఆ రూమ‌ర్స్ ని ప‌టాపంచ‌లు చేస్తూ మార్చిలో షెడ‌న్ గా నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసింది. నిక్, వ‌ర‌ల‌క్ష్మీ దాదాపు 14 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. ఆయ‌న నార్వేలో ఆమెకు ప్ర‌పోజ్ చేయ‌గా.. ఒప్పుకుంది. ఆ త‌ర్వాత బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఇద్ద‌రి నిశ్చితార్థం నిర్వ‌హించారు. 


విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో... 


వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ్ యాక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ ఆమెకు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. కార‌ణం ఆమె చేసే పాత్ర‌లు అలా ఉంటాయి. విల‌న్ పాత్ర‌ల్లో తన‌దైన ముద్ర వేశారు. కేవ‌లం విల‌న్ మాత్ర‌మే కాదు..  పాత్ర ఏదైనా అలా ఒదిగిపోతారు ఆమె. అలా ఇప్ప‌టికీ త‌మిళ్, తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు వ‌ర‌ల‌క్ష్మీ. ఈమ‌ధ్యే ఆమె న‌టించిన 'శ‌బ‌రి' సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. వ‌ర‌ల‌క్ష్మీ త‌ర్వాతి ప్రాజెక్ట్ 'సివంగి'. ఆనంది, వరలక్ష్మి శరత్‌ కుమార్, జాన్ విజయ్, డా. కోయ కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి భరణి కె ధరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ అయిన ఈయ‌న ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా మారారు. 


Also Read: నన్ను వాళ్లు మోసం చేశారు, వారి ట్రాప్‌లో పడకండి.. జాగ్రత్త - జగపతి బాబు షాకింగ్‌ కామెంట్స్‌