Mohanlal - L2 Empuraan : మోహన్ లాల్ మాస్టర్ ప్లాన్ - కెరీర్‌లో ఫస్ట్ టైమ్, ఆ ఆరు నెలలూ!

Prithviraj Mohanlal Movie : మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా యంగ్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లూసిఫర్ 2 : ఎంపరన్' స్టార్ట్ చేస్తున్నారు.

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా గుర్తు ఉందా? ఆ కథ చిరు కోసం రాసినది కాదు! మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ (Mohanlal) కోసం రాసింది. ఆయన హీరోగా మలయాళ యువ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించిన 'లూసిఫర్' (Lucifer Movie Malayalam) కు 'గాడ్ ఫాదర్' రీమేక్. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకు అంటే... సీక్వెల్ రూపొందుతోంది.
 
'లూసిఫర్ 2'... లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసినా?
'లూసిఫర్'కు సీక్వెల్‌గా 'లూసిఫర్ 2 ఎంపరర్' (Lucifer 2 Empuraan) సినిమా వస్తోంది. గత ఏడాది మేలో స్క్రీన్ ప్లే కంప్లీట్ చేసినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక అప్ డేట్ ఇచ్చారు. తర్వాత ఆగస్టులో మరోసారి సినిమా టీమ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. మోహన్ లాల్, నిర్మాత ఆంటోనీ పెరంబవూర్, నటుడు మురళీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయలేదు. ఈ ఆగస్టులో సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.
 
ఆరు నెలలు మరో సినిమా చేయకూడదని!
'లూసిఫర్ 2' కోసం మోహన్ లాల్ ఆరు నెలలు డేట్స్ కేటాయించారట. ఫస్ట్ పార్టులో స్క్రీన్ మీద ఆయన కనిపించేది తక్కువ సేపే. అయినా సరే... కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. సెకండ్ పార్టులో మాత్రం ఆయన రోల్ లెంగ్త్, స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ సేపు ఉంటాయట. అందుకని, ఆరు నెలలు డేట్స్ ఇచ్చారట. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే... ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారట. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మోహన్ లాల్ ఈ విధంగా ఎప్పుడూ చేయలేదు. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ, ఈసారి ఒక్కటే చేయాలని డిసైడ్ కావడం విశేషమే. దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

Continues below advertisement

Also Read : బాలకృష్ణ ఫ్యాన్స్‌కు హాట్‌స్టార్ గిఫ్ట్ - స్పెషల్ సాంగ్ రెడీ, రిలీజ్ ఎప్పుడంటే?

Mohan Lal Back As Devil : 'లూసిఫర్' సినిమాలో మోహన్ లాల్‌ను రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన నాయకుడిగా చూపించారు. ముంబై మాఫియాతో అతడిని సంబంధాలు ఉన్నట్లు, కనుసైగతో మాఫియాను శాసించగల సత్తా ఉన్న డాన్‌గానూ పరిచయం చేశారు. ఇక, క్లైమాక్స్‌లో అయితే మోహన్ లాల్ హెలికాఫ్టర్ నుంచి దిగిన షాట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇప్పుడీ 'లూసిఫర్ 2'లో మోహన్ లాల్ డాన్ రోల్ హైలైట్ కానుందని టాక్. డెవిల్ గా ఆయన చూపించే హీరోయిజం నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని టాక్.  

Also Read : టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ఇప్పుడు రామ్ చరణ్ - హాలీవుడ్‌లో క్రేజ్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే

మలయాళంలో హీరోగా మోహన్ లాల్, దర్శకుడిగా పృథ్వీరాజ్‌ది హిట్ కాంబినేషన్. 'లూసిఫర్'తో పృథ్వీరాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మోహన్ లాల్ హీరోగా 'బ్రో డాడీ' సినిమా చేశారు. 'లూసిఫర్' యాక్షన్ ఫిల్మ్ అయితే... 'బ్రో డాడీ' రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రెండూ మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో సినిమాకు రెడీ అవుతున్నారు.

Continues below advertisement