Zombie Reddy 2: 'జాంబీ రెడ్డి' సీక్వెల్‌కు కొత్త డైరెక్టర్... వేరే వాళ్ల చేతిలో కథ పెట్టిన ప్రశాంత్ వర్మ... లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

Zombie Reddy 2 : 2021లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ 'జాంబీ రెడ్డి' సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీక్వెల్ కు కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారు అని సమాచారం.

Continues below advertisement

యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా రూపొందిన 'జాంబి రెడ్డి' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీ వచ్చిన నాలుగేళ్ల తరువాత సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ ప్రొడక్షన్ చేతులు మారడంతో పాటు, సినిమా కోసం కొత్త డైరెక్టర్ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.

Continues below advertisement

'జాంబిరెడ్డి' సీక్వెల్ కి కొత్త డైరెక్టర్ 
గత ఏడాది 'హనుమాన్' హిట్ తో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన మూవీ 'జాంబీరెడ్డి'. కరోనా టైంలోనే రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ కమర్షియల్ గా ఈ మూవీ సక్సెస్ అయ్యింది. ఈ మూవీతోనే 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకుడిగా ఫస్ట్ టైం మెగా ఫోన్ పట్టారు. అయితే ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ సీక్వెల్ కు ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు. సీక్వెల్ కి మాత్రం ప్రశాంత్ వర్మ దర్శకుడుగా వ్యవహరించట్లేదు అని తెలుస్తోంది. 

ఈ సినిమాకు కేవలం ప్రశాంత్ వర్మ కేవలం స్క్రిప్ట్ అందించనున్నారని అంటున్నారు. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ షోరన్నర్ గా వ్యవహరించబోతున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి సీక్వెల్ లోజాంబీస్ కు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ తో పాటు, షూటింగ్ ను త్వరగా పూర్తి చేయగల బాలీవుడ్ డైరెక్టర్ కోసం నిర్మాతలు వెతుకుతున్నారని టాక్ నడిచింది. తాజా సమాచారం ప్రకారం ఎట్టకేలను మేకర్స్ డైరెక్టర్ ను పట్టేశారని అంటున్నారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు సుపర్ణ్ వర్మ. 

రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసిన ఈ డైరెక్టర్ ఇప్పుడు 'జాంబీ రెడ్డి' సీక్వెల్ తో టాలీవుడ్లో డెబ్యూ డైరెక్టర్ గా అడుగు పెట్టబోతున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక ఈ క్రేజీ సీక్వెల్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగావంశీ నిర్మిస్తుండడం విశేషం. మొదట్లో ఈ సినిమాను బాలీవుడ్ స్టూడియో నిర్మించాల్సి ఉంది. 

Also Read: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంక మరదలు టాలీవుడ్ హీరోయినే

ఆ శత్రుత్వం తగ్గినట్టేనా? 
నిజానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని నానుడి ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే వర్తిస్తుంది. గత ఏడాది నాగవంశీ నిర్మించిన 'గుంటూరు కారం' వర్సెస్ ప్రశాంత్ వర్మ - తేజ కాంబోలో వచ్చిన 'హనుమాన్' రిలీజ్ విషయంలో ఏ రేంజ్ లలో హీటింగ్ డిస్కషన్ జరిగిందో తెలిసిందే. ఎట్టకేలకు ఈ గొడవలన్నీ సద్దుమణిగి తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ, నాగ వంశీ కలిసి సినిమాను చేస్తుండడం విశేషం. 

కాగా రీసెంట్ గా నిర్మాత నాగ వంశీ 'డాకు మహారాజ్' మూవీతో హిట్ అనుకున్నారు. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో పలు భారీ సినిమాలకు సిద్ధమ అవుతున్నారు. ఇక హీరో తేజా సజ్జా 'మిరాయ్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. 

Also Readవందకు పైగా సినిమాల్లో నటించిన పుష్పలత ఇకలేరు... యాక్టింగ్ మానేశాక ఏం చేశారు? కూతురూ హీరోయినే అని తెల్సా?

Continues below advertisement