Satyabhama Serial Today Episode క్రిష్ ఫుల్లుగా తాగేసి ఇంటికి వస్తాడు. సత్య క్రిష్‌ని ఏంటి ఇలా క్రిష్ అని అంటే నాకు ఎవరూ లేరు నేను ఎవరికీ ఏం కాను అని అంటాడు. బాపు నన్ను పిలుస్తాడు. నేను లేకుండా ఉండలేను అని అంటాడు. అదంతా జరగదు అని సత్య అంటుంది. నేను లేనా క్రష్ నీకు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్. మనం కలిసి సంతోషంగా ఉందా అంటుంది.

క్రిష్ సత్యతో మా బాపుకి నేను అంటే ఇష్టం నా మీద ఇష్టం మారదు. నా కోసం వస్తాడు. అని చెప్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు నా కోసం బాపు తప్పకుండా వస్తాడు. నన్న చూడకుండా ఉండలేడు అని క్రిష్ అంటాడు. మత్తులోనే సత్యకి ఫోన్ ఇచ్చి నీ దగ్గర ఫోన్ ఉంచు బాపు ఫోన్ చేస్తే నాకు ఇవ్వు నేను మాట్లాడకపోతే ఫీలవుతాడు. నేను మాట్లాడుతా నువ్వు నన్ను లేపు కాసేపు పడుకుంటా అంటాడు. సత్య క్రిష్‌ని చూసి ఎలా కాపాడుకోవాలి అని ఫీలవుతుంది. మరోవైపు మైత్రి హర్షకి కాల్ చేస్తుంది. నందిని చూసి స్పీకర్ ఆన్ చేయమని హర్షతో చెప్తుంది. స్పీకర్ ఆన్ చేస్తే మైత్రి ఆ రోజు రాత్రి గురించి మాట్లాడితే దొరికిపోతా అనుకుంటాడు. మైత్రి హర్షకి డాక్యుమెంట్లు తీసుకురమ్మని అంటుంది. ఇక నందినిని మొండిది నిన్నుఎత్తుకెళ్లిపోతా అనుకుంటుందని అని అంటుంది. ఆ మాటలకు నందిని హర్ట్ అయిపోతుంది. మరోవైపు సత్య మహదేవయ్య ఇంటికి వెళ్తుంది. 

భైరవి: ఆగు.. ఏంటి ఎగేసుకుంటూ వస్తున్నావ్ ఇది ఏమైనా నీ అత్తారిళ్లు అనుకుంటున్నావా. వచ్చేముందు అడిగి రావాలి అని లేదా.జయమ్మ: వచ్చింది ఎవరో తెలుసా పాతికేళ్లు మీకు ఊడిగం చేసిన చిన్నా భార్య. మీరు గెంటేసిన మళ్లీ వచ్చిందంటే ఆత్మాభిమానం చంపుకొని వచ్చుంటుంది. ఎందుకు వచ్చిందో అడగండి.సంజయ్: ఎందుకు వస్తుంది అనాల్సినవి మిగిలి ఉంటాయి.భైరవి: అంటే ఎవరూ పడరుఇక్కడ చంప పగులుతుంది. సత్య: నేను గొడవ చేయడానికి రాలేదు నాకు అంత ఓపిక లేదు. కాదు అనుకొని వెళ్లి మళ్లీ ఇక్కడికి రావడం నా ఆత్మాభిమానం చంపుకోవడమే. ఇక్కడ ఎలాంటి అవమానం జరుగుతుందో తెలుసు అన్నీంటికీ సిద్ధపడి వచ్చా. మామయ్య మామయ్య.. మామయ్య. సంజయ్: సంధ్య మీ అక్క రాయభారానికి వచ్చింది కాఫీ ఇవ్వు.సంధ్య: అంత అవసరం లేదుసత్య: నేను చిన్నా గురించి మాట్లాడటానికి వచ్చాను అత్తయ్య.భైరవి: అత్తయ్యా అది ఎవరు. నేనే నీ అత్తని కాదు. చిన్నా ఎవరు.సత్య: చిన్న ఎవరో గుర్తు చేయనా మామయ్యకి కత్తిపోటు తగలబోతే అడ్డుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు చూడండి అతను చిన్నా అంటే. గంగ వచ్చి చిన్నా మీ కొడుకు కాదు అంటే మీరు గుండెలు బాధుకున్నారు చూడండి అతనే చిన్నా అంటే. మీ చిన్నా ఎవరో గుర్తొచ్చిందా.మహదేవయ్య: నేను గుర్తు చేయాల్సినవి ఉన్నాయి వింటావా. నేనే చిన్న కన్న తండ్రిలా ఉన్నాను. నువ్వే నేను కాదని నిరూపిస్తున్నాను అన్నావు.సత్య: నేను వాదనకు రాలేదు. క్రిష్ ఇప్పటికీ మిమల్నే బాపుగా అనుకుంటున్నాడు.  మహదేవయ్య: నా కొడుకూ అంటూ మీ మామ తీసుకెళ్లాడు బాపు అని పిలిపించుకోలేపోయాడా.సత్య: గుండెల మీద కత్తితో పొడిచినా మిమల్ని తప్ప మరో వ్యక్తిని క్రిష్ బాపు అని పిలవడానికి సిద్ధంగా లేడు. దిగులు పెట్టుకున్నాడు మిమల్ని చూడాలి అని మీతో ఒడిలో వాలాలి అని దిగులు పెట్టుకున్నాడు.సంజయ్: మా డాడ్ వాడిని గుండెల మీద తన్నాడు. నువ్వు నమ్ము తున్నావా మామ్.భైరవి: లేదు.సత్య: ఒక్క సారి వచ్చి క్రిస్‌ని ఇది వరకులా ప్రేమగా పిలవండి హక్కున చేర్చుకోండి. బాపు అని పిలిచే అవకాశం క్రిష్‌కి ఇవ్వండి అది జరగకపోతే మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాడు. జీవితాంతం సంతోషం కోల్పోతాడు. దయచేసి ఒక్క సారి క్రిష్‌ని దగ్గరకు చేర్చుకోండి.మహదేవయ్య: ఈ తెలివి ఇంత కాలం ఏమైంది. నా నుంచి గుంజుకుపోయినప్పుడు ఏమైంది. ఎమ్మెల్యేగా నా మీద పోటీ చేసినప్పుడు తెలివి ఏమైంది. ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చావు.జయమ్మ: అంత బతిమాలుతుంది కదా వెళ్లరా.భైరవి: దగ్గరుండిని కొంగున కట్టుకొని నాటకాలు ఆడించింది. ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది. థ్‌్రసత్య: నా మీద కోపం ఉంటే నా మీద చూపించండి క్రిష్ దగ్గరకు ఒక్క సారి రండి మామయ్య. భైరవి: పోమ్మో పో... ఇవాళ్టి ఎపిసోడ పూర్తయిపోతుంది. 

Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!