Just In





Vishwambhara Release Date: ఎట్టకేలకు 'విశ్వంభర' రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్... మెగాస్టార్ బర్త్ డే ట్రీట్ ఇస్తారా?
Vishwambhara: డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ 'విశ్వంభర'. చిరు బర్త్ డే రోజున మేకర్స్ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటింగ్ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'విశ్వంభర' (Vishwambhara Movie). ఈ మూవీ రిలీజ్ గురించి మెగా అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీని మే నెలలో రిలీజ్ చేయబోతున్నారంటూ రూమర్లు వినిపించాయి. కానీ తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాను చిరంజీవి పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
చిరంజీవి బర్త్ డే ట్రీట్ గా 'విశ్వంభర' రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, 'బింబిసారా' ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ 'విశ్వంభర'. ఈ మూవీని ముందుగా 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ కోసం 'విశ్వంభర' వెనక్కి తగ్గాడు. ఫలితంగా 'గేమ్ ఛేంజర్' మూవీ 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. దీంతో సంక్రాంతి సీజన్ 'గేమ్ ఛేంజర్' కంటే 'విశ్వంభర' లాంటి ఫ్యాంటసీ సబ్జెక్ట్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
సినిమా ఆలస్యం కావడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. 'విశ్వంభర' టీజర్ లో కనిపించిన వీఎఫ్ఎక్స్ పై ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్ ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ పై స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేశారు. ఇక ఆ తర్వాత 'విశ్వంభర' మూవీని నిర్మాతలు మే నెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్ నడిచింది. కానీ గ్రాఫిక్ వర్క్స్ ఇంకా పూర్తిగా పోవడంతో మూవీ రిలీజ్ మేలో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. మంచి క్వాలిటీ తో విజువల్ ఫీస్ట్ గా 'విశ్వంభర' మూవీని లేటుగా అయినా సరే లేటెస్ట్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా 'విశ్వంభర' మూవీని థియేటర్లలోకి తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఇటీవల కాలంలో భారీ అంచనాలున్న సినిమాలకు ముందుగానే ఓటీటీ డీల్స్ క్లోజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ 'విశ్వంభర' మూవీ విషయంలో మాత్రం ఇంకా ఓటీటీ డీల్ లాక్ కాలేదని తెలుస్తోంది. మరి మేకర్స్ ఈ మూవీ డిజిటల్ పార్టనర్ ను ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? మూవీ రిలీజ్ డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఈ భారీ ప్రాజెక్టులో త్రిష, ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, కునాల్ కపూర్, ఇషా చావ్లా, సురభి వంటి హీరోయిన్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి మూవీకి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'విశ్వంభర' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Also Read: మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా