Nani Daring Step With The Paradise Movie: కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త తరహా సినిమాలు చేసే కథానాయకుడు నాచురల్ స్టార్ నాని. 'దసరా' విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా 'ది ప్యారడైజ్'. దాంతో డేరింగ్ స్టెప్ వేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. అందులో నాని రోల్ గురించి వినిపిస్తున్నది వింటే ఎవరైనా షాక్ అవుతారు.

ట్రాన్స్‌జెండర్‌గా నాని...'ది ప్యారడైజ్' సినిమాలో నాని ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తున్నారని  ఫిలిం నగర్ వర్గాలలో బలంగా వినపడుతున్న లేటెస్ట్ గాసిప్. సినిమా నుంచి విడుదల అయిన ఆయన ఫస్ట్ లుక్ చూశారా? రెండు జడలు వేసుకుని కనిపించారు. అటువంటి లుక్కులో నాని కనిపించడం వెనుక రీజన్ ఏమిటి అని ఫాన్స్ ఆలోచించారు. లుక్ రిలీజ్ చేయడం తప్ప సినిమాకు సంబంధించి ఎటువంటి మ్యాటర్ కూడా రివీల్ చేయలేదు దర్శకుడు.

'ది ప్యారడైజ్'లో నాని రెండు జడలతో కనిపించడం వెనక కారణం ట్రాన్స్ జెండర్ రోల్ అని వినబడుతోంది. ఒక అబ్బాయి ఎందుకు ట్రాన్స్ జెండర్ అయ్యాడు? అనేది సినిమాలో ఆసక్తికరమైన అంశం అట. ట్రాన్స్ జెండర్ అయ్యాక ఏం చేశారనేది కూడా క్రేజీగా ఉంటుందని వినబడుతోంది. 

వ్యతిరేకత వచ్చినా...ఇటీవల 'ది ప్యారడైజ్' టీం విడుదల చేసిన గ్లింప్స్ ఆడియన్స్ అందరికీ ఒక షాక్ ఇచ్చింది. మన తెలుగు ప్రేక్షకులలో నానికి ఉన్న ఇమేజ్ తెలిసిందే. ఇంట్లో సొంత కొడుకుగా చూస్తారు. కుటుంబ ప్రేక్షకులలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అటువంటి హీరో సినిమాలో ఆ మాట ఎలా చెప్పించారు అని కొంత మంది విమర్శలు కూడా చేశారు. అయితే సినిమా విడుదల అయ్యాక వాళ్ళందరూ కన్విన్స్ అవుతారని చిత్ర బృందం అంతా చాలా నమ్మకంగా ఉందట.

టాలీవుడ్ 'మ్యాడ్ మ్యాక్స్'!హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అందులో మెజారిటీ శాతం 'మ్యాడ్ మ్యాక్స్' చూసి ఉంటారు. ఆ సినిమాలో యాక్షన్ అంటే చాలా మందికి ఇష్టం. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తే 'ది ప్యారడైజ్' సినిమా 'మ్యాడ్ మ్యాక్స్' తరహాలో ఉంటుందని నాని తాజాగా చెప్పారు. దాంతో అందరిలో అంచనాలు మరింత పెరిగాయి.

Also Readమళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా

'దసరా' చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి, 'ది ప్యారడైజ్' సినిమా కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న సినిమాను సైతం నానితో కలిసి ఆయన ప్రొడ్యూస్ చేయనున్నారు.‌ ఒక దర్శకుడితో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేయడం అంటే అతని మీద నిర్మాతకు ఎంత నమ్మకం ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

Also Readఆంధ్ర కింగ్ తాలూకా... రామ్ పోతినేని కొత్త సినిమా టైటిల్ వింటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా గుర్తుకు వస్తుందా?