Retail Inflation Data: భారత దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. 2022 అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైన వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation), నవంబర్‌లో మరింత తగ్గి 5.88 శాతానికి దిగి వచ్చింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి. ఏడాది క్రితం, 2021 నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.91 శాతంగా ఉంది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (NSO) ఈ డేటాను విడుదల చేసింది.


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) లక్ష్యిత స్థాయి అయిన 6 శాతం కంటే దిగువకు రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ చేరడం విశేషం. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న కంఫర్ట్ లెవెల్ 2-6 శాతం. దేశంలో ద్రవ్యోల్బణాన్ని ఈ రేంజ్‌లోనే ఉంచాలన్నది RBI లక్ష్యం. 2022 జనవరి నుంచి అక్టోబర్‌ వరకు, వరుసగా 10 నెలల పాటు 6 శాతం కంఫర్ట్ లెవెల్ పైనే నమోదై చిల్లర ద్రవ్యోల్బణం.. తాజాగా నవంబర్‌లో 6 శాతం లోపునకు దిగి వచ్చింది. ద్రవ్యోల్బణం కట్టడికి రెపో రేటును దఫదఫాలుగా RBI పెంచుతూ వచ్చింది. ఈ ఏడాది మే నుంచి డిసెంబర్‌ వరకు, విడతల వారీగా 4 శాతం నుంచి 2.25 శాతం పెంచి 6.25 శాతానికి చేర్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టిన చర్యలు ఫలించి దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది.


ఆహార ద్రవ్యోల్బణంలో భారీ తగ్గుదల
నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ డేటా ప్రకారం... ఆహార పదార్థాల ధరలు బాగా తగ్గడం వల్ల చిల్లర ద్రవ్యోల్బణం రేటులో తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం 2022 అక్టోబర్‌లో 7.01 శాతంగా ఉండగా, నవంబర్‌లో 4.67 శాతానికి తగ్గింది. అటు పట్టణ ప్రాంతాలు, ఇటు గ్రామీణ ప్రాంతాలు రెండు ఏరియాల్లోనూ ఆహార పదార్థాల రేట్లు దిగి వచ్చినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించింది.


అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.53 శాతంగా ఉండగా, నవంబర్‌లో 3.69 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.30 శాతంగా ఉండగా, నవంబర్‌లో 5.22 శాతానికి తగ్గింది. ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం -8.08 శాతానికి తగ్గింది. పండ్ల (ఫ్రూట్స్‌) ద్రవ్యోల్బణం 2.62 శాతంగా ఉంది.


వడ్డీ రేట్ల పెంపు ఆగుతుందా?
ద్రవ్యోల్బణం ఇలా తగ్గుతూనే ఉంటే, రాబోయే సంవత్సరంలో వడ్డీ రేటు పెంపునకు బ్రేక్ పడవచ్చు. రెపో రేటు పెంపు ప్రక్రియ ఆగిపోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం రేటులో పతనం పెరిగితే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ఉంది. డిసెంబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం ఎంత మేర నమోదవుతుందనే దానిపై ఆధారపడి, ఫిబ్రవరి జరిగే RBI MPC కమిటీలో రెపో రేటు పెంపుపై నిర్ణయం తీసుకుంటారు.


టెక్స్‌టైల్‌, ఫుట్‌వేర్‌, ఆయిల్‌, పవర్‌ సహా ఇతర విభాగాల ద్రవ్యోల్బణం ఇప్పటికీ 6 శాతం పైనే కొనసాగుతోంది. కాబట్టి, డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం మళ్లీ 6.5 శాతానికి చేరొచ్చన్నది మార్కెట్‌ వర్గాల అంచనా. డిసెంబర్‌లో ద్రవ్యో