Nandamuri Mokshagna Teja: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు టాప్ స్థానాల్లో ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫోకస్ అంతా వారి వారసుల వైపు మళ్లింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల వారసులు ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో వారి సినీ ఎంట్రీ గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. అనుకోకుండా ఈ రేసులోకి నందమూరి బాలకృష్ణ వారసుడు దూసుకొచ్చాడు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ.. హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తానే స్వయంగా క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. తాజాగా మోక్షజ్ఞ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.


ఆ సీక్వెల్‌ ఉంటుందా?


బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలాకాలంగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ మూవీ టైమ్ నుండి ప్రేక్షకులకు ఎక్కువగా కనిపించడం మొదలుపెట్టాడు మోక్షజ్ఞ. దీంతో తన సినీ ఎంట్రీ గురించి చాలాసార్లు బాలయ్యకు సైతం ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ‘ఆదిత్య 369’కు తాను సీక్వెల్‌ను తెరకెక్కిస్తానని, ఆ మూవీతోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలాకాలం క్రితమే ఫ్యాన్స్‌కు మాటిచ్చారు బాలకృష్ణ. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. ఇంతలోనే తాను సినీ ఎంట్రీకి సిద్ధమని హింట్ ఇస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు మోక్షజ్ఞ.


స్టైలిష్ లుక్..


తాజాగా తన సోషల్ మీడియాలో లేటెస్ట్ స్టైలిష్ లుక్‌తో ఒక ఫోటోను షేర్ చేశాడు మోక్షజ్ఞ. అంతే కాకుండా ‘వస్తున్నా. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అంతా సిద్ధమని క్లారిటీ వచ్చేసింది. కానీ ఏ సినిమాతో రాబోతున్నాడు? దర్శకుడు ఎవరు? లాంటి వివరాలు అప్పుడే రివీల్ చేయలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త లుక్‌లో తన ఫోటో చూస్తుంటే హీరోగా తెరపై కనిపించడం కోసం మోక్షజ్ఞ చాలా గ్రౌండ్ వర్క్ చేశాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ తన లుక్ చాలా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.






ఫ్యాన్స్ సలహాలు..


మోక్షజ్ఞ.. హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని తెలియగానే కొందరు ఫ్యాన్స్.. తన తండ్రి బాలయ్య లాగా కమర్షియల్ సినిమాలు చేయమని చెప్తుండగా.. మరికొందరు మాత్రం కమర్షియల్ ఫార్మాట్‌ను ఫాలో అవ్వొద్దని సలహాలు ఇస్తున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే పలువురు హీరోలుగా ఎంట్రీ ఇవ్వగా అందులో బాలకృష్ణ, ఎన్‌టీఆర్ మాత్రమే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. ఇక ఎన్‌టీఆర్ అయితే ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. మరి వీరిద్దరిలో మోక్షజ్ఞ ఎవరి రూట్ ఫాలో అవుతాడు? ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడు? అని ప్రేక్షకులు అప్పుడే చర్చలు మొదలుపెట్టారు.



Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్ వచ్చేసింది - స్టెప్పా మార్ అంటున్న రామ్