Vijay - Trisha Relationship Rumours: పెళ్లయినా కూడా మరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉండడం అనేది సినీ పరిశ్రమలో కామన్ అని కొందరికి నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. దానికి తగినట్టుగానే అలాంటి కొన్ని ప్రేమజంటలు కూడా తరచుగా మనకు ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి లిస్ట్‌లోకి ఇప్పుడు ఒక స్టార్ హీరో, హీరోయిన్ చేరాయనే వార్తలు ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వారు మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సీనియర్ హీరోయిన్ త్రిష. కొన్నాళ్లుగా విజయ్‌తో తను షేర్ చేస్తున్న ఫోటోలు, పోస్టులే ఈ రూమర్స్‌కు కారణం. తాజాగా విజయ్ పుట్టినరోజు త్రిష చేసిన పోస్ట్ కూడా నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది.


మిర్రర్ సెల్ఫీ..


జూన్ 22న తన 50వ ఏట అడుగుపెట్టారు స్టార్ హీరో విజయ్. కానీ కల్లకురిచిలో కల్తీ మద్యం తాగి భారీ సంఖ్యలో ప్రజలు చనిపోవడంతో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోకూడదని విజయ్ నిర్ణయించుకున్నారు. అందుకే ఫ్యాన్స్‌ను ఎలాంటి సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆయన పుట్టినరోజు కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది. ఇక త్రిష సైతం విజయ్‌తో కలిసి లిఫ్ట్‌లో తీసుకున్న మిర్రర్ సెల్ఫీని అప్లోడ్ చేసి తనకు విషెస్ చెప్పింది. మామూలుగా త్రిష.. సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు.. ఒకవేళ యాక్టివ్ అయినా తను ప్రత్యేకంగా ఎవరి గురించి ఇలా పోస్ట్ చేయదు. మరి విజయ్ గురించి మాత్రమే ఎందుకు చేసిందంటూ నెటిజన్లలో సందేహం మొదలయ్యింది.






ఒక్కటే షూస్..


విజయ్, త్రిష రిలేషన్‌షిప్‌లో ఉండడం మాత్రమే కాదు.. దాదాపు సంవత్సరం నుంచి కలిసే ఉన్నారని కూడా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ పుట్టినరోజున త్రిష పోస్ట్ చేసిన ఫోటో కూడా వారిద్దరూ హాలిడేకు వెళ్లినప్పటి ఫోటో అని సమాచారం. ఒక క్రూజ్ హాలిడే సమయంలో విజయ్, త్రిష తీసుకున్న ఫోటోనే తను షేర్ చేసిందని నెటిజన్లు అంటున్నారు. కొన్నాళ్ల క్రితం విజయ్.. ఎయిర్‌పోర్టులో కనిపించినప్పుడు తను వేసుకున్న షూస్, ఈ ఫోటోలు షూస్ ఒక్కటే అని వారు గమనించారు. అలా వీరి హాలిడే విషయం బయటికొచ్చింది. అప్పుడప్పుడు తన సింగిల్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది త్రిష. అలాంటి ఫోటోల్లో కొన్ని విజయ్ అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడే తీసిందని అనుమానిస్తున్నారు. విజయ్‌.. 1999లోనే సంగీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఇప్పుడు త్రిషతో రిలేషన్‌షిప్ ఏంటని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. త్రిష మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు.






Also Read: నివేదా థామస్ పెళ్లంట - సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్, ఇంతకీ ఆమె ఏం చెప్పింది?