Mohan Babu about Chiranjeevi Padma Vibhushan Award: తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు మూడు దశాబ్దాలుగా టాప్ 1 హీరోగా చక్రం తిప్పారు చిరంజీవి. అందుకే సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తింపు ప్రభుత్వం ఇప్పటికే ఆయన పేరు మీద ఎన్నో పురస్కారాలు అందించింది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ కూడా దక్కడంతో ఫ్యాన్స్‌తో సినీ సెలబ్రిటీలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు.. అవార్డ్ ప్రకటన జరగగానే చిరును ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. ఇక పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవిని మంచు ఫ్యామిలీ.. అందులోనూ ముఖ్యంగా మోహన్ బాబు ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది.






మంచు ఫ్యామిలీ విషెస్..


‘ఈ గౌరవానికి అర్హతను సాధించినందుకు కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి. నువ్వు ఈ అవార్డ్ అందుకోవడం మా అందరికీ గర్వకారణం’ అని ట్విటర్ ద్వారా చిరంజీవికి విషెస్ తెలిపారు మోహన్ బాబు. ఇక మోహన్ బాబు వారసులు సైతం ఈ విషయంపై ట్వీట్ చేశారు. ముందుగా మంచు విష్ణు రియాక్ట్ అవుతూ.. ‘చిరంజీవి గారు పద్మవిభూషణ్‌ను దక్కించుకున్నారు అనే అద్భుతమైన వార్తను వింటూ నిద్రలేచాను. తెలుగు సినీ పరిశ్రమకు ఇది చాలా గర్వించదగ్గ సందర్భం. కంగ్రాట్స్ చిరంజీవి గారు’ అని సంతోషం వ్యక్తం చేశాడు విష్ణు. ఇక మంచు మనోజ్ సైతం.. ‘మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ దక్కడంతో చాలా గర్వంగా ఫీలవుతున్నాను. తెలుగు సినిమాకు మీరు అందించిన ఎనలేని సహకారం నాలాంటి ఎంతోమంది ఫ్యాన్స్‌కు స్ఫూర్తిగా నిలిచింది’ అంటూ మెగాస్టార్‌కు కంగ్రాట్స్ తెలిపాడు మనోజ్.






నేరుగా కలిసి అభినందనలు..


ఇక చిరంజీవికి పద్మవిభూషణ్ దక్కడంతో చాలామంది సెలబ్రిటీలు ఆయనను కలవడానికి తరలివచ్చారు. ఒకరోజు మొత్తం వచ్చినవారు అందరినీ కలవడంలోనే గడిపేశారు చిరు. అందరినీ కలిసి వారి విషెస్‌ను స్వీకరించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ పురస్కారం గురించి తెలియగానే చిరు ఇంటికి వెళ్లాడు. నిర్మాత దిల్ రాజు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా ఎంతోమంది ప్రముఖులు చిరంజీవిని నేరుగా కలిసి కంగ్రాట్స్ తెలిపారు. ఇక తనతో పాటు ఈ పురస్కారాన్ని అందుకున్న రాజకీయ నాయకుడు వెంకయ్య నాయుడును చిరు వెళ్లి కలిశారు. ఆయనకు నేరుగా కంగ్రాట్స్ తెలిపి సన్మానించారు.


త్వరలోనే సెలబ్రేషన్స్..


చిరంజీవిని కలిసి అభినందనలు తెలిపిన తర్వాత నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ‘‘శివశంకర వరప్రసాద్ నుండి ప్రస్థానం మొదలయ్యి సుప్రీమ్ హీరో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవిలాగా మారిన ఈ జర్నీలో ఆయన ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశారు. తెలుగు సినిమాల్లోనే కాదు.. ఒక సెంట్రల్ మినిస్టర్‌గా, ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూశారు. ఇప్పటివరకు పద్మశ్రీ, పద్మభూషణ్ తీసుకొని ఇప్పుడు పద్మవిభూషణ్ కూడా తీసుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు కూడా సంతోషకరమైన వార్త’’ అంటూ తన సంతోషాన్ని బయటపెట్టారు దిల్ రాజు. ఇక త్వరలోనే ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు.


Also Read: ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ - ‘హనుమాన్’ తరహాలో హాలీవుడ్ చిత్రం, శోభితాకు గోల్డెన్ ఛాన్స్