మొన్నటివరకు భారీ బడ్జెట్ సినిమాలన్నీ థియేటర్లలో ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. దీంతో మీడియం బడ్జెట్ సినిమాలు సైడ్ అయిపోయాయి. 'ఎఫ్3' వరకు అన్నీ బడా సినిమాలే రిలీజ్ కావడంతో.. ఇప్పుడిప్పుడే చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పటివరకు బజ్ ఉన్న సినిమాలు ప్రతీవారం సందడి చేశాయి. ప్రతీవారం ఓ కొత్త సినిమా రావడంతో సెకండ్ వీక్ లో సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టలేకపోతున్నాయి. జూన్ మొదటివారంలో 'విక్రమ్', 'మేజర్' సినిమాలు మంచి కలెక్షన్స్ ను సాధించాయి.
'అంటే సుందరానికీ' విడుదలయ్యే వరకు ఈ సినిమాల కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఎప్పుడైతే నాని సినిమా వచ్చిందో 'విక్రమ్', 'మేజర్' సినిమాల కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. ఇలా ప్రతీవారం మినిమం బజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. కానీ రానా 'విరాటపర్వం' సినిమాకి టఫ్ ఫైట్ ఇచ్చే సినిమాలు రావడం లేదు. జూన్ 17న విడుదలవుతున్న ఈ సినిమాకి రెండు వారాల వరకు బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేదనే చెప్పాలి.
రానా సినిమాతో పాటు సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ అవుతుంది. దీనిపై సరైన బజ్ లేదు. తరువాతి వారం కూడా పెద్ద పేరున్న సినిమాలేవీ రావడం లేదు. 'విరాటపర్వం' సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. రెండు వారాల పాటు మంచి కలెక్షన్స్ రావడం ఖాయం. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటించడం కూడా కలిసొచ్చే పాయింట్. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!
Also Read: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు