Trisha Krishnan Missed The Oppurtunity: చెన్నై చిన్నది త్రిష దాదాపు రెండు దశాబ్దాల నుంచి సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె పలువురు కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలతో, దర్శక నిర్మాతలతో కలిసి పని చేసింది. కానీ ఈ బ్యూటీ ఒకప్పుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఓ సూపర్ హిట్ సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసిందన్న విషయం మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. జక్కన్న లాంటి స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తే ఈ అమ్మడు నో చెప్పేసిందట.

Continues below advertisement


రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన త్రిష 
రాజమౌళి ఇప్పుడంటే పాన్ ఇండియా డైరెక్టర్. మొదటి నుంచీ ఆయన అపజయం అనేదే ఎరగని డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక త్రిష రాజమౌళి ఆఫర్‌ను తిరస్కరించిన సంగతి ఇప్పటిది కాదు. అది జరిగి దాదాపు దశాబ్దానికి పైగానే అవుతోంది. అసలు విషయం ఏమిటంటే... 2010లో రాజమౌళి తెరకెక్కించిన మూవీ 'మర్యాద రామన్న'. ఇందులో సునీల్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. స్టార్ హీరోలు లేకుండానే సునీల్ లాంటి కమెడీయన్‌తో సైతం, కంటెంట్ ఉన్న మూవీని తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగల సత్తా ఉన్న డైరెక్టర్ అని రాజమౌళి నిరూపించుకున్న సినిమా ఇది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా సలోని నటించింది. 


సలోని కంటే ముందు 'మర్యాద రామన్న' హీరోయిన్‌గా త్రిషను అనుకున్నారట. అయితే సునీల్ వంటి కమెడియన్ పక్కన హీరోయిన్‌గా నటించడం వల్ల కెరియర్‌పై ఎఫెక్ట్ పడుతుందని భావించిన త్రిష సున్నితంగా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట. దీంతో ఆమె స్థానంలో సలోనిని తీసుకున్నారు. ఏదైతేనే మొత్తానికి ఈ మూవీ నటీనటులతో సంబంధం లేకుండా, కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే సునీల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా మారింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమాలోనూ త్రిష కనిపించలేదు. ఇటు జక్కన్న పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే, మరోపక్క వరుస సినిమాలతో త్రిష స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని అందుకుంది. 


'ఎస్ఎస్ఎంబి 29'తో జక్కన్న బిజీ 
ఇదిలా ఉండగా దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం 'ఎస్ఎస్ఎంబి 29' అనే అడ్వెంచర్ థ్రిల్లర్‌తో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ ప్రధాన పాత్రను పోషిస్తుంది. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్‌గా మొదలైంది. మరోవైపు త్రిష హీరోయిన్‌గా నటించిన 'విడాముయార్చి' మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. అలాగే ఆమె మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర', కమల్ హాసన్ 'థగ్ లైఫ్' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది.


Read Also: Pattudala Twitter Review - విడాముయ‌ర్చి ట్విట్టర్ రివ్యూ: అజిత్ సినిమాకు స్టార్టింగ్ ప్రాబ్లమ్ కానీ... ఆ ట్విస్టులు గట్రా - సోషల్ మీడియా టాక్ ఎలా ఉందంటే?