గుడ్ మార్నింగ్ అమెరికా (Good Morning America)... పాపులర్ టీవీ షో. అమెరికన్స్ ఎక్కువగా చూసే టెలివిజన్ కార్యక్రమాల్లో ఇదొకటి. ఇప్పుడీ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాజరు కానున్నారు. అదీ ఈ రోజే. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్ ఇది. అసలు వివరాల్లోకి వెళితే...
రాత్రి 11.30 గంటలకు చరణ్ ప్రోగ్రామ్
'గుడ్ మార్నింగ్ హైదరాబాద్' అని మెగాస్టార్ చిరంజీవి 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో ఓ సాంగ్ ఉంది. లిరిక్ కొంచెం చేంజ్ చేస్తే.... 'గుడ్ మార్నింగ్ అమెరికా' అని ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) చెప్పనున్నారు. ఇప్పుడు ఆయన ఖ్యాతి అమెరికన్ ఆడియన్స్ కు చేరింది. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోకి వెళ్ళనున్నారు.
అమెరికన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 11.30 గంటలకు రామ్ చరణ్ పార్టిసిపేట్ చేసే ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.
టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో కూడా
టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ర్యాన్ రెనాల్డ్స్ వంటి హాలీవుడ్ టాప్ హీరోలు 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో సందడి చేశారు. ఇండియా నుంచి న్యూ ఏజ్ స్టార్స్ ఈ షోకి వెళ్ళడం రామ్ చరణ్ (Ram Charan)తోనే మొదలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి తెలుగు హీరో, న్యూ ఏజ్ ఇండియన్ స్టార్ ఆయనే. ఈ విషయంలో చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.
Also Read : సెట్స్‌లో పవన్ కళ్యాణ్ - మేనల్లుడితో షూటింగ్ షురూ
'గుడ్ మార్నింగ్ అమెరికా'లో ఇప్పటి వరకు ఇండియా స్టార్స్ ఇద్దరు మాత్రమే కనిపించారు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తున్న ప్రియాంకా చోప్రా ఒకరు అయితే... బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మరొకరు.
HCA Awards 2023 వేదికపై చరణ్!
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంస్థ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ సినిమాలను గుర్తించి అవార్డులు అందజేస్తుంది. ఈ ఏడాది హెచ్.సి.ఎ అవార్డులకు నాలుగు విభాగాల్లో నామినేట్ అయ్యింది.
సినిమా, దర్శకత్వం, అంతర్జాతీయ సినిమా, యాక్షన్ ఫిల్మ్ విభాగాల్లో హాలీవుడ్ సినిమాలతో 'ఆర్ఆర్ఆర్' పోటీ పడుతోంది. అవార్డులు ఏయే విభాగాల్లో వస్తాయి? అనేది ఈ నెల 24న బెవర్లీ హిల్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో తెలుస్తుంది. అసలు విషయం కాదు... ఆ పురస్కారాల కార్యక్రమంలో వేదికపై రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఆయన్ను ప్రజెంటర్ గా హెచ్.సి.ఎ ఆహ్వానించింది. అదీ సంగతి! హెచ్.సి.ఎ అవార్డుల్లోని విజేతలలో ఒకరిని రామ్ చరణ్ అవార్డు ఇవ్వనున్నారు. ఆ ఘనత అందుకున్న తొలి హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.
Also Read : ఇంటికి పంపాలనుకున్నా వెళ్ళను, పవర్ స్టార్ స్థాయికి ఎదుగుతా, మీకెందుకు తొందర? - కిరణ్ అబ్బవరం
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' (Naatu Naatu Song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ట్రెండ్ చూస్తే అవార్డు మన తెలుగు పాటకు రావడం పక్కా అని చెప్పవచ్చు. ఇంతకు ముందు గోల్డెన్ గ్లోబ్ (golden globe awards 2023 winners) పురస్కారాల్లో కూడా 'నాటు నాటు...' అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆ అవార్డుల కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్ళారు. అప్పుడు అక్కడి ప్రేక్షకుల నుంచి ఆయనకు విపరీతమైన స్పందన లభించింది. 'ఆర్ఆర్ఆర్'లో ఆయన నటనకు విశేషాల్లోని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమా ప్రముఖులు సైతం అభిమానులు అయ్యారు. ప్రముఖ హాలీవుడ్ దర్శక - నిర్మాత, 'టైటానిక్' & 'అవతార్' చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పాత్ర గురించి మాట్లాడారు.