మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనెపూడి యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...


ఇటలీ, గోవా తర్వాత హిమాలయాలకు...
Gopichand 32 Lengthy Schedule Begins Today In Himalayas: గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో మొదటి సినిమా ఇది. షూటింగ్ కొన్నాళ్ళ క్రితం స్టార్ట్ చేశారు. ఓ షెడ్యూల్ ఇటలీలో చేశారు. ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ గోవాలో చేశారు. ఇప్పుడు సినిమా యూనిట్ అంతా హిమాలయాలకు వెళ్లారు.


''హిమాలయాల్లో గోపీచంద్ సహా ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ఇంతకు ముందు రెండు షెడ్యూళ్లతో పోలిస్తే... ఇది లెంగ్తీ షెడ్యూల్'' అని నిర్మాత వేణు దోనెపూడి పేర్కొన్నారు. ఇంతకు ముందు ఆయన డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు.  


హీరోలకు కొత్త మేకోవర్ ఇవ్వడం దర్శకుడు శ్రీను వైట్ల స్టైల్. 'దూకుడు'లో మహేష్ బాబు కావచ్చు, 'బాద్ షా'లో ఎన్టీఆర్‌ కావచ్చు, 'బ్రూస్ లీ'లో రామ్ చరణ్ కావచ్చు... అంతకు ముందు ఆయా హీరోలు చేసిన సినిమాలతో పోలిస్తే వాళ్లను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు గోపీచంద్ కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారని, ఆయనకు శ్రీను వైట్ల న్యూ మేకోవర్ ఇస్తున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.


Also Read: బాక్సాఫీస్‌ వద్ద తగ్గేదేలే అంటున్న ‘హనుమాన్‌’ - 250 కోట్ల క్లబ్‌లోకి బిందాస్ ఎంట్రీ






గోపీచంద్ కామెడీ టైమింగ్ సూపర్ ఉంటుంది. హీరోలతో పాటు మిగతా ఆర్టిస్టుల నుంచి కామెడీ రాబట్టుకోవడంలో శ్రీను వైట్ల స్పెషలిస్ట్. 'వెంకీ'లో ఆయన తీసిన ట్రైన్ ఎపిసోడ్ అయితే... చాలా మందికి ఫేవరెట్. ఆ కామెడీ ఎపిసోడ్ తరహాలో ఈ సినిమాలో వినోదాత్మక సన్నివేశాలను రూపొందించారట.


Also Read: విజయ్ నా కళ్ల ముందు పెరిగాడు, అతడు నాకు పోటీ కాదు: రజనీకాంత్


సినిమా టైటిల్ 'విశ్వం' అని ఖరారు చేశారా?
ఈ చిత్రానికి 'విశ్వం' టైటిల్ ఖరారు చేసినట్లు టాలీవుడ్ టాక్. అయితే... ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. గోపీచంద్ సినిమా చివర సున్నా వస్తే హిట్ అనే సెంటిమెంట్ ఉంది. అలా టైటిల్స్ ఉన్న సినిమాల్లో  ఒకట్రెండు ఆశించిన విజయాలు అందుకోలేదు. కానీ, మెజారిటీ సినిమాలు హిట్ అయ్యాయి. 



గోపీచంద్ జోడీగా కావ్యా థాపర్
ఈ సినిమాలో గోపీచంద్ సరసన యంగ్ హీరోయిన్ కావ్యా థాపర్ నటిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ 'ఈగల్', సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. ఇంకా ఈ చిత్రానికి ప్రముఖ రచయిత గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను' చిత్రాలకు గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందించడమే కాదు... 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' చిత్రాలకు కథలు సైతం అందించారు. గోపీచంద్ హీరోగా నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకు కూడా పని చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రాఫర్.