Kamal Hassan Akali Rajyam And Kalki 2898 AD: 'కల్కీ 2898ఏడీ'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ లే. ఎవరిని కదిలించినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం సినిమా అంతలా నచ్చేసింది ప్రేక్షకులకి. పురాణాలకి సైన్స్ ఫిక్షన్ యాడ్ చేయడం, ఆ విజువల్స్, గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫైట్లు, హాలీవుడ్ సినిమా రేంజ్ లో సీన్లు అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఇదంతా ఒకటైతే.. క్లైమాక్స్ మాత్రం మైండ్ లో నుంచి పోవట్లేదు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది. కారణం.. కమల్ హాసన్ క్యారెక్టర్. ఆయన చెప్పిన శ్రీశ్రీ గారి కవిత. ఆ టైంటో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇక ఇప్పుడు ఆ సీన్ ని ‘ఆకలిరాజ్యం’ సినిమాలోని ఒక సీన్ తో పోల్చి ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.
నిజంగానే భూకంపాలు తెప్పించింది..
'కల్కీ 2898 ఏడీ' సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన యాస్కిన్ గా అందరినీ అలరించారు. నిజానికి ఈ భాగంలో ఆయన కేవలం రెండుసార్లు మాత్రమే కనిపిస్తారు. కానీ, ఆరెండు సార్లు ఆయన తనదైన శైలీలో నటించారు. ఒకసారి సినిమా మధ్యలో కనిపిస్తే.. మరోసారి క్లైమాక్స్ లో కనిపిస్తారు కమల్. ఆయన కనిపించగానే థియేటర్ కేకలు, ఈలలతో దద్దరిల్లిపోయింది. అయితే, ఆయన క్లైమాక్స్ లో చెప్పిన శ్రీశ్రీ కవిత ప్రేక్షకులను ఇంకా ఆకట్టుకుంది. అదే శ్రీశ్రీ కవిత “జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి.. వస్తున్నాయి రథచక్రం ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను. భూకంపం పుట్టిస్తాను” అనే కవిత. శ్రీశ్రీ కవిత్వంతో మొదటి భాగాన్ని ముగించి నిజంగానే థియేటర్లలో భూకంపం తెప్పించారు నాగ్ అశ్విన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అందరూ. బయటికి వచ్చినా అదే ఫీల్ లో ఉన్నామని అంటున్నారు. చివర్లో ఆ డైలాగ్ ఉద్దేశం దేవుడు వస్తున్నట్లు కాదని.. ప్రళయాన్ని తీసుకురాబోతున్నానే అర్థంతో అలా చెప్పి ఉండవచ్చని కొందరు డికోడ్ చేస్తున్నారు.
'ఆకలి రాజ్యం'లో కమల్ హాసన్..
ఇక ఈ డైలాగ్ విన్న ప్రతి ఒక్కరు కమల్ హాసన్ మరో సినిమా 'ఆకలిరాజ్యాన్ని' గుర్తు చేసుకుంటున్నారు. 'ఆకలి రాజ్యం' సినిమాలో కూడా కమల్ హాసన్ ఈ కవితను చెప్తారు. దీంతో ఇప్పుడు ఆ సీన్, ఈ సీన్ ని కలిపి ఎడిట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ నోట్లో మరోసారి శ్రీశ్రీ గారి కవితను వింటుంటే హాయిగా ఉందంటూ ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నారు శ్రీశ్రీ అభిమానులు. ఆ కవిత్వాలు కమల్ హాసన్ నోటి నుంచి వింటుంటే అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 40 ఏళ్ల తర్వాత విన్నా అదే ఫీలింగ్ వస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.
సెకండ్ పార్ట్ లో ఆయనే..
యాస్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ ఈ పార్ట్ లో రెండు సార్లు మాత్రమే కనిపిస్తారు. కానీ, ఆయన రోల్ చాలా పవర్ ఫుల్ అని అర్థం అవుతుంది. ఆ అమ్మాయిని తీసుకొస్తాను అంటే.. వద్దు నేను వెళ్తాను అంటూ కమల్ చెప్పిన డైలాగ్ చెప్తారు. దీంతో సెకెండ్ పార్ట్ లో ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా నాగ్ అశ్విన్ మన తెలుగు సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు అంటూ అభిప్రాయపడుతున్నారు.
Also Read: హిందీ మార్కెట్లో దుమ్మురేపుతోన్న 'కల్కీ 2898 ఏడీ'.. రూ.100 కోట్లు దాటేసిన కలెక్షన్స్