ఈ రోజు హీరోయిన్ రెజినా బర్త్ డే. దీంతో హీరో సందీప్ కిషన్ ఆమెకు ట్విట్టర్ ద్వారి విషెస్ చెప్పాడు. ఔనా, వారిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా.. తప్పకుండా చెబుతాడు. ఇందులో తప్పుబట్టడానికి ఏముందనేగా మీ సందేహం. అది కూడా నిజమే. కానీ, సందీప్ కిషన్ పోస్ట్ చేసిన ఫొటోను చూసి.. నెటిజనులు ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఇంతకీ విషయమేమిటంటే.. డిసెంబర్ 13 న టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా పుట్టిన రోజు సందర్భంగా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రెజీనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ‘హ్యాపీ బర్త్ డే పాప.. ఎప్పుడూ సంతోషంగా ఉండు. పుట్టిన రోజు శుభాకాంక్షాలు’ అంటూ ఇద్దరు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు సందీప్. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గతం నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘రారా కృష్టయ్య’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో సందీప్ రెజీనా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక అప్పటి నుంచే వీరి మధ్యలో స్నేహం మొదలైందని టాక్. అలాగే ప్రేమ పుకార్లు కూడా షికారు చేశాయి. ఇటీవల వీరిద్దరు కలిసి నటించడం లేదు. దీంతో దాదాపు ఆ గాసిప్స్ కూడా పెద్దగా వినిపించడం లేదు. అయితే తాాజాగా సందీప్ కిషన్ పోస్ట్ చేసిన ఫోటోను చూసి.. నెటిజనులు మళ్లీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సందీప్ గానీ, రెజీనా గానీ స్పందించలేదు.
ఇక సందీప్ కిషన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్ లు అందుకున్నా గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ‘మైఖేల్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సందీప్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. అలాగే రెజీనాకు కూడా తెలుగులో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా రెజీనాకు సరైన హిట్ సినిమా పడటంలేదు. ఇటీవల విడుదలైన ‘శాకిని డాకిని’ సినిమా కూడా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇటు సినిమా అవకాశాలు తగ్గడంతో పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోందీ బ్యూటీ.
Also Read: మెగాస్టార్ సినిమాలో రవితేజ ఘాటు లిప్ లాక్ - ఎవరితో అంటే?