'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆల్మోస్ట్ మూడేళ్లు మరో సినిమా చేయలేదు. అంటే మధ్యలో 'ఆచార్య' చేసినా... అందులో ఆయనది ప్రత్యేక అతిథి పాత్ర తప్ప సోలో హీరో కాదు. అందుకని, మరో సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రయత్నించారు. కానీ, రోజు రోజుకూ ఆ సినిమా లేట్ అవుతోంది. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని టాలీవుడ్ ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల టాక్.


'గేమ్ ఛేంజర్'కు రిపేర్లు స్టార్ట్ చేసిన శంకర్!
'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ క్యారెక్టర్ షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అయ్యిందని శంకర్ స్వయంగా చెప్పారు. అయితే... అప్పుడు రిలీజ్ డేట్ చెప్పడానికి ఆయన కొంత ఆలోచించారు. చరణ్ పార్ట్ వరకు కంప్లీట్ అయినా మరో పది పదిహేను రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, అది అయ్యాక ఎడిటింగ్ ఫినిష్ అయ్యాక ఫస్ట్ కాపీ చూసుకుని విడుదల గురించి చెబుతానని అన్నారు. 


'గేమ్ ఛేంజర్' షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని అనౌన్స్ చేశారు. ఫస్ట్ కాపీ కూడా రెడీ చేశారట. అయితే, సినిమా మొత్తం చూశాక కొంత రీషూట్ చేయాలని శంకర్ భావించారట. మరో నాలుగైదు రోజుల పాటు కీలమైన సన్నివేశాలు కొన్ని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. 


రామ్ చరణ్ డేట్స్ కావాలన్న శంకర్!?
ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత రీషూట్స్, రిపేర్లు చేయడం కామన్. 'ఆర్ఆర్ఆర్'కు సైతం కొంత ప్యాచ్ వర్క్ చేశారు. 'బాహుబలి', 'కెజిఎఫ్', 'సలార్' వంటి సినిమాలకూ అంతే! 'గేమ్ ఛేంజర్'ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కావాలని ధృడ సంకల్పంతో ఉన్న శంకర్, ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తున్నారట. రామ్ చరణ్ నాలుగు రోజులు డేట్స్ ఇస్తే సినిమా ప్యాచ్ వర్క్ ఫినిష్ అవుతుందని తెలిసింది. ఆగస్టు నెలాఖరులో ఆ షూట్ చేసే అవకాశాలు ఉన్నాయి.


Also Read: గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడమ్ అంతే... అందాల జాతరలో అస్సలు తగ్గదు, ఈసారి అక్కడ టాటూ చూపిస్తూ...



క్రిస్మస్ 2024లో 'గేమ్ ఛేంజర్' విడుదల!
క్రిస్మస్ సందర్భంగా 'గేమ్ ఛేంజర్' రిలీజ్ చేస్తామని దిల్ రాజు అనౌన్స్ చేశారు. ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేశారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో తెలుగు అమ్మాయి అంజలి నటించారు. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ 'జరగండి జరగండి' సాంగ్ విడుదల చేశారు. త్వరలో మిగతా పాటలు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.


Also Read: విడుదలకు ముందే శాటిలైట్ డీల్ క్లోజ్... మారుతి నగర్ సుబ్రమణ్యం ఏ టీవీలో వస్తుందంటే?