Mokshagna Teja: ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. అందులో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఒకరు. మొదట్లో ప్రశాంత్ వర్మ విజన్‌ను ఎవరూ పెద్దగా నమ్మకపోయినా ‘హనుమాన్’ విడుదల తర్వాత ఆ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ చూసి ఒక్కసారిగా క్రిటిక్స్ సైతం షాకయ్యారు. దీంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోల ఫోకస్ సైతం ప్రశాంత్ వర్మ వైపుకు మళ్లింది. కానీ ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి కాస్త కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఇంతలోనే నందమూరి హీరోలతో ప్రశాంత్ వర్మ.. మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.
బాలయ్యతో ఫ్రెండ్‌షిప్..
ప్రశాంత్ వర్మ.. ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరోను కూడా డైరెక్ట్ చేయలేదు. సీనియర్ హీరోల్లో రాజశేఖర్‌తో మాత్రం కలిసి పనిచేశాడు. కానీ నందమూరి హీరో బాలకృష్ణతో మాత్రం తను చేతులు కలిపాడు. ఒకప్పుడు బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోను ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేశాడు. దీంతో ఈ ఇద్దరి హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ‘హనుమాన్’ విడుదలయిన తర్వాత బాలయ్య కోసం ఒక స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు ఈ యంగ్ డైరెక్టర్. ఆ సినిమాను చూసిన తర్వాత ప్రశాంత్ వర్మను ఒక రేంజ్‌లో ప్రశంసించారు బాలయ్య. ఇక బాలయ్యతో పాటు మరో నందమూరి హీరోతో ప్రశాంత్ వర్మ ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
యంగ్ డైరెక్టర్‌కు బాధ్యత..
‘అన్‌స్టాపబుల్’ షో చేస్తున్నప్పుడే ప్రశాంత్ వర్మలోని టాలెంట్‌ను గుర్తించారు బాలకృష్ణ. అందుకే తనతో కలిసి ఎప్పటికైనా సినిమా చేయాలని అనుకుంటున్నానని చాలాసార్లు బయటపెట్టారు. ఫైనల్‌గా ప్రశాంత్ వర్మకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. తన వారసుడు అయిన మోక్షజ్ఞ తేజ బాధ్యతను ప్రశాంత్‌కు అప్పగించారట బాలయ్య. ఇప్పటికే తను హీరోగా పరిచయం అవుతున్నట్టుగా స్వయంగా ప్రకటించాడు మోక్షజ్ఞ. తన వారసుడిని లాంచ్ చేయడానికి ప్రశాంత్ వర్మనే కరెక్ట్ అని బాలకృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీలో బాలయ్య కూడా ఉండనున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
స్వయంగా ప్రకటన..
నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో చర్చలు సాగుతూనే ఉన్నాయి. ‘లెజెండ్’ సినిమా టైమ్ నుండి మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడెప్పుడు డెబ్యూ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఫైనల్‌గా తన లుక్ అంతా మార్చేసి తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశాడు. దానికి వస్తున్నాను అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో మోక్షజ్ఞనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ అంతా తనకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో బాలయ్య, మోక్షజ్ఞ తేజ మల్టీ స్టారర్ అంటే ఫ్యాన్స్ అంచనాలన్నీ ఒక రేంజ్‌లో ఉన్నాయి.
Also Read: బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - స్వయంగా ప్రకటించిన నందమూరి మోక్షజ్ఞ