'అవతార్ 2' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ శుక్రవారమే సినిమా విడుదల. తెలుగు ప్రేక్షకుల్లో కూడా బజ్ బావుంది. చాలా మంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు మార్కెట్ మీద హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం తెలుగు బాగా తెలిసిన రచయిత, దర్శకుడు, కథానాయకుడికి మాటలు రాసే బాధ్యత అప్పగించారు.
అవసరాల మాటల్లో 'అవతార్ 2'
అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) కథానాయకుడు మాత్రమే కాదు... హీరో కంటే ముందు ఆయనలో రచయిత ఉన్నాడు. తెలుగు భాషా ప్రేమికుడు ఉన్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే చాలు... అవసరాల తెలుగు ఎంత స్పష్టంగా, డైలాగులు ఎంత సూటిగా ఉంటాయో ఉంటుందో తెలుస్తుంది. అందుకే, ఆయన చేత 'అవతార్ 2'కి డైలాగులు రాయించినట్టు ఉన్నారు.
అవసరాలతో అడ్వాంటేజ్ ఏంటంటే... ఆయన హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లీష్‌పై మంచి పట్టు ఉంది. అమెరికాలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన వ్యక్తి కావడంతో అక్కడ ప్రొడక్షన్ వ్యవహారాలపై అవగాహన ఉంది. 'అవతార్ 2' మాటల్లో ఆత్మ పట్టుకుని తెలుగుకు తగ్గట్టు మంచి సంభాషణలు రాశారట.
Also Read : వయసుతో పాటు మారిన కథానాయకుడు, ప్రయోగాలకు భరోసా ఇచ్చిన 'విక్టరీ'
'అవతార్' (Avatar Movie)... భారతీయ ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేని సినిమా పేరు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని తేడాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో విజయం సాధించింది. జేమ్స్ కామెరూన్ (James Cameron) క్రియేట్ చేసిన పండోరా గ్రహం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పండోరా గ్రహంలో జీవులు కూడా నచ్చేశాయి. ఇప్పుడు 'అవతార్'కు సీక్వెల్ వస్తోంది. భారతీయుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాపై ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణ... అడ్వాన్స్ బుకింగ్స్!
డిసెంబర్ 16న విడుదల కానున్న 'అవతార్ 2' (Avatar 2) విడుదల అవుతోంది. మన దేశంలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అవుతోంది. అన్ని భాషల్లో ప్రీ సేల్స్ బావున్నాయి. టికెట్స్ బాగా అమ్ముడు అవుతున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది.
'అవతార్ 2' @ రెండు లక్షల టికెట్లు
కొన్ని రోజుల క్రితం ఇండియాలో 'అవతార్ 2' టికెట్స్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడు అయ్యాయి. ఆ జోరు అలా కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉంది. అయితే, ప్రేక్షకులు ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఆ రోజు వరకు వేచి చూసే ధోరణిలో లేరు.
ఇప్పటి వరకు ఇండియాలో సుమారు 2.20 లక్షల మందికి పైగా ప్రేక్షకులు 'అవతార్ 2' టికెట్స్ బుక్ చేసుకున్నారు.
'అవతార్ 2'కు వస్తున్న వసూళ్ళలో 75 శాతం మల్టీప్లెక్స్ చైన్స్ నుంచి అని టాక్. నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్‌లలో బుకింగ్స్ బావుంటే... సౌత్ ఇండియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బుకింగ్స్ బావున్నాయి.