Lal Salaam Audio Launch: తెలుగుతో పోలిస్తే తమిళ సినిమాల్లో ఫ్యాన్ వార్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య జరిగే వార్స్‌ను చూసి నెటిజన్లు నవ్వుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విజయ్ ఫ్యాన్స్.. అప్పుడప్పుడు రజినీకాంత్‌ను కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇక ఇలాంటి ఫ్యాన్ వార్స్‌పై తాజాగా రజినీకాంత్ స్పందించారు. ఆయన అప్‌కమింగ్ మూవీ ‘లాల్ సలామ్’ ఆడియో లాంచ్‌లో హీరోల మధ్య పోటీ గురించి జరుగుతున్న ఫ్యాన్ వార్స్‌పై ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘జైలర్’లో ఆయన చెప్పిన కాకి, డేగ కథను గుర్తుచేసుకున్నాడు.
అప్పుడు తనకు 13 ఏళ్లు..
‘జైలర్’లో ఆయన చెప్పిన కాకి, డేగ కథను గుర్తుచేసుకుంటూ.. ‘‘నేను చెప్పిన కాకి, డేగ కథ వేరే విధంగా అర్థం చేసుకున్నారు. నేను దానిని విజయ్‌కు విరుద్ధంగా చెప్పానని సోషల్ మీడియాలో రూమర్స్ వ్యాప్తి చేశారు. అది నన్ను చాలా నిరాశపరిచింది. విజయ్ నా కళ్ల ముందు పెరిగాడు. ‘ధర్మథిన్ తలైవన్’ షూటింగ్ అప్పుడు విజయ్‌కు 13 ఏళ్లు, నన్ను పై నుండి చూస్తూ ఉన్నాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్.. విజయ్‌ను నాకు పరిచయం చేశారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని నాతో చెప్పారు. ముందు చదువులపై శ్రద్ధపెట్టమని తనను బెదిరించమని అన్నారు. అందుకే ముందు తనకు స్కూల్ పూర్తి చేయమని చెప్పాను. ఆ తర్వాత విజయ్ యాక్టర్ అయ్యాడు. తన కష్టంతో పైకి వచ్చాడు’’ అని విజయ్ గురించి వ్యాఖ్యలు చేశారు రజినీకాంత్.
అలా చేయడం అమర్యాద..
‘‘విజయ్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. మా మధ్య పోటీ ఉందని అందరూ అంటుంటే వినడం బాధగా ఉంది. విజయ్.. తనకు తానే పోటీ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. నేను కూడా అదే మాట చెప్పాను. మా మధ్య పోటీ ఉందని చెప్పడం అమర్యాద. అందుకే మమ్మల్ని పోల్చవద్దని ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు రజినీకాంత్. గతేడాది విజయ్ హీరోగా నటించిన ‘లియో’ మూవీ విడుదలయినప్పుడు కూడా తనకు విషెస్ తెలిపారు రజినీకాంత్. ‘‘ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
సినిమా పోస్ట్‌పోన్..
ప్రస్తుతం రజినీకాంత్, విజయ్ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. రజినీకాంత్ ప్రస్తుతం ‘లాల్ సలామ్’ అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతికే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా.. పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ మూవీ సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. రజినీ కూతురు ఐశ్వర్య రజినీకాంత్.. ‘లాల్ సలామ్’ను డైరెక్ట్ చేసింది. ఫిబ్రవరీ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ సుబస్కరన్.. ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఏఆర్ రెహమాన్.. ‘లాల్ సలామ్’కు సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించింది. రజినీ చివరి చిత్రం ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
Also Read: చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారంపై స్పందించిన మోహన్ బాబు