A Special treat From Pushpa 2: పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో 'పుష్ప: ది రూల్' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ మరింత ఆసక్తిని పెంచాయి. సాంగ్స్, టీజర్, అల్లు అర్జున్ లుక్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదుచూస్తున్న క్రమంలో మూవీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు పుష్ప టీం ప్రకటించింది. కానీ అనూహ్యంంగా ఈ సినిమాను మరో నాలుగు నెలలు పొడగించి వాయిదా వేశారు.
దీంతో ఫ్యాన్స్ అంతా కంగుతిన్నారు. మూవీని మరీ ఇంత వెనక్కి తీసుకేళ్లడం ఏంటని, ఎందుకంత ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారంటూ అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ఇక పుష్ప 2ను వాయిదా వేయడంపై ఫ్యాన్స్‌తో పాటు హీరోయిన్ రష్మిక కూడా నిరాశ వ్యక్తం చేసింది. మొత్తానికి పుష్ప 2 వాయిదా పడటంతో ఆడియన్స్, ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వారందరిని హ్యాపీ చేస్తూ ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. 'పుష్ప 2' నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు 'కల్కి' టీం ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మూవీ వాయిదా పడ్డ డేట్‌కే అంటే ఆగస్ట్ 15న ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతుందట టీం. ప్రస్తుతం ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఇది చూసి ఫ్యాన్స్ అంతా హ్యాపీ అవుతున్నారు.
'పుష్ప' కొత్త రిలీజ్ డేట్ ఇదే..
PushpaThe Rule Release Date: 'పుష్ప: ది రూల్'ను డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేశారు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ మేరకు ఇటీవల హీరో అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించారు. అయితే ఆ సెంటిమెంట్ కోసమే మూవీని డిసెంబర్ వాయిదా వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' సినిమా డిసెంబర్ 17న విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. వరల్డ్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ పాటలు కూడా ఇంటర్నేషనల్ వైడ్‌గా మారుమోగాయి. ఈ చిత్రం ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డునే తెచ్చిపెట్టింది. కాబట్టి అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ పుష్ప డిసెంబర్‌కు వాయిదా వేసినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుస.
Also Read: 'కల్కి 2898 AD' సెకండ్ సింగిల్ కూడా వచ్చేస్తోంది - అధికారిక ప్రకటన ఇచ్చిన టీం