ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు తీస్తే... అందులో ప్రభాస్ (Prabhas) పేరు మిగతా కథానాయకులు అందరి కంటే ముందు వరుసలో ఉంటుంది. మన బాహుబలి మీద చాలా మంది అమ్మాయిలు మనసు పడ్డారు. మరి, ఆయన మనసులో ఎవరు ఉన్నారో? ఎప్పుడూ చెప్పింది లేదు. అయితే... ప్రభాస్ ఓ ఇంటివాడు అయితే? ఆయన ఏడు అడుగులు వేస్తే? చూడాలని ఆశ పడుతున్న ప్రేక్షకుల సంఖ్య లెక్కలేదు. కుటుంబ సభ్యుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తరుణం రానే వచ్చిందని టాక్.


'అన్‌స్టాపబుల్ 2'లో ప్రభాస్ పెళ్లి టాపిక్!
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ 2'కు రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చారు. ఆయనతో పాటు స్నేహితుడు గోపీచంద్ కూడా సందడి చేశారు. షోలోని ముగ్గురితో మరో స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోనులో మాట్లాడారు. అసలు విషయం ఏంటంటే... 'పెళ్లి ఎప్పుడు?' ఈ టాపిక్ చుట్టూ షో కొంత సేపు నడిచిందట.
స్టార్ హీరోలను సినిమా జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలు అడగటానికి మొహమాట పడతారు. అటువంటి ప్రశ్నలను బాలకృష్ణ అలవోకగా అడుగుతున్నారు. ప్రభాస్ ముందు 'అన్‌స్టాపబుల్ 2' ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చారని సమాచారం. 'పెళ్లి ఎప్పుడు?' అని అడిగారట. ఎప్పటిలా ప్రభాస్ సమాధానం చెబితే... రామ్ చరణ్, గోపీచంద్ కొత్త ఆన్సర్ ఇచ్చారట. 


రెండు నెలల్లో ప్రభాస్ పెళ్లి!?
Prabhas Marriage : ప్రభాస్ మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోనున్నారని బాలకృష్ణతో 'అన్‌స్టాపబుల్ 2'లో రామ్ చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తప్పకుండా ప్రభాస్ పెళ్లి ఉంటుందని గోపీచంద్ కూడా చెప్పారట. ఈ న్యూస్ రెబల్ స్టార్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చేదని చెప్పాలి. కొంత మంది అమ్మాయిలకు హార్ట్ బ్రేకింగ్ కూడా!


బాలయ్యతో బాహుబలి...
ఇది చిన్న గ్లింప్స్ మాత్రమే!
ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా వచ్చిన ఎపిసోడ్ గ్లింప్స్ 'ఆహా' విడుదల చేసింది.  'ఇది చిన్న గ్లింప్స్ మాత్రమే. మెయిన్ ప్రోమో తర్వాత' అని ఆహా పేర్కొంది. ఈ గ్లింప్స్‌లో 'రేయ్... ఏం చెబుతున్నావ్ డార్లింగ్!' అని ప్రభాస్ అనడం హైలైట్. బహుశా... పెళ్లి గురించి రామ్ చరణ్, గోపీచంద్ ఏమైనా చెప్పినప్పుడు ఆ మాట అన్నారేమో!? త్వరలో ఆ విషయం తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఎపిసోడ్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.


Also Read : షారుఖ్ 'బేషరమ్ రంగ్'కు రాజకీయ రంగు - 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడి సెటైర్లు?
 





డబుల్ ధమాకా... డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్... డబుల్ గెస్టులు... డబుల్ సందడి... అన్నట్టు నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' (Unstoppable) సెకండ్ సీజన్ సాగుతోంది. 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇద్దరు లేదా ముగ్గురు గెస్టులను తీసుకు వస్తున్నారు. ఈసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) రావడంతో క్రేజ్ మరో రేంజ్ లో ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్‌ ట్రెండ్ అవుతోంది. రికార్డ్ స్థాయిలో ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.