Vijay Deverakonda Remuneration For ‘Kalki 2898 AD’ Movie: నాలుగు ఏళ్ల శ్రమ, రూ. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ధూమ్ ధామ్ చేస్తోంది. కలెక్షన్లలో రికార్డుల మోత మోగిస్తోంది. మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 415 కోట్లు వసూళు చేసి ఔరా అనిపిస్తోంది.  ఇండియన్ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ డైరెక్టర్ టచ్ చేయలేని పాయింట్ తో మూడు అద్భుత లోకాలను సృష్టించి ప్రేక్షకులను తన ఊహల ప్రపంచంలో ఓలలాడించారు నాగ్ అశ్విన్. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ‘అవతార్’ మాదిరిగానే, నాగ్ అశ్విన్ ‘కల్కి’ని సృష్టించారు. ఈ సినిమాపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఇండియన్ సినిమా స్థాయి మరో లెవల్ కు చేరుకుంటుందంటూ అభినందిస్తున్నారు.  


‘కల్కి’లో అల్లు అర్జున్ గా కనిపించిన విజయ్ దేవరకొండ


‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అతిథి పాత్రల జాబితా పద్దదనే చెప్పాలి.  పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. అందులో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పాత్ర ఒకటి. ఇందులో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో తను కనిపించింది తక్కువ సమయమే అయినా, పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఆయన డైలాగులు, ఆహార్యం అందరికీ ఆకట్టుకున్నాయి. సినిమాకు ఆయన పాత్ర మరింత హైప్ ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ మూవీ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ఆసక్తిగా మారింది.  విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర కోసం తీసుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.


ఇంతకీ విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంత అంటే?


‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటనకు గాను విజయ్ దేవరకొండ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. గతంలో నాగ్ అశ్విన్, విజయ్ కలిసి సినిమా చేశారు. అదే స్నేహంతో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాలని నాగ్ అశ్విన్ విజయ్ ని కోరారట. ఆయన పాత్ర గురించి వివరించారట. క్యారెక్టర్ ను మలిచిన విధానం తనకు ఎంతో బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట విజయ్. అది కూడా రెమ్యునరేషన్ లేకుండానే నటిస్తానన్నారట. రెండో భాగంలో విజయ్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చేసిన ఎవరూ రెమ్యునరేషన్ తీసుకోలేదని టాక్. ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కావాలనే ఉద్దేశానికి తోడు నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ సంస్థ మీద ఉన్న గౌరవంతో వాళ్లు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సినీ సర్కిల్లో వినిపిస్తున్న టాక్.    


కీలక పాత్రలు పోషించిన దిగ్గజ నటులు


‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో పాన్ ఇండియన్ స్టార్  ప్రభాస్‌తో పాటు అమితాబ్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ, శోభన కీలక పాత్రలు పోషించారు. అటు దర్శకధీరుడు రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, ఫరియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్ తో పాటు పలువురు నటీనటులు కామియో రోల్స్ పోషించారు.



Read Also: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!