Rashmika Mandanna: ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందనా రిలేషన్‌షిప్ హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించడం లేదు.. అలా అని హింట్స్ ఇవ్వకుండా ఆపడం లేదు. విజయ్, రష్మిక.. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. వీరిద్దరూ కలిసి ఫోటోలు మాత్రం పోస్ట్ చేయరు. కానీ వీరు పోస్ట్ చేసే దాదాపు అన్ని ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అలా వీరిద్దరూ దొరికిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఒక పింక్ క్యాప్ పెట్టుకొని ఫోటోను పోస్ట్ చేసింది రష్మిక. ఆ ఫోటో వల్ల మరోసారి విజయ్, రష్మిక దొరికిపోయారని నెటిజన్లు అనుకుంటున్నారు. దానికి ప్రూఫ్‌ను కూడా వెతికి పట్టుకున్నారు.


అదే ఫోటో..


విజయ్ దేవరకొండ, రష్మిక మందనా.. కలిసి ట్రిప్స్‌కు వెళ్తారనేది ఇండస్ట్రీ సమాచారం. కానీ ఎక్కడా వీరు కలిసి దిగిన ఫోటోలు బయటకు రావు. అయితే, ఒకే బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి ఇలా చాలాసార్లు దొరికిపోయారు. ఇక తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా రష్మిక ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘నా లవ్లీ లేడీస్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఒక అమ్మాయిగా ఉండడం అదృష్టం. అది గుర్తుపెట్టుకోండి’ అంటూ బ్లూ టీషర్ట్‌లో దిగిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. కానీ ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది తను పెట్టుకున్న పింక్ క్యాప్. మామూలు పింక్ క్యాపే కదా అని అనుకోవచ్చు. కానీ అంతలోనే విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇదే క్యాప్‌తో ఫోటో కనిపించింది.






ఒక్క పోస్ట్‌తో డౌట్లు..


చాలారోజుల క్రితం విజయ్ దేవరకొండ తన ఇంట్లోని సోఫాలో మామూలుగా ఒక ఫోటో దిగి పోస్ట్ చేశాడు. ‘‘ఒక కౌచ్, ఒక పింక్ క్యాప్, ప్రేమతో ఒక ఉంగరంతో పాటు నీ మనిషి’’ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశాడు విజయ్. ఇప్పుడు అదే క్యాప్ రష్మిక దగ్గర కనిపిస్తుండడంతో ఈ జంట మరోసారి దొరికిపోయిందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక రష్మిక షేర్ చేసిన పోస్ట్‌లో అయితే గొడుగు పట్టుకొని ఒక వ్యక్తి చేయి కూడా కనిపిస్తోంది. ఆ చేయి అంత క్లియర్‌గా కనిపించకపోయినా.. అది విజయ్ చెయ్యే అని చాలామంది నెటిజన్లు ఫిక్స్ అయిపోతారు. తాజాగా ఒక అవార్డ్స్ ఈవెంట్ కోసం రష్మిక టోక్యో వెళ్లగా.. విజయ్ కూడా తనను ఫాలో అయ్యి వెళ్లుంటాడని వారు అభిప్రాయపడుతున్నారు.






టోక్యోలో షికార్లు..


సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ‘యానిమల్’ తర్వాత ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ రష్మికను వెతుక్కుంటూ వచ్చాయి. అందులో చాలావాటికి తను గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రష్మిక.. షార్ట్ బ్రేక్ తీసుకొని టోక్యో వెళ్లింది. అక్కడ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొన్న తర్వాత టోక్యో రోడ్లపై షికార్లు చేస్తూ ఈ పింక్ క్యాప్ పెట్టుకొని ఫోటో తీసి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే ఫిబ్రవరీలో విజయ్, రష్మికల ఎంగేజ్‌మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అవ్వగా.. అది అబద్ధమని విజయ్ కొట్టిపారేశాడు. కానీ ఇలా ఫోటోలు షేర్ చేయడం మాత్రం ఆపడం లేదని నెటిజన్లు అనుకుంటున్నారు.


Also Read: రాజకీయాల్లోకి రచన - పశ్చిమ బెంగాల్‌లో ఎంపీగా పోటీ చేస్తున్న టాలీవుడ్ నటి