Atlee - Allu Arjun Movie: అల్లు అర్జున్ తో మూవీకి అట్లీ భారీ డిమాండ్... పాన్ ఇండియా హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడా ?

Atlee - Allu Arjun Movie : అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రానున్న మూవీ కోసం డైరెక్టర్ షాకింగ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Continues below advertisement

షారుఖ్ ఖాన్ తో 'జవాన్' సినిమా తీసి, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టి 1,000 కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ డైరెక్టర్ రెమ్యూనరేషన్ విషయంలో చేస్తున్న డిమాండ్ నిర్మాతలను షాక్ లో పడేసిందని టాక్ నడుస్తోంది. 

Continues below advertisement

అట్లీకి భారీ రెమ్యూనరేషన్ 
'పుష్ప 2' ఇచ్చిన బిగ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ - అట్లీతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుందని సమాచారం. కానీ అంతలోనే అట్లీ ఈ మూవీకి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అట్లీ ఈ మూవీకి ఏకంగా 100 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ వార్తలపై అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేనప్పటికీ, ఆయన భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు అనే రూమర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

Also Read: 'జబర్దస్త్' కంటే 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి ఎక్కువ... టీఆర్పీలో రెండిటినీ దాటిన టాప్ టీవీ షో ఏదో తెలుసా?

బడ్జెట్ సమస్యలతో ఆగిపోయిన ప్రాజెక్ట్ 
'జవాన్' తర్వాత డైరెక్టర్ అట్లీ ఇటీవలే 'బేబీ జాన్' అనే బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'థెరి' అనే తమిళ సినిమాకు రీమేక్ గా వచ్చిన 'బేబీ జాన్' ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే అట్లీ సల్మాన్ ఖాన్ హీరోగా ఓ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నాడు అనే వార్తలు వినిపించాయి. కానీ ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయిందని టాక్ నడుస్తోంది. ఫలితంగా ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై తన దృష్టిని మళ్ళించాడని అంటున్నారు. కానీ ఆయన భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని, దీంతో నిర్మాతలు అయోమయంలో పడ్డారని రూమర్లు విన్పిస్తున్నాయి. మరి నిర్మాతలు అట్లీ డిమాండ్ కు ఒప్పుకుంటారా లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా మరోవైపు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇదొక భారీ మైథాలజికల్ మూవీగా తెరకెక్కబోతుందని బజ్ నడుస్తోంది. 

Also Read: చిరంజీవి ‘అన్నయ్య’, పవన్ ‘తమ్ముడు’ to మహేష్ ‘నిజం’, రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’ వరకు - ఈ సోమవారం (మార్చి 3) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

Continues below advertisement