Prabhas Kalki Day 3 Box Office Collections:పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ - నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'కల్కి 2898 AD' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో థియేటర్‌లో దూసుకుపోతుంది. రికార్డు కలెక్షన్స్‌ చేస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. కల్కి థియేటర్లని హౌజ్‌ఫుల్‌ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో హాఫ్‌ సెంచరికి చేరువలో ఉంది. గురువారం (జూన్‌ 27) థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది.


రోజురోజుకు కలెక్షన్స్‌ పెంచుకుంటు సర్‌ప్రైజ్‌ చేస్తుంది. విడుదలైన ఫస్ట్‌ డే రూ.191.5 కోట్ల గ్రాస్‌ చేసింది. ఇక రెండవ రోజు కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌ చేసి వరల్డ్‌ వైడ్‌గా రూ.298.5 కోట్ల గ్రాస్‌ దాటినట్టు మూవీ టీమ్ ప్ర‌క‌టించింది. ఇక మూడో రోజు కూడా అంతకు డబుల్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇక తాజాగా కల్కి మూడవ రోజు కలెక్షన్స్‌ని సినిమా యూనిట్‌ అధికారిక ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 415 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు చేసినట్టు వెల్లడించింది. ఇలా ప్రతిరోజు కల్కి రూ. 100 గ్రాస్‌ మార్క్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇక నేడు ఆదివారం వీకెండ్‌ కూడా కల్కి భారీగానే వసూళ్లు రాబట్టేలా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచన వేస్తున్నారు. 




ఈ రోజు కూడా బుక్‌ మై షో థియేటర్లని హౌజ్‌ ఫుల్‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే నిన్ని శనివారం ఒక్కరోజే కల్కి మూవీ టికెట్టు రికార్డు స్థాయిలో అమ్ముడైనట్టు మూవీ టీం ప్రకటించింది. ఒక్క 24 గంటల్లోనే బుక్‌ మై షోలో కల్కి టికెట్లు 12.8లక్షల అమ్ముడైనట్టు సదరు సంస్థ పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ సినిమా హిస్టరీలో మూడువ రోజు ఏ సినిమా ఇన్ని టికెట్లు అమ్ముడుపోలేదని, ఇదే తొలి చిత్రమని మేకర్స్‌ ప్రకటించారు. 






Also Read: ‘క‌ల్కి’ టక టక్కర ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది - కాంప్లెక్స్‌లో ప్రభాస్‌ చేసిన సందడి మరోసారి చూసేయండి!



వైజయంతీ మూవీస్‌ పతాకంపై నిర్మాత అశ్వినీ దత్‌ దాదాపు రూ. 600 కోట్ల వ్యయంతో 'కల్కి 2898 AD' చిత్రాన్ని నిర్మించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగ్రనటీనటులంతా భాగమయ్యారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, లోకనాయకుడు కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటాని, సీనియర్‌ నటి శోభన ప్రధాన పాత్రలు పోషింంచగ.. దర్శక ధీరుడు రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ, రాజేంద్రప్రసాద్‌, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రలో నటించారు. మహాభారతానికి సైన్స్‌ ఫిక్షన్‌ జోడించి విజువల్‌ వండర్ క్రియేట్‌ చేశాడు నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమా చూసిన సినీ సెలెబ్రిటీలంత నాగ అశ్విన్‌ విజన్‌, మేకింగ్‌ స్టైల్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కల్కి ఒక అద్భుతమని, కల్కితో తెలుగు ఇండస్ట్రీ స్థాయిలో నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకువెళ్లాడంటూ నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.