Ram Charan and Sukumar Movie  : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' సినిమాను పూర్తి చేసిన ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అంతలోనే మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ సుకుమార్ తో ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది అనే అప్డేట్ బయటకు వచ్చింది. 


'గేమ్ ఛేంజర్' ఈవెంట్ కు గెస్ట్  


ప్రస్తుతం మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. భారీ హైప్ నెలకొన్న ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరోవైపు మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' మెగా ఈవెంట్ వచ్చే వారం అమెరికాలోని టెక్సాస్, డల్లాస్ లో జరగబోతోంది. ఈవెంట్ కి 'పుష్ప 2' డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈవెంట్ లో భాగంగా 'గేమ్ ఛేంజర్' మెగా మాస్ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటి నుంచి 'గేమ్ ఛేంజర్'కు సంబంధించిన మెగా ప్రమోషనల్ ఈవెంట్స్ షురూ కాబోతున్నాయి.


'ఆర్సీ 17' షూటింగ్ అప్డేట్  


మరోవైపు రామ్ చరణ్ ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'ఆర్సి 16' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 'బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు' ఫినాలేలో పాల్గొన్న రామ్ చరణ్ ఈ సినిమాలో గంగవ్వ, రోహిణి భాగమయ్యారు అనే విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తోంది. అంతలోనే రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. 



రామ్ చరణ్ 17వ సినిమా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ 'ఆర్సి 16' సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, మరోవైపు సుకుమార్ 'పుష్ప 2' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అతిథిగా హాజరు కాబోతున్న ఆయన చెర్రీతో నెక్స్ట్ మూవీ కోసం సిద్ధమవుతున్నారు. 'ఆర్సి 17' సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నుంచి స్టార్ట్ కాబోతోంది అని తెలుస్తుంది. జనవరిలో 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత 'ఆర్సి 16' షూటింగ్ ను పూర్తి చేసి, సుకుమార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు చెర్రీ. ప్రస్తుతానికి 2025 నుంచి 2027 వరకు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్న హీరోలలో ప్రభాస్, తారక్ ఉన్నారు. ఇక ఇప్పుడు చెర్రీ కూడా ఈ లిస్టులో చేరిపోయారు.


Read Also : Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?