'వాల్తేరు వీరయ్య'లో హీరోయిన్ ఎవరు? ప్రేక్షకులు ఎవరైనా చాలా ఈజీగా ఆన్సర్ చెబుతారు... 'శృతి హాసన్' అని! సినిమాలో ఆవిడ కాకుండా మరో హీరోయిన్ కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా శృతి నటిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో విదేశాల్లో ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అది పక్కన పెడితే...
 
మాస్ మహారాజ జోడీగా కేథరిన్!
Ravi Teja Lip Lock : 'వాల్తేరు వీరయ్య'లో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో మాస్ మహారాజ రవితేజ యాక్ట్ చేశారు. ఆయనకు జోడీగా కేథరిన్ (Catherine Tresa) కనిపించనున్నారు. ఈ ఇద్దరి మధ్య ఘాటు లిప్ లాక్ ఉందని తెలిసింది. ఈ మధ్య ఆ సీన్ షూట్ చేశారట.
 
రీసెంట్‌గా రవితేజ క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. ''ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లను ఎత్తుకుని పులి వస్తా ఉన్నది'' అంటూ మాస్ మహారాజ పాత్రను పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. ఓ చేత్తో మేకపిల్లను పట్టుకుని, మరో చేత్తో గొడ్డలితో గ్యాస్ సిలిండర్ లాగుతూ... రవితేజ చేసిన ఫైట్ సినిమాపై అంచనాలు పెంచింది. 'ఏం రా... వారి... పిస పిస చేస్తున్నావ్! నీకింకా సమజ్ కాలే! నేను ఎవని అయ్యకూ విననని!' అని రవితేజ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. 


Also Read : రాజమౌళి అనుమానించాడు గానీ ప్రభాస్ కాదు


మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానుల్లో ఒకరైన బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజతో ఇంతకు ముందు ఆయన 'పవర్' సినిమా చేశారు. అందులో హీరోది పోలీస్ ఆఫీసర్ రోల్. ఇప్పుడు 'పవర్'కు కొత్త పేరు అంటూ విక్రమ్ సాగర్ పాత్రను పరిచయం చేశారు. 



బాస్ పార్టీకి భలే రెస్పాన్స్!
విడుదల తేదీ కంటే ముందు 'బాస్ పార్టీ' పాటను మెగా అభిమానులకు కానుకగా దేవి శ్రీ ప్రసాద్ అందించారు. అందులో చిరంజీవితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్టెప్పులు వేశారు. యూట్యూబ్‌లో ఆ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆల్రెడీ 20 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఇప్పుడు రవితేజ క్యారెక్టర్ టీజర్, అంతకు ముందు చిరంజీవి టీజర్‌కు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. మెగాస్టార్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి, ప్రమోషన్స్ మీద కాన్సంట్రేషన్ చేయనున్నారు.
 
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.