హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేసే ప్రజలకు ఓ ముఖ్య గమనిక. ముఖ్యంగా చీకటి పడిన తరువాత, సాయంత్రం ఆరేడు గంటల నుంచి ప్రయాణం చేసే వ్యక్తులకు ఓ టీవీ ఆర్టిస్ట్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా లేకపోతే మీ పర్సు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. మీతో మెల్లగా పరిచయం పెంచుకుని మీ నుంచి డబ్బులు దోచే ప్రమాదం పొంచి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే...


మెట్రోలో తిరుగుతున్న మాజీ కమెడియన్ స్కామ్‌!
అతడో మాజీ కమెడియన్. మాజీ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే... ఈ మధ్య కాలంలో టీవీల్లో కనిపించడం లేదు. కానీ, ఇంతకు ముందు టాప్ రేటెడ్ టెలివిజన్ షోలో హల్ చల్ చేశాడు. బేసిగ్గా అతడు రైటర్. అయితే అతడు రాసే స్కిట్స్ నచ్చో లేదంటే ఇంకొకటో ఇంకొకటో అతడిని ఆ టీం లీడర్ యాక్టర్ చేశాడు. దాంతో రైటర్ కమ్ యాక్టర్‌కు కొన్నాళ్లు బాగా నడిచింది. ఇప్పుడు కష్టకాలం వచ్చింది. షో నుంచి టీం లీడర్ ఎగ్జిట్ అవ్వడంతో డబ్బులకు కటకట మొదలయ్యింది. దాంతో కొత్త రకం స్కాంకు తెర తీశాడు.


రాయదుర్గం, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్స్ నుంచి రాత్రి తొమ్మిది, తొమ్మిదిన్నర దాటిన తర్వాత ప్రయాణించిన వాళ్లకు ఏదొక సందర్భంలో అతడు కనిపించి ఉండొచ్చు. ఒంటరిగా కూర్చున్న ప్రయాణీకుల దగ్గరకు వచ్చి మెల్లగా మాటలు కదపడం మొదలు పెడతాడు అతగాడు. 
యూట్యూబ్, టీవీల్లో కామెడీ స్కిట్స్ చూడటం అలవాటున్న ప్రజలు అతడిని గుర్తు పట్టడం సహజం. ఒక్కసారి ఎదుటి వ్యక్తి గుర్తు పట్టిన మాట మాట కలపడం మొదలు పెడతాడు. ఆ తర్వాత తల్లికో చెల్లికో ఆరోగ్యం బాలేదని, మెడిసిన్ కొనడం కోసం ఎంతో కొంత డబ్బులు ఇవ్వమని రిక్వెస్ట్ చెయ్యడం స్టార్ట్ చేస్తున్నాడట. ఐటీ ఉద్యోగుల దగ్గర మినిమమ్ ఐదొందలు ఉంటాయని వాళ్లను టార్గెట్ చేస్తూ అందిన కాడికి తీసుకుని మెల్లగా నెక్స్ట్ స్టేషన్‌లో దిగేస్తున్నాడు.


Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు


రీసెంట్‌గా మీడియా ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసే ఉద్యోగి దగ్గరకు వెళ్లి మాట మాట కలిపాడు మెట్రోలో ఆస్కార్ లెవల్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న కమెడియన్. కాసేపటికి మీడియా ఎంప్లాయి అని తెలుసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. వేరే ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. మెట్రోలో అందరి దగ్గర ఎందుకు ఇలా తిరుగుతున్నాడని ఆరా తీసిన మీడియా పర్సన్ అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు.


ఒకవేళ అతడి నిజంగా కష్టాల్లో వుంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఆస్పత్రిలో వుంటే తోటి ఆర్టిస్టులు సాయం చెయ్యడానికి ముందుకొస్తాడు. అలా వచ్చిన సంఘటనలు వున్నాయి. ఫ్యామిలీ మెంబర్ హెల్త్ బాలేదని ఐదొందలు, వెయ్యి అడుగుతుంటే అతడి బిహేవియర్ మీద డౌట్స్ వస్తున్నాయి. అన్నట్టు విశాఖలో ఒక కేసులో కటకటాలు లెక్కపెట్టి వచ్చిన ఘనత ఆ కమెడియన్ ఖాతాలో వుంది.


Also Read: యాంకర్‌ కు ఎంత కష్టం వచ్చింది - సినిమాల్లో ఛాన్సుల్లేక బ్యాక్ టు టీవీ!