Ammayi garu Serial Today February 28th: అమ్మాయి గారు సీరియల్: విడాకులిస్తే సూసైడ్ చేసుకుంటానని అత్తని బెదిరించిన మౌనిక..!

Ammayi garu Today Episode దీపక్‌కి కరెంట్ షాక్ పెట్టి స్వామీజీలు పరుగులు పెట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Ammayi garu Serial Today Episode దీపక్‌ని కోలుకునేలా చేయాలి అని రాజు స్వామీజీ గెటప్‌లో దీపక్‌కి చుక్కలు చూపిస్తాడు. నాలుకకు త్రిశూలం గుచ్చడంతో అరుస్తాడు. చేతులను వేడి నీటిలో పెట్టడంతో అరుస్తాడు. ఇక చివరి ప్రయత్నం అంటూ కాళ్లు రావాలని కరెంట్ షాక్ పెట్టి షాక్ ట్రీట్మెంట్ అని అంటారు. దీపక్, విజయాంబికలు షాక్ అయిపోతారు. రాజు దీపక్‌ కాళ్లకి షాక్ ఇవ్వగానే దీపక్ గజగజా వణుకుతూ కాళ్లు కింద పెట్టేస్తాడు. అందరూ చలనం వచ్చిందని సంతోష పడతారు. 

Continues below advertisement

మూడో సారి షాక్ పెట్టడంతో దీపక్ లేచి పరుగులు పెడతాడు. మామూలు మనిషి అయ్యాడని అందరూ అనుకుంటారు. రూప వాళ్లు నవ్వుకుంటారు. విజయాంబిక కొడుకుని ఓదార్చుతుంది. అందరూ స్వామీజీని స్వామీజీ గెటప్‌లో ఉన్న రాజుని పొగిడేస్తారు. దీపక్ కుయ్యో ముర్రో అంటాడు. ఇక సూర్య ప్రతాప్ అందరినీ త్వరగా రెడీ అవ్వండి కోర్టుకు వెళ్దామంటే దానికి దీపక్ మామయ్య ఒళ్లు హూనం అయిపోయిందని అంటాడు. దానికి స్వామీజీ ఓ ఔషధం ఇచ్చి ఇది తాగితే నొప్పులన్నీ పోతాయని అంటారు. దీపక్ చేదు అనుకొని తాగను అని ఏడుస్తాడు. అందరూ బలవంతంగా తాగిస్తారు. స్వామీజీలు ఇద్దరూ వెళ్లిపోతారు. 

సూర్యప్రతాప్ వాళ్లు కోర్టుకి వెళ్తారు. విజయాంబిక వాళ్లు టెన్షన్ పడటంతో సూర్య ప్రతాప్ ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏమైనా ప్రాబ్లమా అంటే దానికి రూప ఈ విడాకులు తీసుకోవడం వాళ్లకి ఇష్టం లేనట్లు ఉందని అంటుంది. వాస్తవానికి అదే నిజం అని విజయాంబిక అంటుంది. నాకు అన్యాయం చేస్తారా అత్తయ్యా అని మందారం అంటే దానికి విజయాంబిక మౌనికకి అన్యాయం జరుగుతుందని బాధగా ఉందని అంటుంది. దానికి చంద్ర అన్నయ్య మౌనికకు న్యాయం చేస్తారని అంటాడు. ఇక సీఎం అయితే 3 నెలల తిరగక ముందే నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అంటారు. మందారం చనిపోతే నాకు న్యాయం జరుగుతుందని మౌనిక అనుకుంటుంది.

టైం అయిందని సూర్య ప్రతాప్ అందరినీ లోపలికి తీసుకెళ్తారు. ఇక దీపక్, విజయాంబికలు రూపతో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావ్ అంటే నువ్వు చేసింది ఏంటి అని రూప అడుగుతుంది. నేనేం తప్పు చేశాను అని మౌనిక అడిగితే నువ్వు ముందు నుంచి తప్పు చేస్తున్నావ్ వీళ్లని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని అంటుంది. మీతో నేను మాట్లాడాలి అని మౌనిక అత్తా వాళ్లకి చెప్తుంది. వాళ్లని పక్కకి తీసుకెళ్లి ఈ విడాకులు వస్తే నేను ఇదే కోర్టు మీద నుంచి దూకి చనిపోతా అంటుంది. అన్నీ తెలిసి నువ్వు ఇలా అనడం బాలేదని విజయాంబిక అంటుంది. మాకు నీతో ఉండాలని మందారాన్ని వదిలేయాలి అనే ఉందని అంటుంది విజయాంబిక. ఇప్పుడేం చేస్తారని అంటుంది. దాంతో విజయాంబిక ఇప్పుడు ఓకే అన్నా ఆరు నెలలు టైం ఇస్తారు కదా ఈలోపు కథ మార్చేద్దాం అంటుంది. దీపక్ నేను విడాకులకు ఒప్పుకోను మమ్మీ అని అంటాడు. మామయ్యతో మాట్లాడమని విజయాంబికకు చెప్తాడు.

కోర్టులో దీపక్, మౌనికలకు బోనులోకి పిలుస్తారు. రాజు కోర్టుకి వచ్చి చాటుగా చూస్తాడు.  పెళ్లి అయిన నెలకే విడాకులు ఏంటి అని వాళ్లని పెద్దల్ని అందరినీ జడ్జి తిడతాడు. మీకు విడాకులు ఇష్టమేనా అని అడుగుతారు. దీపక్‌ని అడిగితే దీపక్ ఇష్టమే అంటాడు. మౌనిక షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!

Continues below advertisement