Seethe Ramudi Katnam Serial Today February 28th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతని ఇంట్లో నుంచి గెంటేసిన రామ్.. త్వరలోనే విడాకులు రామ్‌కి మరో పెళ్లని మహా హెచ్చరిక!
Seethe Ramudi Katnam Today Episode సీత మహాని చంపాలని అనుకుందని సీతని రామ్ ఇంట్లో నుంచి గెంటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ సీతని అరెస్ట్ చేయొద్దని చెప్పి సీఐ త్రిలోక్‌ని పంపేస్తుంది. తర్వాత రామ్‌తో ఏం చేసినా నేను మీ మంచి కోసమే చేస్తాను రామ్ కానీ ఇంత జరిగిన తర్వాత సీతతో కలిసి ఉండాలంటే భయంగా ఉంది రామ్ అని మహాలక్ష్మీ చెప్తుంది.
మహాలక్ష్మీ: మొన్ననే నీ కన్న తల్లి దూరం అయింది. ఇప్పుడు ఈ పిన్నిని దూరం చేసుకుంటావేమో. నేనే కాదు సీతకు ఎదురు తిరిగితే ఎవరినైనా చంపేస్తుంది.
రామ్: సీత చేయకూడని తప్పు చేసింది. తను ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. తనని ఏం చేయాలో రేపు చెప్తున్నా. సీత చాలా ఏడుస్తుంది.
అర్చన: ఎందుకు మహా సీతని అరెస్ట్ చేయకుండా ఎందుకు అడ్డుకున్నావ్ మహా.
మహాలక్ష్మీ: ఇప్పుడు అరెస్ట్ చేయిస్తే ఆ శివకృష్ణ బయటకు తీసుకొచ్చేస్తాడు. రివర్స్‌లో వెళ్తే రామే చూసుకుంటాడు. కచ్చితంగా సీతని వదిలేస్తాడు. ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు. ఆ సీత బయట ఉంటేనే నేను దానికి నరకం చూపించగలను. రేపటి నుంచి సీతకి చుక్కలే రామ్ సీత విడిపోవడం ఖాయం.
అర్చన మహాలక్ష్మీ కాళ్లకు దండం పెట్టి నువ్వు సూపర్ అంటుంది. రామ్ గదిలో కోపంగా ఉంటే సీత వస్తుంది. రామ్ సీతని చూసి కోపంగా డోర్ వేసేస్తాడు. నేనేం తప్పు చేయలేదు అని బయట నుంచి బతిమాలుతుంది. రామ్ గదిలో ఏడుస్తూ నేను మూసింది గది తలుపులే కాదు నా మనసు తలుపులు కూడా అని అంటాడు. సీత డోర్ దగ్గర కూలబడి ఏడుస్తుంది. ఉదయం అందరూ సీతని రామ్ శిక్షిస్తాడని అనుకొని హాల్‌లో వెయిట్ చేస్తాడు. మహాలక్ష్మీ జనార్థన్‌తో సీతకి రామ్ ఏం శిక్ష వేసినా ఎవరూ ఆపొద్దని అంటుంది. సీత బ్యాగ్ తీసుకొని కిందకి వస్తుంది. రామ్ అందరితో సీత ఉంటే పిన్ని తనకు భద్రతలేదు అంటుంది అందుకే సీతని పంపేయాలి అనుకుంటున్నా అంటాడు.
చలపతి: సీతని పంపేస్తావా అంటే సీతని వదిలేస్తున్నావా రామ్. నువ్వేం మాట్లాడవేంటి బావ ఇంటి పెద్దగా నీకు ఆ అధికారం ఉంది.
జనార్థన్: ఇన్నాళ్లు సీతకు మహాకు గొడవలు ఉంటే అత్తాకోడళ్ల గొడవలు అనుకుంటున్నా. కానీ సీత చంపేదాకా వచ్చిందంటే నమ్మలేకపోతున్నా.
చలపతి: రామ్ కనీసం సీతకు కట్టిన తాళికి అయినా విలువ ఇవ్వు
రామ్: తాళికి విలువ ఇచ్చాను కాబట్టే సీతని ఇంటినుంచి పంపేస్తున్నా లేదంటే జైలుకి వెళ్లేది.
చలపతి: నువ్వు ఏం తప్పు చేయలేదని చెప్పమ్మా
సీత: నేను తప్పు చేశానని నా మామే నమ్మినప్పుడు నేనేం మాట్లాడను బాబాయ్. నేను ఇప్పుడు ఏం చెప్పినా ఎవరూ నమ్మరు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది.
మహాలక్ష్మీ: మనసులో ఒకసారి నువ్వు కాలు బయట పెడితే మళ్లీ ఈ ఇంట్లోకి రాలేవే. రానివ్వను.
చలపతి: త్వరలోనే పశ్చాత్తాపపడతావు రామ్.
రామ్: ఆ మాటలు అనవసరం మామ నువ్వు బయల్దేరు సీత దయచేసి మళ్లీ రావొద్దు.
మహాలక్ష్మీ: రామ్ చెప్పింది అర్థమైంది కదా ఇక ఎప్పటికీ నీకు ఈ ఇంట్లో స్థానం లేదు.
అర్చన: మహాని చంపాలనుకున్నందుకు నీకే ఇదే సరైన శిక్ష
గిరి: సుమతి వదినను చంపినందుకు కూడా.
సీత ఏం మాట్లాడకుండా బ్యాగ్ తీసుకొని సుమతి ఫొటోకి దండం పెట్టి రామ్‌ని చూసి వెళ్లిపోతుంది. రామ్‌ని తలచుకొని బాధపడుతుంది. సాంబ సీతని ఆపి దేవుడు మీకు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదని అంటాడు. మహాలక్ష్మీ అక్కడికి వస్తుంది. సాంబని పంపేసి సీతతో నీ బతుకు ఇలా రోడ్డున పడిందేంటి సీత. ఇది నీకు ఇప్పుడో జరగాల్సింది. నాకు ఇష్టం లేకుండా నా కోడలిగా వచ్చావ్. ఇక ఎప్పటికీ ఈ ఇంటికి రాలేవ్.. రేపో ఎల్లుండో నీకు విడాకులు ఇప్పిస్తా రామ్‌కి నాకు నచ్చిన చక్కటి చుక్కతో పెళ్లి చేస్తా. ఈ ఇంట్లో నీ చాప్టర్ కూడా ముగిసిపోయింది సీత గుడ్ బాయ్ అని చెప్తుంది. దానికి సీత నేను కామ్‌గా ఉన్నానని మాట్లాడి వెళ్లిపోతున్నావ్ నేను తప్పు చేయలేదు అని మామకి నిరూపిస్తా. ఆ రోజే నువ్వు దోషి అని నిరూపిస్తా అని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!